శ్రమ-స్వేదం…స్వేచ్ఛా-రుధిరం

శ్రమ స్వేదం.. స్వేచ్ఛా-రుధిరం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పద్మావతి పి

సత్యం శాంతి అహింసాయుత పోరాటం
రుధిరం చిందించని సత్యాగ్రహం
తెల్లవారి దౌర్జన్యాలను అరికట్టుటకై
బానిస శృంఖలాలను తుదముట్టించుటకై
తూటాలకు ఎదరొడ్డిన గుండెల రుధిరం
వందేమాతర మంటూ నినదించిన నినాదం
భరత మాత నుదుటికి దిద్దిన రక్త సింధూరం..
సరిహద్దులలో క్షణం క్షణం దేశ రక్షణకై
రక్తం చిందించే వీరుల చరితలే అమరం..
ఆరు ఋతువులూ ఆరో ప్రాణంగా
నేలమ్మను సస్యశ్యామలంగా మలిచే రైతన్నల శ్రమస్వేదం
అన్నార్తుల ఆకలి తీర్చే సిరి సౌభాగ్యం..
ప్రేగు తెంచుకొని, ప్రతి రక్తపు బొట్టునూ
మమతానురాగాల మాతృత్వాన్ని పంచే అమ్మయే సృష్టికే ప్రేమామృతం..
తన శ్రమ స్వేదంతో కల్పవృక్షమై,
కుటుంబానికి రక్షకుడై శిక్షకుడై మార్గదర్శిగా నిలిచిన తండ్రికి వందనం..
బాలలే భరతావని భాగ్యమంటూ
బాలల శ్రమ స్వేదాన్ని వ్యాపారంగా మార్చే బానిస భావాల వెట్టి చాకిరీ
విధానం దేశ దౌర్భాగ్యం..
స్వేదం-రక్తం చిందించే శ్రమ సౌథాలే దేశాభ్యున్నతికి మార్గం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!