తరగని జ్ఞాపకాల సంపద

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

తరగని జ్ఞాపకాల సంపద

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

గతకాలపు జ్ఞాపకాలెన్నో
గతకాలపు స్మృతులెన్నో
గతకాలపు విషాదలెన్నో
గతకాలపు మధురానుభూతులెన్నో

ఎన్నో ఎన్నెన్నో
మదిలో నాయెద హృదిలో
బడికి వెళ్లకుండా మారాం చేసినరోజులు
మాస్టర్ గారు బెత్తముతో వీపుపై
వేసిన బడితపూజలు

పుల్లఐస్ కోసం 5పైసలు కావాలని ఏడ్చిన రోజులు
పక్కింటి జామి చెట్టులో జామికాయలు దొంగతనం గా కోసినరోజులు
నేల టికెట్ తీసుకొని గోడగెంతి బెంచి టికెట్ లో సినిమా చూసిన రోజులు

చిరిగిన నిక్కరు తో పోస్టాఫీస్ అని ఏడిపించిన రోజులు
కాలేజీ లో అల్లరి గా తిరిగినా చిలిపి రోజులు
మా నాన్న గారి చావుతో జీవితం ప్రశ్నార్ధకం అయిన రోజులు
లక్ష్యం గురిపెట్టి లక్ష్య సాధనతో ముందడుగు వేసిన రోజులు

జీవితం విజయతీరాలకు చేరిన ఆనందపు రోజులు
జీవితం అంటే ఇదేరా అని తెలియ జెప్పిన రోజులు
భవిష్యత్ లో ఎలా ఉండాలో తెలుసుకున్నా రోజులు
అంతరంగం ఒక సాగరం
తవ్విన కొద్దీ తరగని జ్ఞాపకాల సంపద

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!