పేగు బంధం

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

పేగు బంధం

రచన:ఐశ్వర్య రెడ్డి గంట

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్లైట్ దిగిన వెంటనే హడావుడిగా ఎయిర్ పోర్ట్ బయటికి వచ్చి తను బుక్ చేసుకున్న టాక్సీ లో ఎక్కి కూర్చున్నాడు అనిరుద్ .
కారు వేగంగా ముందుకు సాగుతోంది ,తన ఆలోచనలు ఏమో వెనక్కివెళ్తున్నాయి.
జేబులో నుంచి అడ్రస్ కాగితం తీసి ఒకసారి తన చేతులతో తడిమి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు అనిరుద్.
బాబు ఏసీ ఆఫ్ చెయ్ అని డ్రైవర్ తో చెప్పి కార్ విండో నుండి తల బయటికి పెట్టగానే తాకిన చల్ల గాలి తల్లి ప్రేమలా అనిపించి ఆమె తనతో మాట్లాడిన చివరి మాటలు గుర్తొచ్చాయి.
బాబు మీ నాన్నగారు చనిపోయినప్పటి నుండి నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను .నువ్వే నాకు ప్రపంచం,
కాని నేనో తప్పు చేసాను, ఆ పాపం వల్లనే ఈరోజు క్యాన్సర్ నన్ను మింగేస్తోంది.
ఏంటమ్మా అలా మాట్లాడతావు, చీమ కూడా హాని చేయని నువ్వు , తప్పు చేసావా అడిగాడు అనిరుద్
చేశాను అనిరుద్ ,నిజం చెప్పిన తర్వాత నువ్వు నన్ను అసహ్యించుకోకూడదు
ఏంటమ్మా ఎవరైనా తల్లిని అలా చేస్తారా చెప్పు అన్నాడు ఓదార్పుగా
నేను నీ కన్న తల్లిని కాదు అనిరుద్,
నీ తల్లి మహలక్ష్మి తను నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం,మా కుటుంబం జమీందారీ కుటుంబం ,. నాకు పెళ్లి చేసారు, మీ నాన్నగారు ఇల్లరికం వచ్చారు, రెండు సంవత్సరాల వరకు నాకు పిల్లలు కలగలేదు,చేసిన వైద్య పరీక్షలలో పుట్టే అవకాశాలు తక్కువే అని చెప్పారు డాక్టర్ లు.
మహలక్ష్మి కి నాతోపాటే పెళ్లయింది, అప్పటికి ఇద్దరు పిల్లలు నువ్వు చిన్న వాడివి పొత్తిళ్లలో ఉన్నావు, అప్పుడే మహలక్ష్మి భర్త పోలం దగ్గర బావిలో పడి దెబ్బలు తగిలి మృత్యువు తో పోరాడుతున్నాడు.. ఏడుస్తూ నా దగ్గరకు పరుగెత్తి కొని వచ్చింది పెద్ద మొత్తంలో డబ్బు కోసం తన భర్త ను బతికించుకోడానికి నాకున్న పిల్లల మీద ఆశతో తన అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిన్ను ఇమ్మని అడిగాను. భర్తను కాపాడుకోవడానికి నిన్ను త్యాగం చేసింది అనే దానికంటే.. నేను నిన్ను బలవంతంగా లాక్కున్నాను నీ తల్లి దగ్గర నుండి అనే చెప్పాలి, తను ఎంతో ఏడూస్తూ తన భర్త ప్రాణం కోసం తన ప్రాణాన్ని నా చేతులలో పెట్టింది. నీతో అక్కడే ఉంటే మళ్ళీ నిన్నెక్కడ అడుగుతుందో ఏమో అన్న భయంతో అప్పటికప్పుడే మా నాన్నగారు మమ్మల్ని అమెరికా పంపించారు నీతో పాటు . ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే నా భర్త యాక్సిడెంట్లో చనిపోయారు . ఆ మహలక్ష్మి కి నేను చేసిన పాపమే నాకు తెలుసు విదవనయ్యాను . ఆయన చనిపోయిన నిన్ను మాత్రం వదులుకోలేదు, ప్రాణంగా పెంచుతూ వచ్చాను కానీ చేసిన పాపం ఊరికే పోతుందా,నేను కూడా చనిపోతున్నాను, నేను నా తప్పును సరిదిద్దుకోవాలి అంటే నేను చనిపోయిన వెంటనే నువ్వు మహలక్ష్మి దగ్గరికి వెళ్ళు, నేను నీ బిడ్డను అని చెప్పు అంటూనే కన్నుమూసింది సుభద్ర. ఆ ఆలోచన లలో అనిరుద్ ఉండగానే కారు ఆగింది.

సార్ రామాపురం వచ్చాం సర్ చెప్పాడు డ్రైవర్
ఈ ఊరి ఆంజనేయస్వామి గుడి దగ్గరికి పోని చెప్పాడు అనిరుద్

డ్రైవర్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ అండి అని అడిగాడు ఒక అతన్ని

ఎవరిల్లు కావాలి మీకు అని అడిగాడు అతడు

వెంటనే వెనకాల ఉన్న అనిరుద్ మహలక్ష్మమ్మ కావాలి అని చెప్పాడు .
ఆవిడ అయితే ఇప్పుడు ఇంట్లో ఉండదు ,తను పొలంలో ఉంటుంది, అక్కడికి వెళ్తేనే తనను కలుసుకోవచ్చు

కానీ పొలం ఎక్కడ ఎలా వెళ్లాలి అడిగాడు డ్రైవర్

ఊరి చివర పోలం దగ్గర ఆపి కారు దిగిన అనిరుద్ తో అదిగో తనే ఆ పొలంలో పని చేస్తుంది తనే మహలక్ష్మి అని చెప్పి అవును మీరు ఎవరు, పెద్దగా చుట్టాలు కూడా ఎవరూ లేరు కదా అన్నాడు, కారులో వచ్చే వాళ్ళు ఏవరబ్బ అన్నట్లు గా

నేను తనను చూడటానికి వచ్చాను అండి అని చెప్పగానే
అతను మహలక్ష్మిని
ఓ అమ్మ నిన్ను చూడటానికి పట్నం నుండి ఎవరో వచ్చారు తొందరగా రా అని పిలిచాడు.
ఎండ తగలకుండా తలకు టవల్ చుట్టు కోని చీరమడిచి పైకి పెట్టుకొని పనిచేస్తున్న మహలక్ష్మి పొలంలో నుండి మొత్తం బురద చెమటతో నిండి బయటికి వచ్చింది.
ఏంటి ఎవరు అన్నట్లు చూసింది అనిరుద్ వైపు అనిరుద్ కి కన్నతల్లి ని అలా చూస్తుంటే దుఃఖం పోంగుకోచ్చింది. చేతుల్లో మొహాన్ని దాచుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తూన్నాడు, విషయం తెలిసినప్పటి నుండి ఒక రకమైన ఉద్వేగం ఆందోళన అయోమయ పరిస్థితి లో కోట్టుమిట్టాడుతున్నాడు అనిరుద్

మహలక్ష్మి మనసు బారంగా అయి ఎవరు బాబు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు ,నీకేం కష్టం వచ్చింది బాబు ,నాకు చెప్పు అని మహలక్ష్మి బతిమాలుతూ తన బురద చేతులతో అతన్ని ముట్టుకోవాలో వద్దో అని సంశయిస్తు అనిరుద్ ఎదురుగా నిలబడింది.
కారు డ్రైవర్ ,తీసికొని వచ్చిన సైకిల్ అతను అందరు అనిరుద్ ను చూస్తున్నారు ఆశ్చర్యంగా
వెంటనే మహలక్ష్మీ చేయిని తన చేతుల్లోకి తీసికొని అమ్మ నేను నీ కొడుకుని సుభద్ర పెంచిన కోడుకుని అని చెప్పాడు.
అంటే అంటే అంది ఆ కళ్ళల్లో నా కొడుకువేనా నన్న అనుమానంతో కళ్ళలో నుండి నీళ్ళు కారుతున్నాయి ఆనందంతో గుండె పొంగి పోతోంది.
ఆమె ప్రేమని గమనిస్తూ తను కూడా తల్లి ప్రేమకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నా వాడై అనిరుద్ తల్లిని అమ్మ అని గట్టిగా పట్టుకున్నాడు.
బాబు నువ్వు నా కొడుకువి కదా అని ఇంకా గట్టిగా పట్టుకోంది మహలక్ష్మి .
అవునమ్మా నీ కొడుకునే
ఇద్దరు తనివితీరా వారి బాధ పోయేటట్లుగా ఆనందం బాద కలగలిపి ఏడ్చారు.
అప్పటికే పొలాల్లో పనిచేస్తున్న అందరు వారి చుట్టు గుమిగూడి చూస్తున్నారు

మహలక్ష్మీ తేరుకుని అక్కడ నిలబడ్డ ఒక్కోక్కరికి నా బాబు చిన్నప్పుడు సుభద్రమ్మ నా కొడుకుని తీసుకెళ్ళింది అని చెప్పాను కదా.
వాడే నా కోసం అమెరికా నుండి వచ్చాడు అని చెప్తుంటే
నీకొడుకు అచ్చం దొర బాబు లాగానే ఉన్నాడు లక్ష్మి అంటున్నారు.
దిష్టి పెట్ట కండి వెళ్లండి మీరు మీ పనుల్లో కి అనిచెప్పి వారందరిని పంపించింది.
తల్లి ని ఆర్తితో చూస్తూ
అమ్మ
నాన్న అన్నయ్య ఏరి అడిగాడు అనిరుద్

ఎవరి కోసమైతే నువ్వు నాకు దూరం అయ్యావో ఆయన నాకు దక్కలేదు.
నువ్వు అమెరికా వెళ్ళి న రోజే మీ నాన్న చనిపోయారు. అని చెప్పి ఏడుస్తుంటే అక్కడే ఉన్న సైకిల్ అతను వచ్చి తమ్ముడు అన్నాడు అనిరుద్ ను చూస్తూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తున్నాడు అనిరుద్ మహలక్ష్మి అనిరుద్తో వీడే రా నీ అన్న శ్రీ రామ్అని చెప్పింది.
దగ్గరికి వెళ్లి అన్నయ్య అని గట్టిగా పట్టుకున్నాడు
తమ్ముడు అంటూ ఇంకా గట్టిగా హత్తుకున్నాడు శ్రీరామ్ .
అనిరుద్ మేము ప్రతిరోజు నీ గురించే ఆలోచించే వాళ్లం రా, నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం ఉండేది కాదు అమ్మ
ఎలా ఉన్నాడో తిన్నాడో లేదో అనుకుంటూ ప్రతిక్షణం నీ గురించి కలవరింతలు, నీ గురించిన ఆలోచనలే
అసలు ఎలా ఉండే అమ్మా ఎలా అయిపోయిందా తెలుసా నీ కోసం బెంగ పెట్టుకొని అని శ్రీరామ్ చెప్తుంటే
అన్నయ్య ఇంక మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నేను మీతో పాటే ఉంటాను . ఇక నుండి ముగ్గురం కలిసే ఉందాం అని చెప్పగానే శ్రీరామ్ మహలక్ష్మి చాలా సంతోషపడ్డారు.
విడిపోయిన రక్త సంబంధం 23 సంవత్సరముల తరువాత సప్త సముద్రాలు దాటి వచ్చి మళ్లీ కలిసింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!