ఈ వర్షం సాక్షిగా కలిసిన బంధం

(అంశం:: “నా ప్రేమ కథ”)

ఈ వర్షం సాక్షిగా కలిసిన బంధం

రచన: ఎన్.ధనలక్ష్మి


మనం ఈ వర్షానికి థాంక్స్ చెప్పుకోవాలి తెలుసా !?
అవునా ఎందుకు ఈ వర్షం వల్లే కదా మనం కలిసాము ..ఈ రోజు కూడా వర్షం పడేలా ఉంది ..బహుశా మనం కలవడం వర్షానికి  ఏదో వీడదీయని సంబంధం  ఉంది ఏమో ???
రెడీ  అయి నన్ను కలవడానికి వస్తావా లేదా ఇలాగే మాటలు చెప్పుతూ టైమ్ వేస్ట్ చేస్తావా ఏంటి ???
నీకు తెలుసు కదా నీతో మాట్లాడక పోతే రోజు అనేది పూర్తిఅవ్వదు నాకు…
త్వరగా రావా నిన్ను చూడాలని నా కళ్ళు , నా పాదాలు నీతో నడవాలని ,,చేతులు నిన్ను జాగ్రత్తగా హృదయానికి హత్తుకోవాలని పరి తపిస్తూ ఉంది
వస్తున్నా ….నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ త్రి మాజికల్ వర్డ్స్ చెప్పడానికి నీ ముందుకు నీకు ఇష్టమైన రీతిలో రా బోతున్న ..
లంగా ఓణిలో , చెవులకు ఊగుతున్న జుంకాలు పెట్టుకొని ,చేతులకు సింపుల్ గా డ్రెస్ కి మాచింగ్ అయ్యేలా గాజులు వేసుకొని ,నడుస్తున్నప్పుడు చెవులకి విన్నసొంపుగా మువ్వుల చప్పుడుతో నువ్వు  పరిగెత్తుతూ దగ్గరికి వచ్చి నన్ను గట్టిగ హాగ్ చేసుకొని నీ ప్రేమను తెలపాలి గుర్తు ఉందా
హా బాబు గుర్తు ఉంది అలాగే రెడీ అవుతున్న బై …
అందంగా రెడీ అయి బైక్ పై ఇష్టమైన సాంగ్ వింటూ వెళ్తున్న  …
ఒక్క సారిగా ఆక్సిడెంట్ ..
వరుణ్ అంటూ ఉలిక్కిపడి లేచింది ..
ఏమైంది వర్ష …ఏమైనా పీడకల వచ్చిందా …
పీడకల కాదు నా జీవితాన్ని అతలాకుతలం చేసిన కల అని ఏడుస్తూ వాళ్ళామ్మను హత్తుకొని ఏడుస్తుంది ..
ఇద్దంతా భయట నుండి చూస్తున్న ప్రకాశం గారు మొదట బాధ పడిన నవ్వుకుంటూ లోపలికి వచ్చి …
” తల్లి పీడకల వస్తే మంచి ఐస్ క్రీం తిని మర్చిపోవాలని కానీ ఏడుస్తూ ఉంటారా ..
జీవితం ఎప్పుడు ఎక్కడ ఎవరి కోసము ఆగిపోదు రా …
తిను అంటూ ఐస్ క్రీం తినిపించి …
తల్లి వర్ష నీకో సంబంధం వచ్చింది .అబ్బాయీ మనం మొన్న వెళ్ళిన మీ అన్న పెళ్ళిలో చూసి ఇష్టపడ్డారు అంటా ..
ఏవండీ మన అమ్మాయీ పరిస్థితి తెలుసా వారికీ ..
లక్ష్మి ..మన అమ్మాయీ కి ఆక్సిడెంట్ లో కాలు కోల్పోయినది అని తెలుసు ..
అన్నీ తెలిసే వారు మన అమ్మాయీ ని అడిగారు ..
నువ్వు ఏమి అంటావు రా ..
మీ ఇష్టము నాన్న .
జాలి పడి కాకుండా ఇష్టపడి చేసుకుంటున్నాడు .
అలాంటి అబ్బాయీ మన అమ్మాయి జీవితంలో కి వస్తే జీవితం సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం వచ్చింది .
ఈ మాటలు విన్న వర్ష మనసులో ” నాన్న కోసం అయినా పెళ్లి చేసుకోవాలి ”
మరుసటి రోజు పెళ్లి వారు రాగనే ప్రకాశం సాదరంగా ఆహ్వానించారు ..
లక్ష్మి  వర్ష ని అందంగా తయారు చేశారు…
వర్ష స్టిక్ సాయంతో బయటకి వచ్చింది. తల దించుకునే వారికి నమస్కరించి చైర్ లో కూర్చుంది.
బావగారు మీ అమ్మాయీ మాకు బాగా నచ్చింది.
ఒక్కసారి పిల్లలిద్దరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాకా…మీకు, మీ అమ్మాయీ కి ఒకే అంటే మనం మిగితా విషయాలు మాట్లాడుకుందాం..
వర్ష అబ్బాయిని అలా మన పెరడు లోకి తీసుకొని వేళ్ళు..
వర్ష ముందుగా వెళ్లి కుర్చీలు వేసింది…
అడుగుల చప్పుడు విని వర్ష అటు తిరిగి నిలపడి
” మీరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి వచ్చారు నాకు ఉన్న లోపాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చారు… మీ మనసుకు నా హృదయ పూర్వక నమస్కారాలు..కానీ మన బంధం మొదలు అవ్వక ముందే మీకు నా గతం గురించి చెప్పాలి..విన్న తరువాత మీ నిర్ణయం ఏదైనా సరే సంతోషంగా స్వీకరిస్తాను…
నా గురించి మీకు ఓ విషయం చెప్పాలి…
అమ్మ నాన్న ,నా ఫ్రెండ్స్ ఇది తప్ప నాకు వేరే లోకం తెలియదు…అలాంటి నా జీవితంలోకి అతిధిల వచ్చారు వరుణ్… అసలు మా పరిచయం ఎలా జరిగింది అంటే…
గతం……
” అబ్బా నేను చెప్పాను క్లైమేట్ బాగాలేదు అని…
నువ్వే మాచింగ్ గాజులు కావాలి, కమ్మలు కావాలి అని విసిగించి మరి రాను నన్ను లాక్కొని వచ్చావు లల్లి…ఇప్పుడు చూడు ఒక్క బస్ రాలేదు, ఆటోలు రాలేదు ,వాన ఎక్కువ అవుతుంది… క్యాబ్ బుక్ చేద్దాం అన్న ఫోన్ లో  సిగ్నల్స్ లేవు అసలు..నేను చెప్పాను నాన్న రిపేర్ లో ఉన్న నా స్కూటీ ని తీసుకొని వస్తారు అని చెప్ప..నువ్వు ఓపిక పట్టకుండా లాక్కొని వచ్చావు… నిన్ను..
”  రేపు నా పుట్టిన రోజు ,పైగా  మా బావ వస్తున్నాడు వాడికి నేను నచ్చాలి కదా.అందుకే నిన్ను ఇబ్బంది పెట్టాను రా…నేను కావాలని చేయలేదు రా..నేను వాన వచ్చేలోపు వెళ్లిపోవచ్చు అనుకున్న..ఇలా అవుతుంది అనుకున్న రా.. సారి రా అని ఏడుస్తూ అంటుంది బాధగా లల్లి”
” అయ్యో ఏడవకు రా..పర్లేదు తగ్గిన తరువాతే వెళ్దాము లే”
” హమ్మయ్య నమ్మేసింది ..లేదు అంటే ఇంకా గంట క్లాస్ పికేది…
వర్ష మొహానికి స్కార్ఫ్ కట్టుకుంటుంది…సైనస్ ప్రోబెమ్ వల్ల…
అప్పటికే వాళ్ళు బస్ స్టాప్ కి  వచ్చి గంట అయింది..
వాన కూడా ఎక్కువ అయింది . రోడ్ అంత నిర్మానుష్యంగా ఉంది
ఇంతలో ఒక క్యాబ్ కార్ వచ్చి ఆగింది వాళ్ల ముందర
అందులోనుంచి ఒక్కరూ దిగారు…
అందానికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ లాగ ఉన్నాడు…
నవ్వుతూ వీళ్ళ దగ్గరికి వచ్చారు..ఏమిటి విషయం అని అడిగారు .
వర్ష, లల్లి ఇద్దరు మొదట భయపడ్డ దైర్యంగా వారి సమస్యను చెప్పారు..
అతను మాతో పాటు రండి మేము సేఫ్ గా మీ ఇంటి దగ్గర దించుతాము అన్నారు..
లల్లి నవ్వుతూ ముందుకు వెళ్తుంటే వర్ష
” అతని వైపు చూసి…థాంక్స్ అండి పర్లేదు వి కెన్ మేనేజ్  మీరు వెళ్ళండి…
” అతను నవ్వుతూ మీ భయం అర్థం అయింది .
తెలియని వ్యక్తితో ఎలా వెళ్ళాలి అని కదా…అబ్బాయిలు అందరు రేపిస్టులు కాదండి .
జరుగుతున్న,చూస్తున్న సిట్యుయేషన్ వల్ల మీరు అలా ఫీల్ అవుతున్నారు దానిలో తప్పు ఏమీ లేదు .. మీ లాగ కొంచం జాగ్రతగా ఉండాలి లే అండి..
ఒక్క నిమిషం అండి రేయ్ విక్కి నువ్వు వచ్చేయ్ బయటకి మనం తర్వాత వెళ్దాము..మీరు వెళ్ళండి ఇప్పుడు ఆ క్యాబ్ లో..
రేయ్ మామ నీకు ఏమైనా పిచ్చా..నువ్వు హెల్ప్ చేస్తాను అన్న వాళ్ళు రాలేదు…వారి కోసం మనం టైమ్ వేస్ట్ చేసుకొని ఇలా వానలో నిలపడడం అవసరమా చెప్పు…
మనం అబ్బాయిలం ఎలాగ అయిన ,ఎంత కష్టం అయిన ఉండగలం రా…కొద్దీ సెపటిలో చీకటి పాపం ఒంటరి అమ్మాయిలం ఎలా ఉండగలరు…
మీరు వెళ్ళండి…వర్ష అతని మాటలకి ఫిదా, లల్లి చాలా థాంక్స్ అన్నయ్య అంది..నా పేరు లల్లి,తను నా ఫ్రెండ్ వర్ష ..సరే చెల్లి జాగ్రత్తగా వెళ్ళండి..
అతను క్యాబ్ డ్రైవర్ తో జాగ్రత భయ్య …
మీరు దించిన తరువాత వీలు అయితే మమ్మల్ని పిక్ అప్ చేసుకోగలర…
సర్ నేను కూడా ఇంటికి వెళ్ళాలి…
మా బావమరిది ఒకరు ఆటో నడుపుతారు
అతనిని పిలిపిస్తాను మీరు దానిలో వెళ్ళండి ..
థాంక్స్ బయ్య.
కార్ ముందుకు వెళ్తుంటే ..అద్దంలో అతనిని చూస్తూ ఉండిపోతుంది వర్ష….
కొద్దీ సేపటికి వారి ఇల్లు రాగనే దిగుతున్నప్పుడు చూశారు సీట్ లో లాప్ టాప్ అండ్ ఏవో సర్టిఫికెట్స్ ఉన్న బ్యాగ్. దానిని తీసుకుంది
ఇంటికి వెళ్ళి  ఫ్రెష్ అయి వాటిని ఓపెన్ చేసి చూసింది…
” పేరు వరుణ్…విప్రో లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా సెలెక్ట్ అయినట్టు అప్పాయిన్మెంట్ లెటర్ ఉంటుంది… బయో డేటా ఫార్మ్ లో ఉండే ఫోన్ నంబర్ కి కాల్ చేస్తే
ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది…
మాకు హెల్ప్ చేసే తొందరలో తన థింగ్స్ మర్చిపోయారు..ఎలాగ అయిన వీటిని తనకి అంద చేయాలి…ఎంత మంచోడు నేను చెప్పకముందే భయాన్ని అర్థం చేసుకొని తను ఇబ్బంది పడుతూ మాకు సహాయం చేశాడు…చాలా చాలా నచ్చావు అబ్బాయీ…చూద్దాము మన పరిచయం ఎంత వరకు దారి తీస్తుందో…
______________
రేయ్ నీకు బుద్ది ఉందా అసలు! ఇప్పుడు మనం ఎలా వెళ్లాలి రా..నాకు మస్తు ఆకలి వేస్తుంది .
రేయ్ విక్కి నీకు కోపం,అవేశం,ఆకలి అన్నీ ఎక్కవే రా..ఆఫ్ కోర్స్ తింగరి తనం కూడా ఎక్కువే లే..
ఇంతలో వాళ్ళ ముందరికి ఆటో వచ్చి ఆగింది ..
డ్రైవర్ చెప్పినట్టు వాళ్ళ రిలేటివ్ ని   పంపారు..
రేయ్ మనం చేసింది సహయం కాదు రా అది మన బాధ్యత రా..వారి స్థానంలో మీ చెల్లి లేదో మా అమ్మ ఉండి ఉంటే మనం అలాగే చేసేవాళ్ళము కదా రా ..
మరుసటి రోజు విక్కి లేచి చూడగనే  బెడ్ పై వరుణ్ తన వంక కోపంగా చూస్తూ ..నా లాప్ టాప్ అండ్ సర్టిఫికెట్స్ ఉన్న బాగ్  ఎక్కడ ఉంది…
రేయ్ మామ..ఉంది కదా నా బాగ్ లో .
లేదు రా…ఈ రోజు నేను సర్టిఫికెట్స్ ఇవ్వలి ఇప్పుడు సర్టిఫికెట్స్ మిస్ అయితే ఎలా రా…పైగా లాప్టాప్ లో విలువైన ఇన్ఫర్మేషన్ ఉంది రా..
అంతే నీ వల్లే వరుణ్ ..నువ్వు తొందర పెట్టడం వల్ల నేను కార్ లో మర్చిపోయాం..ఇప్పుడు మనం ఏమి చేయాలి. ఏం చేద్దాం ఆ డ్రైవర్ కి కాల్ చేసి అడగాలి మరి..
డ్రైవర్ కి కాల్ చేద్దాం అని ఫోన్ తీసుకోగానే ఎదో తెలియని నంబర్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు..
హల్లో వరుణ్ గారు నే మాట్లాడేది..
ఎందుకో తనకి ఆ వాయిస్ చాలా నచ్చింది..
వరుణ్ ….వరుణ్…వరుణ్…
తన పేరే తనకి నచ్చుతోంది..
వర్ష గట్టిగా వరుణ్ పిలిచింది కాదు కాదు అరిచింది..
సారీ అండి నేనే వరుణ్ ..మీరు ఎవరు ???
“నా పేరు వర్ష..నిన్న మాకు సాయం చేశారు కదా..
క్యాబ్ లో మీ లాప్టాప్,మీ సర్టిఫికెట్స్ ఉన్నాయి అండి..వాటిని మా నాన్న చేత మీ కంపెనీలో ఉండే సోనీ అనే ఎంప్లాయ్ చేతికి ఇచ్చాము .మీరు కంగారు పడుతుంటారు అని ఫోన్ చేశాను..”
” చాలా థాంక్స్ అండి…’
నేను చెప్పాలి అండి..నిన్న మీ వల్లే మేము ఇంటికి క్షేమంగా చేరుకున్నాము…బై వరుణ్ అని ఫోన్ కట్ చేసేసింది
ఫోన్ పెట్టేసిన వరుణ్ పెదాలపై చిరునవ్వు వచ్చింది..
ఏమైంది రా మామ…నిన్న మనం సాయం చేసిన అమ్మాయీ వర్ష ఫోన్(వర్ష ఎంత అందంగా నా పేరు పిలుస్తోంది రా..అని మనసులో అనుకుంటాడు)
మిస్ అయిన నా థింగ్స్ ని  ఆఫీసులో ఉండే సోనీ చేత ఇచ్చారు అంటా రా…
ఏంటి రా సంగతి …నీలో నువ్వే నవ్వుకుంటున్నావు
ఏమి లేదు లే .
ఆ రోజు మొదలు ఫోన్ లో మెసేజ్ చేసుకునే వారు ఒకరికొకరు..వరుణ్ ఎప్పుడు కాలిగా ఉన్న , బిజీ గా ఉంటే టైమ్ కుదుర్చుకుని మరి వర్ష తో  వాట్సాప్లో చాట్ చేసేవాడు..
ఎప్పుడు కూడా వర్ష ఎలా ఉంటుందో చూడాలి అని అనుకోలేదు ..వర్ష కూడా డీపీ గా ఫ్లవర్స్ లేదా కొటేషన్స్ అలా పెట్టేది..
ఒకరోజు వర్ష పెట్టిన మెసేజ్ కి ఎంత సేపటికీ రీప్లే ఇవ్వలేదు వరుణ్..
కొద్దీ సేపటి తర్వాత సాడ్ ఏమోజి పెట్టాడు
అంతవరకు చాటింగ్ తప్ప ఫోన్లో ఎప్పుడు  మాట్లాడని వర్ష ఫోన్ చేసింది
ఏంటి విషయం వరుణ్…
” ఈ రోజు నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి వేరే కంపెనీ లో చాలా మంది వచ్చి ఉన్నారు ..వాళ్లంతా నాకన్న సీనియర్స్.. వాళ్ళు ఎక్స్పీరియన్స్ . చెప్పగలనా లేదా అని నాకు డౌట్ వస్తుంది నామీద..
”  వరుణ్ …. మొదట భయపడడం ఆపేసి.. భయం నీలో నమ్మకాన్ని తుడిచేస్తుంది.. ఆలోచన విధానాన్ని చంపేస్తుంది.. భయాన్ని వదులు నీ మీద నీకు నమ్మకం ఉంచి ప్రజెంటేషన్ ఇవ్వు. నాకు కూడా నమ్మకం ఉంది..నువ్వు చేయగలవు..ట్రై చేయి..”
వర్ష మాటలతో వరుణ కి కాన్ఫిడెన్స్ వచ్చి ప్రజెంటేషన్ బాగా ఇచ్చారు.. ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకి ఓకే అయింది..
వరుణ్  ఆనందంగా వర్షా కి కాల్ చేసి
” థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్…
ప్రాజెక్ట్ ఒకే అయింది. ఇదంతా నీ వల్లే …
కంగ్రాజులేషన్ వరుణ్.. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది.నేను చేసింది ఏముంది ఒకమాట చెప్పా అంతేగా!
అలా ఒకరి కష్టంలో మరొకరు ఒకరి ఆనందంలో ఇంకొకరు ఉంటూ పరిచయాన్ని రోజురోజుకు పెంచుకోసాగారు… అలా సంవత్సరం పాటు  గడిచింది
ప్రేమికుల రోజు వరుణ్ తను ప్రపోస్ చేయాలనుకుని అనుకున్నాడు.
” ఐ లవ్ యు వర్ష.. చాలా రోజులనుంచి చెప్పాలని అనుకుంటున్న నేను చెప్పలేకపోయాను.. నీ సమాధానం ఏదైనా సరే నాకు ఓకే.కానీ నువ్వు నా జీవితంలో వస్తే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు”
” నువ్వు ఊహించనంత గా అందంగా ఉండను…
వర్ష నేను ప్రేమించింది నీ మనసును, నీ మాటలను అందాన్ని కాదు.. ఇన్నాళ్ల మన పరిచయంలో నీకు తెలియలేదా ఆ విషయం …
నీ నిర్ణయం నాకు తెలపాలి అనుకుంటే నాది ఒక డ్రీమ్ ఉంది వర్ష నువ్వు అలాగే రావాలి అంటు తన ఇష్టాన్ని తెలియజేశాడు
ఈ సండే నీ పుట్టినరోజు కదా ఆరోజు నీ వర్ష నీ ముందుంటుంది…
నాకు ప్రపోజ్ చేసినప్పుడు వరుణ్ ఎప్పుడు అంటుండేవాడు  నేను తనకి చిక్కకుండా పరిగెత్తు తుంటే తను నా వెంట పడుతూ నన్ను అందుకోవాలని నన్ను గాలిలొ గిర గిర తిప్పాలని చాలావరకు తన కలల్ని పంచుకున్నాడు.
ప్రస్తుతం——-
నాలో ఉన్న ప్రేమ ని తన చెప్పాలని తనకు ఇష్టమైన రీతిలో రెడీ అయ్యి వెళ్తున్నా కానీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.. ఏక్సిడెంట్ అయింది .ఈ ప్రమాదంలో కాలును కోల్పోయాను
దాదాపు ఒక ఐదు నెలలో హాస్పిటల్ లోనే ఉన్నాను.. ఎందుకో మరి వరుణ్ జీవితంలోకి నేను వెళ్ళకూడదు అనిపించింది.
నాన్నను ఒప్పించి  ఈ ఊరికి వచ్చేసాము.. వరుణ్ కి ఎప్పుడూ ఎదురు పడకూడదని..నేను ఆ ఊరిలో ఉంటే ఎలాగైనా సరే నా కోసం వెతుక్కుంటూ వస్తాడు
అందుకని…
ఇదండీ నా గతం … నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.
చెప్పి తన కళ్ళు మూసుకుంది..సడెన్ గా తను గాలిలొ తేలుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచింది….
ఎదురుగ వరుణ్….
తను చూస్తుంది కల నిజం అర్థం కాలేదు వర్షకి
ఈ వరుణ్ నుండి వర్షన్నీ ఎవరు అయిన వేరు చేయగలరా ఎవరైనా!!!!!అని వరుణ్ ని కిందికి దించి తనని గట్టిగ హత్తుకొని “అలా ఎలా నన్ను ఒంటరి వాడిని చేసి వచ్చేసావు..నువ్వు వస్తావు అని ఆ రోజు ఎంతో ఎదురు చూసి ,నీకు ఎన్ని సార్లు కాల్ చేశాను తెలుసా..ఎక్కడ ఉంటావో తెలియదు నాకు. ఏమి అయ్యి పోయావో తెలియదు. రోజు చస్తూ బ్రతికాను తెలుసా నీకు!.. అనుకోకుండా లల్లిని షాపింగ్ మాల్ లో చూసా తను అసలు విషయం చెప్పింది.అప్పుడే మొదటి సారిగా తన ఫోన్ లో  అమ్మ నాన్నతో కలిసి ఉన్న నీ ఫోటోను చూసా..అమ్మ నాన్నలకు నీ ఫోటోని చూపించి, నీకు జరిగిన ప్రమాదం గురించి చెప్పి అంగీకారం తీసుకున్న..ఇంతలో అనుకోకుండా వాళ్లు కూడా నిన్ను రిలేటివ్స్ మ్యారేజ్ లో చూశారు… వాళ్లుకి  కూడా నువ్వు బాగానే నచ్చావు.. ఆ  విధంగా పెళ్లిచూపులకి వచ్చాం
నిన్ను చూడకుండా నే ఇష్టపడ్డ నేను నీకు కాలు లేదంటే అలా ఎలా వదిలేస్తాను అనుకున్నావా.. నువ్వంటే ఇష్టం మాత్రమే కాదు ప్రాణం .. ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ రా వర్ష….
వర్ష నవ్వుతూ ఐ లవ్ యు టూ వరుణ్ అని
తననీ గా గట్టిగ హత్తుకుంది.. నిజంగా నేను చాలా లక్కీ వరుణ్. నన్ను నా లాగే ఇష్టపడ్డ వ్యక్తి నా జీవితం లోకి వస్తున్నాడు అని ఏడుస్తూ అంటుంది
ఎందుకు ఏడుస్తున్నావ్…..
ఇది ఏడుపు కాదు వరుణ్ ఆనందభాష్పాలు.. నామీద నీకున్న ప్రేమ ను చూసి…
” వరుణ్ నువ్వు నాకు ప్రపోస్ చేస్తే నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న తెలుసా అన్నాడు వర్షాన్ని గట్టిగా హత్తుకొని..
ఏంటి అది…
ఇది అని తన పెదాలని అందుకున్నాడు….
ఎలా ఉంది నా గిఫ్ట్….. వర్ష సిగ్గుతో వరుణ్ గుండెల్లో తన మొహాన్ని దాచుకుంది.
వాళ్ళ ప్రేమ అంగీకరిస్తున్నట్లు అప్పుడే వర్షం పడింది..ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు…
ఓ మంచి రోజు వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది…. ఆరోజు కూడా ఫుల్ వాన పడింది..
పెళ్లికి వచ్చిన విక్కీ వర్షంలో కలిసారు వర్షం సాక్షిగా ఒకటయ్యారు అన్నాడు…
సరిగ్గా అప్పుడే ఆర్కెస్ట్రా వారు పాట పాడారు
//మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే… పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే… అల్లుతున్నది మన కోసం
తడిపి తడిపి తనతో నడిపి… హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా… తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం//…
సంవత్సరం తర్వాత వారి ప్రేమకు గుర్తుగా కవలలు పుట్టారు…. వారికి ఆకాష్, మేఘ అని పేర్లు పెట్టుకున్నారు..
పిల్లల నవ్వులతో, అల్లరి కేరింతలతో వర్ష, వరుణ్  జీవితం సంతోషంగా సాగిపోయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!