పెంపకము

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

పెంపకము

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయానికి ముందే మా అమ్మమ్మా భువనేశ్వరి దేవి నిద్ర లేచి పాలేరు తెచ్చిన పాలు కాచి సృజన ను లేపి పాలు కాచి తాగమని ఇచ్చేది

ఈ లోగా పనిమనిషి వచ్చి పనులు చేసేది ముగ్గు వేసి ఇల్లు తుడిచి కాఫీ తాగి వెళ్ళేది
పాలేరు నీళ్ళు కాచి పెట్టేవాడు

సృజనకు స్నానం.చెయ్యమని చెప్పి తాను స్నానం చేసి పట్టు చీర కచ్చా పోసి కట్టుకునేది.

పూజలు పాటలతో చేసేది పువ్వులు అప్పటికి కోసి పనిమనిషి సత్యవతి తెచ్చి పెట్టేది కొన్ని కోని ఉంచేది

మనవ రాలు సృజన కూడా అమ్మమ్మ కొంగు పట్టుకు తిరిగేది పద్యాలు నేర్పేది

అబ్బ కస్టమ్ అంటే చూడు శ్రీ కృష్ణ శతకము కుమా రీ శతకము వేమన శతకము
దాశరథి శత కము శ్రీ నృసింహ శతకము ఇలాంటి పద్యాలు నేర్పుతూ ఉండేది నాకు చదవడం కస్టమ్ అంటే ఊరు కొనేది కాదు కూడా తిప్పుకుంటూ ఇవన్నీ చదివితే తెలుగు బాగా వస్తుంది అప్పుడు నువ్వు రాయవచ్చు అప్పుడు నీ పద్యాలు కవితలు
కథలు వ్యాసాలు నవలలు రాయ వచ్చును అంటూ పట్టు పట్టి నేర్పేది
బాగా తెల్లారాక పిన్ని పెద్దమ్మ అమ్మ అంతా లేచి మెడమీద నుంచి దిగేవారు

అమ్మమ్మ వంటకాలు అన్ని రెడీ చెయ్యడానికి వెనకాల కూతుళ్ళు సహాయం చేసేవారు

ఒక్కోసారి వంట మనిషిని పెడుతూ ఉండేది చుట్టాలు వస్తె ఇల్లంతా సందడిగా ఉండేది

మా ఇంటికి పక్క పల్లె నుంచి బంధువులు వచ్చి షాపింగ్ చేసుకుని సినిమాలు చూసి తెల్లటి కాఫీ టిఫిన్ తిని వెళ్ళేవారు
ముందు వస్తారని తెలిస్తే వంట మనిషిని పిలిచేవారు

అమ్మమ్మకి అమ్మా ఉండేది ముత్త అమ్మమ్మ
ఆవిడ కి బాగా ఆచారం అందుకు వంట చేశాక మడి గా వేరే పెట్టేది ఆవిడ సూర్యుడు బాగా పొద్దు ఎక్కాక స్నానం పంపు దగ్గర చేసేది బకెట్లు లెక్క పెట్టుకుని స్నానం చేసి మడి చీర కట్టి దేముడికి దీపం పెట్టీ అన్నం తిని ఎండలో కూర్చుని జుట్టు అర బెట్టేది .సూర్య రస్మి మంచిది అనేది పొద్దు చూడండి అని చెప్పేది ఆవిడ సూర్యుడు కనిపిస్తే కానీ భోజనం చేసేది కాదు

ఒసే సృజన నీ పుస్తకాలు ఇయ్యి చదువుతాను అనేది
తెలుగు సైన్స్ సోషల్ వ్యాసాలు అన్ని చదివేది ఇది ఏమిటి? అది ఏమిటి ? అని అడుగుతూ ఉండేది

వాటికి సమాధానం చెప్పే వరకు ఊరు కొనేది కాదు
పెద్ద తల్లి మాత్రం ఓపికగా అన్ని వివరించి చెప్పేది

ఆరోజుల్లో ఆవిడ చదువుకుని ఉంటే గొప్ప సైంటిస్ట్ అవును కదా అనుకునేవారు మను మా లంత కూడా

ఆవిడకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండేది లెక్కలు నోటిన చెప్పేది

అమ్మ మ్మ దగ్గరికి వస్తె మెడ మీద అయితే మడి సాగుతుందని ఆవిడ ఉద్దేశ్యము అల ముత్హా అమ్మమ్మ దగ్గర నుంచి సాహిత్య అభిలాష సృజనకు
వచ్చింది చదివిన వన్ని బాగా కథలుగా చెప్పేది
ఓహ్ అమ్మమ్మ తల్లి ఎంత గొప్పది విద్య అంటే చాలా ఇష్టంగా ఉండేది

సృజన అమ్మమ్మ కూడా పాటలు బాగా పాడేది
కథలు చెప్పేది దశ కుమార చరిత్ర పంచే తంత్రం విక్ర మార్క కథలు సాల భంజికల కథలు ఇత్యాది వి కూర్చో పెట్టుకుని చెప్పేది రాత్రి అమ్మమ్మ దగ్గర పడు క్కుని అన్నిచెప్పించు కొనేది
ఆ తరువాత మర్నాడు స్కూల్ లో ఖాళీ సమయంలో స్నేహితులకి చెప్పేది ఆలా సృ జన అమ్మమ్మ చెప్పే కథల ద్వారా సాహిత్యం పట్ట అభిరుచి పెంచుకున్నది

అమ్మమ్మ నీతి కథలు చెప్పి జీవితం పట్ల అవగాహన కలిగించింది సృజన పెద్దల పెంపకంలో ఎంతో పద్ధతిగా పెరిగింది
చదువులో సరస్వతి సంగీతం కూడా నేర్పించారు బాగా పడుతుంది మంచి కథల పుస్తకం గురించి తరచూ ఇంట్లో తరచూ చర్చిస్తూ ఉండేవారు
పుస్తకాల్లో శీర్షికల గురించి ఎంబ్రాడ రీ గురించి సీరియల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు

తాత గారు ప్రముఖ పండితులను పీల్చి సత్కారం చేసేవారు అప్పుడు అమ్మమ్మా పెద్దలను గౌర వించడం అన్ని నేర్పేది అమ్మమ్మ పెంపకంలో సృజన ఎంతో పద్దతి గా పేరి గింది అల సృజన ఉన్నత భావాలతో. చదువుకుని కచ్చేరీలు చేస్తూ పద్దతి గా ఎదిగింది సృజ న మంచి రచయిత్రి గా కూడా కృషి చేసింది
వారు ఇంట్లో అడ పిల్ల ఉద్యోగం వద్దు నీ కళలు ద్వారా కలలు సాకారం చేసు కో అని దీవించారు అదే పెద్ద ల దీవెన ప్రకారం చదివిన చదువుకు కళల కి న్యాయం చేసింది
అటు భర్త ఆత్తింట కూడా ఎంత ఇష్టంగా కృషి చేశారు

సృజన రాసిన కథలు చాలా పత్రికల్లో వచ్చాయి

అలాగే అన్ని కథలు కలిపి 41 కథలు ఈ తరం అమ్మమ్మ కథలుగా ప్రింట్ ఒక్ పబ్లిషర్ చేశాడు కారణం నేటి తరం లో పిల్లలు స్వతంత్ర భావాలతో పెద్దలకి దూరంగా ఉంటూ విదేశీ వ్యామోహం లో ఉన్నారు

వారికి అమ్మమ్మ కథల ద్వారా మెసేజ్ ఇచ్చింది అందువల్ల ఆ
కథలకి ఎంతో పేరు కూడా వచ్చింది అంతే. కాదు విజ్ఞత ఉన్న ఆ కథలకి కేంద్ర సాహిత్య అకాడమీ వారు అవార్డ్ కూడా ప్రకటించారు

దీనికి ముఖ్య కారణం చిన్న ప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగింది

నేటి తరం లో అమ్మమ్మల హెడ్ మిస్ట్రెస్ లు డాక్టర్స్ అధ్యాపకులు ఇంజినీర్స్ అన్ని రంగాల కృషి చేసిన అమ్మమ్మల పెంపకం ఇంకా బాగుంటుంది

కానీ వారి విలువ తెలుసుకుని
వారి మాటకి గౌరవం ఇచ్చి పెరిగితే మంచి భవిష్యత్ ఉంటుంది

బాల్యమంతా ఆమ్మమ్మ పెంపకంలో ముద్దు కాదే యశోద ముంగిట ముత్యాము వీడు అంటున్న శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనల సారాంశం తెలుసుకుని చక్కగా
శ్రీ కృష్ణుని బాల్యంలో మాదిరి ఎంతో గారంగా పెరుగుతూ అన్ని విద్యలు నేర్చుకుంటే అంతా కంటే వ్యక్తిత్వ వికాసం ఏముంది మన అమ్మమ్మ లే మన విద్యకు రోల్ మోడల్స్ అని చెప్పవచ్చును శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!