మనోహరం

మనోహరం

రచన: కవిత దాస్యం

మనోహరం మనోహరం…
చిటపట చిరు జల్లులు మనోహరం…
గలగలపారే సెలయేరు మనోహరం…
కిలకిల కూసే పక్షిరాగాలు మనోహరం…
జల జల పొంగే జలపాతం మనోహరం…
మిలమిలలాడే తామరాకుపై నీటిబొట్టు మనోహరం…
మళ్లీ మళ్లీ పాడే ఆమని కుహు కుహుగానం మనోహరం…
తళతళలాడే ప్రకృతి సోయగం మనోహరం.. ముసి ముసి నవ్వుల పిల్లల కేరింత మనోహరం..
లాలీ లాలి అంటూ అమ్మ పాడే పాట మనోహరం…
కొక్కొరొక్కో కొక్కొరొక్కో అంటూ కోడికూసేవేళ వేకువ మనోహరం…
చలి చలి గా వీచే పిల్లగాలులు మనోహరం… వేడిగా వేడిగావేకువనే ఆస్వాదించే తేనీరు మనోహరం…
ఘల్లు ఘల్లు మంటూ ఇంట నడయాడే అలివేణి మనోహరం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!