సద్గుణాలే విజయానికి సోపానాలు

సద్గుణాలే విజయానికి సోపానాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

జన్మానామ్ మానవ జన్మదుర్లభం. ఎందుకంటే మంచి చెడు తెలిసె విచక్షణా జ్ఞానాన్ని భగవంతుడు మానవునికి ఇచ్చాడు. అందువల్ల సద్గుణాలను కలిగి మానవత్వమే మాధవత్వమని చూపి చరిత్రలో చిరస్థాయిగా వుండే సామాన్యులే మహనీయులుగా మారిన సంఘటనలే మనకు ఆదర్శం.
వజ్రసంకల్పం, ఏకాగ్రతా చిత్తము కార్యసాధనలో అవరోధాలు ఎదురైన ఎదుర్కొని ప్రయత్నం చేస్తే విజయం చేకూరి గమ్యాన్ని చేరుతారని ఆచరించి చూపిన స్వామి వివేకానంద మనకేకాక వసుధైక కుటుంబానికే ఆదర్శనీయులు.
శాంతి అహింసలే సాధనాలుగా చేసుకుని భరతమాత దాస్య శృంఖలాలను తొలగించి స్వాతంత్ర్య సముపార్జన చేసిన జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచానికే దశ- దిశా నిర్దేశకులు. దేశం నాకేమి ఇచ్చిందని అడుగక, దేశానికి నేనేమిచ్చాను అని దేశంకోసమే “వందేమాతరం” అంటూ ప్రాణత్యాగం చేసిన అల్లూరి, భగత్ సింగ్ లు సదా స్మరణీయులే.
మానవత్వమే మాధవత్వమని ప్రేమతత్వమే ముముక్షత్వమన్న తథాగతుడు, కరుణామయులు చిరస్మరణీయులే. ప్రార్ధించే పెడవులకన్న దానం చేసే చేతులు మిన్న అన్న మథర్ థెరిస్సా, భూదానోద్యమకారులు వినోబాభావే, నీవెవరివో తెలుసుకుంటే జీవుడు లోనే పరమాత్మ ఉన్నారన్న రమణ మహర్షి ఎందరో, మరెందరో సామాన్యులు నేటికీ మనకు ఆదర్శనీయులు. కావున సద్గుణాలే విజయానికి సోపానాలని వారి బాటలో నడచి వసుదైక కుటుంబానికే చాటుదాం..!!

లోకా సమస్తా సుఖినోభవంతు
……………………………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!