అంతర్జాల మాయ (బుర్రకథ)

అంశం: హాస్యం

అంతర్జాల మాయ (బుర్రకథ)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

వినరా వినరా వీర కుమారా!
కమ్మని కథ చెప్తాను!!
మంచి కవిత చెప్తాను!!
చెప్పు మరీ!!
అనగా భూలోకమట. అందులో పుట్టేనట ఒక అంతర్జాలమనే విచిత్ర విశ్వలోకం.
ఎన్నెన్నో ఆప్స్ అందించే ఉచిత కాలక్షేపం…
ఏమి ఎరుగని పసిబాలలు కూడా మునిగితేలే మాయలోకం…
హో…హో… అలాగా!! భలే భలే! బహు బాగు.
తర్వాత ఏమయిందో చెప్పు మరీ.
అందులో తామర తెంపరులుగా వస్తున్నాయట
సెల్ప్ పబ్లిషింగ్ ఆప్స్…
భాషా జ్ఞానం లేనివారు కూడా కవితలు, కథలంటూ
రాసేస్తూ…
కవులం, కథకులమంటు చేసుకుంటున్నారు ప్రచారం…
పాఠానాక్తి లేని పాఠకులకు అదోక కాలక్షేపపు కబుర్లమయం…
నిజమైన పాఠకులకు ఏమి చదవాలో తెలియని అయోమయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!