మతి సంతకైనా-మది సంతసమే
రచన:ఉండవిల్లి సుజాతా మూర్తి
అయ్యో నా కళ్ళజోడెక్కడ ఎవరైనా చూశారా ఏమ్మా కోడలా నువ్వేమైనా చూశావా మా వాడ్నడుగు చూసేడేమో రామకోటి రాద్దామంటే పొద్దుట్నించీ ఇదే పని వెతుక్కుందామా అంటే కనబడనిదే కళ్ళజోడాయె ఏం పెట్టుకుని వెతుక్కోగలను అమ్మా!ఏం చేస్తున్నావ్నా కోసం లేచీసరికి మ్యాగీయా నాన్నా తర్వాత చేస్తాలే కానీ తాతయ్య కళ్ళజోడు వెతుకు పో.. నాన్నకేమో ఆఫీస్ టైమవుతోంది
ఓ..అలాగే అమ్మా తాతయ్యా తాతయ్యా లేచేవా… అన్నట్లు నా కళ్ళజోడు ఆ..అమ్మ చెప్పింది..ఉండు అయ్యో తాతయ్యా… దేవుడి పుస్తకం మడతలో పెట్టావు పెన్ను కూడానూ ఇదిగో అయ్యో నా మతి మండా సిద్ధం చేసుకుని అంతలోనే మరిచిపోయానా
మ్..నా మనవడివి కాబట్టి సాధించేవు
***