పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు

పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు

హాస్పటల్ నుంచి వచ్చిన నన్ను చూసిన మా ఆవిడ, రిపోర్ట్స్ అందుకొని తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి

“ఏమన్నారండి డాక్టర్ గారు? పాపకి అంతా బాగుంది అన్నారా?” అని అడిగింది.వాళ్ళ 8 ఏళ్ల కూతురు సితార ఆరోగ్యం గురించి.

“లేదు భాగ్యం హెల్త్ కండిషన్ లో ఎటువంటి మార్పు లేదని, తనని ప్రకృతి కి ఎంత దగ్గరగా ఉంచితే అంత మంచిదని చెప్పారు.”

“అలాగా! మరిప్పుడు ఎలాగండి? పిల్లని ఇలా చూడలేకపోతున్నాను. ఇలా దగ్గుతూ సరిగా ఉపిరి తీసుకోలేక పిల్ల అవస్థ పడుతుంటే తల్లిగా ఏమి చేయలేకపోతున్నాను అని నాలో నేనే కుమిలిపోతున్నాను.”

“అదేంటి భాగ్యం! అలా అంటావు, నేను మాత్రం చూస్తూ ఊరికే ఉంటున్నానా!? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి చూపించలేదు? అందరూ టెస్టులు,స్కానింగ్ లు అని డబ్బులు దండడమే కానీ పిల్లని బాగుచేసిన డాక్టర్స్ ఎవరూ లేరు..ఈ డాక్టర్ ఏమో ఇలా అంటున్నాడు.”

“అమ్మా! భాగ్యం, రేయ్ శేఖర్ ఎలా ఉన్నారు? పిల్లలెలా ఉన్నారు.”

“రండి అన్నయ్య మీరు వదిన, పిల్లలు అంతా బాగున్నారా?”.

“రారా!చంద్ర,బాగున్నవా ఇంట్లో అందరూ క్షేమమేనా?”.

“అందరం బాగున్నాం అమ్మ. మీరెంటి ఇద్దరూ ఏదో గోడవపడుతున్నట్టు ఉన్నారు,దేని గురించి?”.

“కాఫీ తీసుకోండి అన్నయ్య, ఏముంది పిల్ల ఆరోగ్యం గురించి మీకు తెలిసిందే కదా దాని గురించే మాట్లాడుకుంటున్నాం.”అని విషయం మొత్తం చెప్పారు.

అంతా విన్న చంద్ర “రేయ్ శేఖర్! ఇందులో అంత ఆలోచించాల్సిన విషయం ఏముంది, మన ఊరు ఎంత పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఊర్లో అయితే అందరూ అయిన వాళ్ళే అందరి ప్రేమల మధ్య పిల్ల ఆనందంగా ఆడుతూ ఉంటుంది.నాకు అనిపించింది చెప్పాను ఇక మీ ఇష్టం.”

“మన ఊరు బాగుంటుంది.. కానీ నేను ఆ పల్లెటూర్లో ఏముంది బ్రతకడానికి అనే కదా సిటీకొచ్చింది. ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్తే నలుగురు ఏమనుకుంటారో అని.”నసుగుతూ అన్నాడు శేఖర్.

“శేఖర్! పుట్టిన భూమి కన్న తల్లి లాగా బిడ్డలని కడుపులో దాచుకుంటుంది కానీ, నువ్వు వద్దనుకొని వెళ్లిపోయావని నిన్ను దరి చేరనీయదా ఏంటి?అన్ని వదిలేసి నీ బిడ్డ కోసమైన వెళ్ళు అంతా మంచే జరుగుతుంది.”

“సరే ఇక వెళ్ళొస్తాను శేఖర్, వెళ్ళొస్తానమ్మా ఇంట్లో మీ వదిన ఒకటే ఉంది మళ్ళీ కంగారు పడుతుంది లేట్ అయితే.”

“అలాగే!” అని దంపతులు ఇద్దరూ ఆలోచించి ఊరు వెళ్ళటానికే నిశ్చయించుకొని, అక్కడ కావాల్సినవి మొత్తం సర్దుకొని ఆ రోజు రాత్రే ఊరికి బయలుదేరారు.వెళ్లే ముందు ఇంటికి వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పారు.

“పెళ్లి చేసుకొని పాప పుట్టిన 3 ఏళ్ల తర్వాత, పాప భవిష్యత్తు కోసం అని ఊరు వదిలిపెట్టి వెళ్లిన వాడు. మళ్లీ ఇన్నిరోజులు కి వస్తున్నారు” అని సంతోషిస్తున్నారు శేఖర్ అమ్మ తులసి, నాన్న కోటయ్యా.

రాత్రి ప్రయాణం చేసి తెల్లవారుజామున 4 గంటలకి తమ సొంతూరైన రామాపురం లో దిగారు.దిగగానే చల్లటి గాలి వీస్తోంది, అందులో మట్టి వాసన కలిసి వస్తుండటంతో తన కూతురు సితార “ఏంటి నాన్న! ఇంతమంచి వాసన వస్తోంది” అని అడిగింది.

“ఇది మట్టి వాసన తల్లి పల్లెటూర్లో మాత్రమే ఇలాంటి వాసన రుచి చూడగలవు. సరే పదండి వెళ్దాం నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ఎదురుచూస్తుంటారు.” అని ముగ్గురు తమ ఇంటి బాట పట్టారు.

ఎప్పుడుపుడు కొడుకు, కోడలిని, మనవరాలిని చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వారికి, శేఖర్ వాళ్ళు వీధి మొదట్లో కనపడగానే కోటయ్య గారు “ఏమోయ్! తులసి, శేఖర్ వాళ్ళు వచ్చేస్తున్నారు, దిష్టి నీళ్లు తీసుకురా!” అని చెప్పగానే..

“హ!!వచ్చే..వచ్చే..” అంటూ వాళ్ళకి ఎదురొచ్చి గుమ్మం బయట నుంచే ముగ్గురికి  దిష్టి తీసి ఆ నీళ్లు బయట పడేసి వాళ్లతో లోపలికి వెళ్లారు.

“అమ్మా! నాన్న! ఎలా ఉన్నారు ఇద్దరూ?”.

“ఏదో ఇలా ఉన్నాం.మనవరాలికి 3 ఏళ్ల వసపుడు వెళ్లి మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చారు, మమ్మల్ని రమ్మన్నారు కానీ మేము ఆ అద్దాల మేడల్లో కృత్రిమమైనా బ్రతుకులు బ్రతకలేక మేము రాలేదు.పిల్ల భవిష్యత్ కోసం మీరు రాలేకపోయారు, ఇన్నాళ్లకు వచ్చారు అదే సంతోషం” అని పిల్ల ఆరోగ్యం గురించి ఆరా తీసి అంతా బాగవుతుంది ఎం బెంగ పడకండి అని చెప్పి  విశ్రాంతి తీసుకోమన్నారు.

పడుకొని పొద్దున 8 గంటలకు లేచిన సితార కి వాళ్ళ నాన్నమ్మ ఏవో ఆకులు నూరుతుంటే “ఏంటివి నానమ్మ?” అని అడిగింది.

“ఏమి లేదమ్మా! ఇవి నీ కోసమే ఇవి తింటే నీ ఆరోగ్యం త్వరగా బాగవుతుంది” అని వాటిని తన చేత ఆకుపసరు, గుళికలు మింగించింది. వాళ్ళ అమ్మ ఎప్పటినుంచో ప్రకృతి వైద్యంలో మంచి హస్తవాసిగా పేరుండటంతో శేఖర్ చూద్దాం!ఇదేమైనా పని చేస్తుందేమో అని వాళ్ళమ్మ వైపు ప్రేమగా చూసాడు.

రోజు శేఖర్, సితార లు పచ్చని పొలాల వెంట తిరగడం, కూతురు పంటల గురించి, వాటిని ఎలా పండిస్తారు అని అడుగుతుంటే తను చిన్నప్పటి నుండి చూసి తన తండ్రి దగ్గర తెలుసుకున్న విషయాలు అన్ని చెప్తుంటే సితార చాలా ఆశ్చర్యంగా వింటూ “మనం రోజూ తినే ఫుడ్ ఇంత కష్టపడి పండిస్తారా నాన్న!? ఇక మీదట నేను ఫుడ్ ని అసలు వేస్ట్ చేయను” అని చెప్పింది.

కూతురిని మురిపెంగా చూస్తూ! తను కూడా చిన్నప్పుడు తన తండ్రితో ఇలానే చెప్పి ‘నేను కూడా రైతుని అవుతాను నాన్న, అందరికి అన్నం పెట్టే అన్నదాత అవుతాను’ అన్న మాటలు గుర్తొచ్చాయి.

‘అవును! నేను అనుకున్నది ఏంటి? చేస్తున్నది ఏంటి?’ అని మళ్ళీ ఇప్పుడు పంటలు ఎలా కొత్తగా, అధిక దిగుబడి వచ్చేలా సహజ ఎరువులతో పండిస్తున్నారో కనుకొని తమ పంటలను ఈ సారి శేఖర్ ఏ దగ్గరుండి పండించాడు.

సితార నానమ్మ ప్రకృతి వైద్యంతో మంచి వాతావరణంలో ఉండటం, నాన్నతో కలిసి పంటలు పండించే విధానం, ఎరువులు తయారుచేయడం ఇలాంటివాటి మీద శ్రద్ద చూపుతూ ఎక్కువగా ఎండకు, గాలికి, ప్రకృతికీ దగ్గరగా ఉండటంతో వాళ్ళకి తెలియకుండానే సితార ఆరోగ్యం మెరుగుపడింది.పట్నంలో ఎన్ని మందులు వాడిన తగ్గనిది ఇక్కడ ఇంత గాలి, దుమ్ముకి తిరుగుతున్నా ఏనాడు దగ్గడం కానీ శ్వాసా తీసుకోవడంలో ఇబ్బంది అనేది లేకుండా చాలా చలాకీగా తిరుగుతూ సంతోషంగా ఉంది.

సితార ని చెకప్ చేయిస్తే ఆరోగ్యం అంతా బాగుంది దిగులు పడాల్సింది ఏమి లేదు అని చెప్పగానే సితార వాళ్ళ నాన్నతో “నాన్న! మనం ఎక్కడికి వెళ్లొద్దు! ఇక్కడే ఉండిపోదాం. నాన్నమ్మ చేతి వంట తింటూ, తాతయ్య తో మంచి మంచి కథలు వింటూ, నీతో పొలములో ఉంటూ నేను కూడా బాగా చదువుకొని పెద్దయ్యాక నీలా రైతుని అవుతాను. బాగా పండిస్తే రైతే రాజు అన్న దాన్ని నిజం చేసి చూపిస్తాను.”అని చెప్పింది.

శేఖర్ కుటుంబం కూడా ఆనందంగా “నువ్వు అనుకున్నది చేద్దాం. రైతు ఆకలి చావులతోనో లేక పంట పండలేక చావడమో లేకుండా చేద్దాం. బ్రతకు తెరువు కోసం పట్టణాలకు వలస పోకుండా రైతుగా మారడానికి పట్టణాల నుంచి పల్లెకు వలస వచ్చేలా చేద్దాం” అని ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు.

రచయిత::  హసీనాఇల్లూరి

You May Also Like

3 thoughts on “పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు

  1. Wow హసీనా చాలా చాలా బాగుంది.👌👌👏🏻👏🏻👏🏻🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!