నా అక్షర విప్లవం

నా అక్షర విప్లవం

రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్

కరోనా కాలంలో కూడా కార్పొరేట్ ఆస్పత్రుల
విద్యాసంస్థల ఆగడాలతో సగటుజీవి మనోవేదన
శ్లేష్మం లో పడిన ఈగలాగ బ్రతుకు వెళ్ళదీస్తున్న
వైనాన్ని నా అక్షర విప్లవంతో
పుస్తకం లో పేజినై సమాజాన్ని నిలదీస్తా…!!

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణచేస్తూ తమ స్వార్థప్రయోజనాలకై ,బడాబాబులకప్పగించడాన్ని నిరసిసస్తూ, నాయకుల, వినాయకుల ఆగడాలని కడిగి వేయడానికి,
శ్రమజీవుల, వలసజీవుల వ్యధలను రూపుమాపడనికి
నా అక్షర విప్లవం తో పుస్తకంలో ఒక పేజి నవుతా………!!

రవి కాంచని చోటును కవి కాంచున్ అన్నది ఆధారంగా,
మహాకవి శ్రీ శ్రీ భావజాల ప్రేరణ తో సమాజంలో జరిగే అకృత్యాలు, ఆగడాలను పోగొట్టుటకై
“నేను సైతం” అంటూ
రామసేతువు నిర్మాణం లో ఉడుత సహాయపడ్డట్లు
నా అక్షర విప్లవాన్ని పుస్తకంలో ఒక పేజి ద్వారా తెలియచేసి
సమసమాజ నిర్మాణంలో భాగస్వామి నవుతా……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!