అక్షరమాల

అక్షరమాల

-ఈతకోట ఏడుకొండలు

అ……..అమ్మ
ఆ……..ఆవు
అమ్మ వంటిదే ఆవు

అహో ఎంత చక్కని అక్షరమాల

మదిలో నిలిచిపోయే
బడిలో నేర్పే తెలుగు అక్షరాల బోధన

బాల్యంలో నేర్పిన అక్షరాలు

వృద్ధాప్యం వరకు నడిపే జీవిత రథచక్రాలు

తెలుగు అక్షరాలు
కాపాడే రక్షణ కవచాలు

అ..ఆ.. నేర్చినోడే
ఇలను ఏలుతాడు
ఆకాశంలో నెలరాజులా

అమ్మ…ఆవు… అని పలికినోడే

మాతకు గోమాతకు పరిరక్షకుడు అవుతాడు

మాతృభాషను మరువని మది

కనిపించని అంబుల పొది

అందమైన అ..ఆ.. లే
అవసరమైతే అవుతాయి ఆయుధాలు

తెలుగు భాషను రక్షించే సాధనాలు

యాభై ఆరు అక్షరాల
అ…ఆ…. లు

భాషా సంస్కృతికి కట్టని మంగళ తోరణాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!