నేస్తం
రచన: చింతా రాంబాబు
నాతో చెలిమి
అన్ని విధాల కలిమి
నన్ను చేయకండి నాశనం
మీకు జరుగుతుంది వినాశనం
నీకు శ్వాసనై
నీకు నీడనై
ఔషధమునై
మీ పాపాయికి ఉయ్యాల కట్టే కొమ్మనై….
కల్మషం లేని జీవినై
నిన్ను కంటికి రెప్పనై కాపాడుతున్న….
స్వార్ధరహిత జీవితం నాది
స్వార్ధ పూరిత బ్రతుకు నీది
విషం వెదజల్లే ఆలోచనలు నీవి
ఆ విషాన్ని స్వచ్ఛమైన గాలి గా మార్చేది నేను
నీ మనుగడ కోసం
నీ సంపాదన కోసం
నాపై చేయకు యుద్ధం
నన్ను చేయకు నిర్మూలనం
నాకు అందించు నీ స్నేహ హస్తం
ఎప్పటికీ నిన్ను మోసం చేయను నేస్తం.