చంద్ర దీపాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
భగవంతుడు సూర్య చంద్ర కిరణాల ద్వారా
మానవాళికి ఎన్నో జీవిత సత్యలు తెల్పితే
ఆకాశంలో నీలి నీలి మేఘాలు మాటున
చంద్ర కిరణాల కాంతి వెలుగులు మెరుస్తూ మురిపిస్తు
మానవునికి జ్ఞాన ప్రభోదము చేస్తూ
భూమి ఆకాశం నీరు ఒక్కటియై కార్తిక దీపాలు పాడ్యమినాడు జనులు వదిలే
దీప పడవలు పూలతో పసుపు కుంకుమలతో అలంకరించి బెల్లం అరటి పండు నైవేద్యం
పెట్టీ తెల్లవార గట్ల నదిలో కాలవలో చెరువులో బావి పైపు ఇంట్లో పళ్ళెంలో
పెట్టీ వదిలే దీపాలు వెలుగుతో కృత్తిక మహాలక్ష్మి దీపాలుగా
కార్తిక దామోదర దీపాలుగా గంగలో వెలుగుతో పయనిస్తూ
నక్షత్రాలు చంద్ర కాంతులతో కలిసి జ్ఞాన ప్రజ్ఞాన దీపాలుగా
ఆధ్యాత్మిక శక్తి శాంతి ఐకమత్యం సహనాలకు ప్రతీకలు చంద్ర కిరణదీపాలు