నగరజీవితం

నగరజీవితం

రచయిత ::బండారు పుష్పలత

పల్లెటూళ్ళు లో ఒక మోజు పెరిగే…
నగర జీవితానికి పరుగులు తీసిరి…
నగరజీవితంలో ఏమోవున్నది అన్న ఆరాటమేతప్ప అన్యము లేదంట…..
ఇరుకు ఇరుకు గదులలో
ఇరుకు విధులల్లో..
ప్రేమ ఆప్యాత నటనల్లో
కృత్రిమ జీవితం…
తల్లి పిల్లా అంత హడావుడి జీవితం…
మిల మిల మెరిసే షో పుటప్ షోరూములతో ఆకర్షణ తో
ఆదమరచి మనముంటే
సాంతము నిను ఆగంచేస్తారు…
అన్నా, అక్కా చెల్లీ ఆత్మీయత
లేవండవు..
మన ఇంట్లో దొంగలు వడ్డ పక్కోడికి పట్టింపు ఉండదు…
భార్య భర్త లు ఇద్దరు సంపాదిస్తే ఇల్లు గడుస్తుంది..
కిరాయిలు కట్టలేక కళ్ళల్లో రక్త మొచ్చే…
రోడ్లమీద బస్సు, కార్లు, లంటూ నడవడానికి స్థలమే కరువైపోయే..
ఇక వానదేవుడు కరుణిస్తే
రోడ్లన్నీ జలమయం వాహనాలు పడవాళ్ల తేలి ఆడు…
కాలుష్యపు గాలిలో బ్రతుకు రోగాల పాలయే..
నైతిక విలువలు లేక పబ్బు గబ్బు కల్చరంటూ కుప్పి గంతుల విలువలొచ్చే…
ప్రకృతి పచ్చదనం లేక మెదమిద్దలే మెరయు
కోకిల గానం లేదు పిచ్చుకల కీకీలలు లేవు..
పొద్దున్నే హారన్ మోతలు అమ్ముకునే వాళ్ళ కూతలు
ప్రతిఇంట్లో టివి మోతలు సెల్ఫోన్ బాతాఖానీలు…
ఆశలు రేపు ఆశయా లు చూపి మోసాల వేషాలు
అద్దాల మెడల్లో డబ్బు డాబు కట్టు బాట్లలలో ఆడంబరాల నాటకాల నడుమ నాటకపు జీవితాలు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!