పాపి కొండలు

పాపి కొండలు

రచన: తొర్లపాటి రాజు (రాజ్)

స్త్రీ ఒక ప్రకృతి..
అందానికి మారు రూపు తన ఆకృతి!

యవ్వనమ్మున జవ్వని.. పరువంపు సొంపులతో
హొయలొలికే నడుమొంపులతో
ఒంపులు తిరిగే వయ్యారంపు నడకతో
మగని పిలుస్తున్నట్టు…

మేఘము హర్షించి వర్షించు కాలమ్మున….
గోదారి ..పరవళ్ళు తొక్కుతూ
భానుడి స్పర్శతో ముత్యమువలె మెరుస్తూ
నిశ్చల ప్రవాహమ్మున కెరటాల కవ్వింపుతో
అద్దాలమేడల మధ్య..
అలికిడిలేని అరవై అడుగుల అందగత్తెలా

పాపికొండల మధ్య ..మత్తుగా పిలుస్తున్న..
ఓ గోదారి! నీ వైపే మళ్ళింది…మా దారి!
ఓ ప్రకృతి పిపాసి!

అందమంటేనే ఆకర్షణ! మర్చిపోతున్నావు నీ రక్షణ!
పాపికొండల్లో..పాట పాడుకో…ఆటలాడుకో!
కాని! ప్రాణాలను పదిలంగా దాచుకో!

ఓ..పాపికొండలూ..మా మెడలో వేయకు దండలు..
నీకు వేల వేల దండాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!