చిరునవ్వు
రచయిత :సరిత రవిప్రకాశ్
పెదవిపై విచ్చుకున్న
చిరునవ్వే నువ్వు
కలల్లోన కమ్మనైన
హరివిల్లే నువ్వు
మాటలను రాతలుగా
చేసింది నువ్వు
ఆ రాతలకే ప్రాణం
పోసింది నువ్వు
నా ప్రాణం పోయేలా
మాటల తూటాలను
పేల్చింది నువ్వు.
తూటాలా నాపైకి
దూసుకొని వచ్చి
నాగుండెను కోసింది
నువ్వు, నాగుండెను ముక్కలు ముక్కలుగా చేసి
నన్ను ప్రాణం లేని శిలలా చేసింది నువ్వు.
శిలలాంటి నాకు జీవాన్ని
పోసింది నువ్వు..
జీవం పోసిన నువ్వే ఈరోజు నాజీవం నీవు కాదు అంటున్నావు..
నీ జీవం నేను కాదు అన్నప్పుడు ఎందుకు నన్ను
నీ హరివిల్లులాంటి చిరునవ్వులో బంధించి తూటాల్లాంటి
నీ మాటలతో నాగుండెను
బద్దలు చేసింది కూడా నువ్వే కదా..
శిలలా నన్ను జీవంలేని బొమ్మగా చేశావు నా ప్రాణమా….