ఎదురీది సాగితే…

ఎదురీది సాగితే…

రచయిత:చంద్రకళ. దీకొండ

అసలు ప్రయత్నమే చేయని వారు అల్పులు…
మధ్యలో మానివేసేవారు మధ్యములు…
విడవకుండా అనుకున్నది సాధించేవరకూ
అలుపెరుగని కృషి సలిపేవారే మహాసంకల్పులు…!

దివిజ గంగను భువికి దింపింది…
బానిస సంకెళ్లను తెంచి స్వేచ్ఛను ప్రసాదించింది…
హిమాలయాలను అధిరోహించింది…
అగాధాలను శోధించింది…
అంతరిక్షాన్ని పరిశోధించింది…
అద్భుతాలను సాధించింది…
మహానుభావుల మహాసంకల్పమే…!

అడ్డంకులెన్నెదురైనా…
ఎదురీది సాగితే…
విశ్వశక్తులన్నీ ఏకమై…
మహాసంకల్పాన్ని నెరవేరుస్తాయన్నది…
ఓ శాస్త్రీయ సిద్ధాంత నిరూపణ…!

మహాసంకల్పం…
ప్రాణాంతక వ్యాధిని పారద్రోలగలదు…
పోయే ప్రాణానికి జీవమూ పోయగలదు…!!!
***

You May Also Like

3 thoughts on “ఎదురీది సాగితే…

  1. సంకల్పబలం యొక్క మహత్తును మరోసారి గుర్తు చేశారు. అభినందనలు చంద్రకళ గారూ.

    1. ధన్యవాదాలు సీత గారూ మీ ప్రోత్సాహకర ప్రశంసకు😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!