పేపర్ బాయ్

పేపర్ బాయ్

రచన: మక్కువ. అరుణకుమారి

సూర్యోదయంతో తెలవారేను అందరికీ
నీ సైకిల్ హారన్ మోతలతో తెలతెలవారేను ఎందరికో

ముంగిలి చిమ్మేవేళ ముంగిట్లో సరికొత్త పేపర్ చూడాల్సిందే ఇంటి ఇల్లాలు

కాఫీ ఘుమఘుమలతో పాటు
నీవు విసిరే పేపరు రెపరెపలు
వినిపించనిదే నిదుర లేవరు
శ్రీవారు

తేనీటి ఆస్వాదనలతో పాటు
సరికొత్త సొబగుల వార్తలు చవిచూడాల్సిందే మామగారు

గ్రీష్మతాపానికి వెరవక మలయమారుతమై వస్తావు

వర్షపు జల్లులు లెక్కించక మట్టి వాసనల వార్తలు మోసుకొస్తావు

శీతల సమీరాలకు చలించక
నులివెచ్చని కబుర్లు దరిచేరుస్తావు

ప్రకృతి ప్రకోపించినా
వికృతి విజృంభించినా
ప్రళయం పల్లవించినా

కబురందించే వార్తాహరుడువి నీవేనోయ్
ప్రత్యేకంగా నీకో దినమేమిటోయ్

ప్రతిదినం సరికొత్తగా నీదేనోయ్
అలనాటి పేపర్ బాయ్
మొనమొన్నటి ప్రధమ పౌరుడోయ్
ఎందరిలోనో నింపాడు స్ఫూర్తోయ్

ఆ బాటలో నువు పయనించవోయ్
ఎనలేని శుభకామనలు నీకోయ్!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!