ఈ జన్మకింతే

జన్మకింతే

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

“ఏమోయ్!ఆ సంచి అందుకో అలా బజారులొకెల్లి
కూరగాయలు కొనుక్కొస్తా ఓ వారం రొజులకు సరిపోయేలా.”అంటూ పెళ్ళానికి చెప్పాడు రామనాధం.
“నిన్ననేగా తెచ్చారు ఒ సంచీడు.మళ్ళి ఇవాళెందుకు”
మీకు మరి చాదస్తం ఎక్కవవుతోంది రోజురోజుకి
కాంతం కేకవేసింది.
“ఏమోనే!ఏమి తోచటంలేదు .అలా బజారుకెల్లి ఏమైనా కోనుక్కొస్తాను “రామనాధం సమాధానం.
“ఏడ్చినట్టుంది మీ వ్యవహరం .ఏవరైనా వింటే నవ్విపోతారు”.కాంతం ఎత్తిపొడిచింది.
“పోనిలే!ఓ కప్పు కాఫి ఇవ్వు తాగుతాను.”పేపరులొ తలదూర్చాడు.
రామనాధం తహశిల్ధారు కార్యాలయంలో గుమస్తాగా
రిటైరయ్యాడు.ఆఫిసులో పనిచేస్తున్నప్పుడు అందరూ
అయోమయం రామనాధం అనే పిలిచేవారు.ఒక పని
చెపితే మరొ పని చేసేవాడు.అందుకే ఆయన పనులవల్ల పదోన్నతి పొందలేక పోయాడు. రిటైరయ్యాకకూడ రామనాధం అయోమయంగానే
అన్నీ పనులు చేస్తు భార్య కాంతం చేత చిన్నకొడుకు
చేత చివాట్లు తింటుంటాడు.
‌చిన్నకొడుకు ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇంకా ఉద్యోగం రాలేదు.అదేమి ఆలోచించకుండా
పెళ్ళిసంబంధాలు చూడ సాగేడు.ఒకరోజు భార్యకాంతాన్ని చిన్నకొడుకుని ఏమి చెప్పకుండా
తన తోటి ఉద్యోగి జోగినాధం ఇంటికి తీసుకొని వెళ్లాడు.ముందుగా చెబితే వాళ్ళు ఒప్పుకోరని
చెప్పకుండా తీసుకొని వెళ్ళాడు.అంతేకాదు జోగినాధంకి కూడ చెప్పలేదు.జోగినాధంకి కూతురుంది.డిగ్రీ చదివింది.రామనాధం కంటే
జోగినాధం తెలివైనవాడు.
రామనాధం అంత హఠాత్తుగా ఇంటికి రావడంతో
కొంచెం ఆశ్చర్యమనిపించినా సంతోషంగానే
ఆహ్వానించాడు.
అవి ఇవి మాట్లాడుతూ రామనాధం”నీ కూతురిని.ఒక సారి పిలువు మాట్లాడాలి”అని జోగినాధంకి
చెప్పాడు.
జోగినాధం అయోమయంగా చూశాడు.
జోగినాధంతో పాటు రాభనాధం భార్య కాంతం చిన్నకొడుకు కూడా అయోమయంగా చూస్తూ ఉండిపోయారు.
జోగినాధం కూతురు తల్లి కూడా ఆయోమయంలో
పడిపోయారు.

***

You May Also Like

One thought on “ఈ జన్మకింతే

  1. శీర్షిక చూస్తే నిరాశవాద సూచిక. ఎత్తుగడ అయోమయం రామనాధం మాట, చేతల తో. కధనం ఆసక్తి కరం. శైలినిశ్చయంగా ధారాళంగా ఉంది. బాగున్నది. చివరి వరకూ చదివించేదిగా ఉంటుందని భావిస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!