అదే అదే అసలు శాశ్వతం

అదే అదే అసలు శాశ్వతం

రచయిత :: వడ్డాది రవికాంత్ శర్మ

అంబరాన్ని తాకే అంతస్తుల మేడ కూలిపోవచ్చు ……/
అవధులు దాటిన అబ్బురపరిచే నీ పేరు మసకబారవచ్చు …/
అవని మొత్తం ఏలాలి అనే నీ రాజ్య కాంక్ష బలహీనమవ్వవచ్చు …../
అబద్దపు మాటల ఆస్తిపాస్తులు ప్రభుత్వ చెరసాలలో బందీ అవ్వవచ్చు …./

నువ్వు చెప్పిన చదువు …/
నీ చేత అన్నం తిన్న వారి విశ్వాసం …/
ప్రకృతి మాత మేడలో పచ్చని హారం లా ……/
నీ పెరటిలో వేసిన తులసి మొక్క పంచే ప్రాణవాయువులా …./
తెలిసో తెలియకో సమాజానికి నువ్వు చేసిన గోరంత మంచి అయినా సరే …/
అన్నివేళలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది నేస్తం …../
అదే అదే అసలు శాశ్వతం …../

You May Also Like

3 thoughts on “అదే అదే అసలు శాశ్వతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!