చరవాణి

చరవాణి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎన్. రాజేష్

నేటి ఆధునిక కాలంలో
ప్రస్తుత జీవన విధానంలో
చరవాణి లేనిదే పూట
గడవదు పొద్దుపొడవదు
కారణం దానికి మనం
బానిసలం,అయిపోయాము
మనమంతా దాని బంధీలం.

చరవాణి అంటే అత్యవసరం
ఒక పూట పస్థులున్న
పర్వాలేదు అంటున్న లోకం
చరవాణితోడు లేని పూటను
భరించడం కష్టం అంటుంది నేటి సమాజం

సుప్రభాతంతో నిద్ర లేపి
పత్రికనిపుస్తకాన్నిచూపించి
టీవీకార్యక్రమాలనుదగ్గరచేసి
వార్తలనువిశేషాలనందించి
అస్లీలాన్నిఅంతాచూపించేసి
ఆన్లైన్ఆటలనుచూపుతుంది

గడియారం,పుస్తకం, టార్చ్
కెమెరా, కాలిక్యూలేటర్,
అన్నింటినీ దూరం చేసి..
ఫోన్ కాల్స్, వీడియో కాల్స్
ఆన్లైన్ చాటింగ్ లతో
అందరినీ దగ్గర చేస్తూనే
బంధాలను దూరం చేసి చోద్యం చూస్తుంది

మితి ఎప్పుడైనా హితమే
అతి ఎప్పుడైనా ప్రమాదమే
అన్నట్లుచరవాణిఉపయోగం
అవసరం మేరకే ప్రధానం
అదిశృతిమించితే ప్రమాదం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!