(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
సమాధానం దొరుకు
రచన: బోర భారతీదేవి
అంతరంగాన్ని ప్రశ్నిస్తే …
జీవిత సాగరంలో దాటిపోయిన యుగాలు
ఎన్నో మధుర స్మృతులు
విషాద సంఘటనలు…
కోపం తో వదుకున్ను బంధాలు
పంచిన మమకారాలు
పొందిన సిరిసంపదలు
కోల్పోయిన అవకాశాలు
అనుభవించే సుఖదుఃఖాలు
దాచిపెట్టిన నిజాలు.
దాగియున్న ప్రేమలు
కనిపించని కుట్రలు
ధరహాసాన దాచిన కన్నీరు
దిగమింగిన అవమానాలు
గుండెకైన గాయాలు
కాలంతో పెట్టే పరుగులు
స్వార్థం తో చేసే పాప పుణ్యాలు
చూపించే బేషజాలాలు
పశ్చాత్తాప పడిన క్షణాలు
అంతుచిక్కని అగాధాలు
పసిగట్టలేని నిజాలు
నిలువుటద్దంలో నీకు చూపి.
చెబుతుంది సరైన సమాధానం