కవిత

కవిత

రచన: యాంబాకం

ఆలోచనలో పుట్టి మనసు భావంలో మెలిగే తత్వమే కవిత
పురిటి కవిత,బాల్యపు కవిత యవ్వన కవిత ,ఏడు రంగుల ఇంద్రధనుస్సు కవిత

చంటిపాప ఏడుపు కవిత, అవ్వ లాలిపాట కవిత, కన్య వలపు కవిత, శృంగార కవిత

మాటల్లో కవిత ,చూపుల్లో కవిత ,ప్రేమలో కవిత, మమకారపు కవిత

ఇంపు కవిత, సొంపు కవిత ,శయనం స్వప్న లో సుందర కవిత

ఊహల కవిత ,రాగాల కవిత కెరటాల తొలకరి కవిత, పూజ కవిత, భజన కవిత, హృదయం కరిగే కవిత

జీవిత కవిత ,తేజము రంజింప సరాగ కవిత, ఆహ్లాద కవిత ,కాలమును కరిగించే కవిత

మబ్బులను కరిగించే కవిత, రాళ్ళను సైతం కరించే కవిత ,
పకృతి భాష కవిత, వికృతి పదం కవిత, గుండెల్లో గుబులు పుట్టించే కవిత

తీయని కవిత, తేనియ కవిత ,భాధను మరిపించు కవిత ,మనిషి ని దేవుని గా చేయు కవితే ఈ కవిత.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!