కార్తిక పౌర్ణమి

కార్తిక పౌర్ణమి

రచన: చెరుకు శైలజ

కార్తిక పౌర్ణమి అవని పైన అందాల దీపావళి
మగువల ఆనందాల రవళి
చంద్రుని చల్లని  పండు వెన్నెల కాంతి
సెలయేరులు తమ సిగన దీపాల నక్షత్రాలు ధరించు వేళ
నదులు,వాగులు, నక్షత్ర దీపాలతో  తళ తళ మెరుస్తుంటే
ఆకాశంలో  నక్షత్రాలు తమ కన్న మిరిమిట్లు గొలిపే  అందాల దీపాలను చూసి చిన్న పోయిన వేళ
ఎంత కనువిందు కార్తిక  పౌర్ణమి దీపాల శోభ
ప్రతి గృహం ముందు  దేపజ్యోతుల కాంతి  వెదజల్లాగా
తులసి కోట తన ముందు వెలిగే దీపాలను చూసి
చల్లగా పదికాలాలు  పచ్చగా వర్థిల్లామని ఆశీర్వాదించే
స్వర్గ లోకంలో  సమస్త దేవతలు
భూలోకంలో మిల మిలా మెరిచే దీప కాంతులకు ముగ్ధులై మంగళ కరమైన  ఆశీశులు అందించే
ప్రకృతి అందాలు
దీపాల వెలుగుల ముందు  వెల వెల పోయే
పుడమి తల్లి తన అందాలకు మెరుగులు దిద్దిన  జ్యోతులను చూసి మురిసిపోయే
పదికాలాలు పాడి పంటలతో  తులతుగు మని దీవించే
ముక్కోటి దేవతల చల్లని దీవెనలతో
అయురు ఆరోగ్యలతో
వనదేవత  ఇచ్చే  పచ్చని పసిడి వర్ణాలతో
పౌర్ణమి నాడు విరిసే చల్లని వెన్నలతో  సంతోషం గా  వుందాము.
అందరి హృదాలలోఆనంద జ్యోతుల   వెలిగీదాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!