(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
సమాధానం కరువే
రచన: శిరీష వూటూరి
టాక్స్ కడుతున్నాము
కానీ రోడ్లు బాగుండవు
ఓట్లు వేస్తున్నాము
కానీ ప్రజా సేవ చేయరు
అందరికీ ఉచిత విద్య అంటారు
ప్రైవేట్ కే పట్టం కడతారు
పథకాలతో ఎర వేసి
ప్రజలను మోసం చేస్తారు
అధికారం పేరుతో
కబ్జాలు చేస్తుంటారు
అవినీతి,అరాచక పాలనకు
అలవాటు పడిపోయారు ప్రజలు
అన్నీ తెలిసినా ఎవరి దారి
వారిదే
అంతరంగం ప్రశ్నిస్తే
సమాధానం కరువే…