జ్ఞాపకాలపందిరి

జ్ఞాపకాలపందిరి

రచన: జయ

గతం అనేది జ్ఞాపకాల పందిరి
కన్నీళ్లతో పాటు జ్ఞాపకాలు కూడా
అప్పుడప్పుడు పలకరిస్తూ
గుండె గూటిలో పదిలంగా ఉండాలి.

కానీ ఆ జ్ఞాపకాలే నాకు ఊపిరి పోస్తుంటే..
అలుపు ఎరుగక నా వెనుకే పరుగులు తీస్తూ.
నను తీయనైన తీరాలో విహరింపచేస్తుంటే.

నా మనస్సులో కొలువైన నీవు
కంటిపాపవై దారి చూపిస్తుంటే.
ఇన్ని అద్భుతాలు నీ జ్ఞాపకాలు ఇస్తుంటే.

ఆ జ్ఞాపకాలకు చిరునామ ఇచ్చిన నువ్వు
బృందావనంలో మువ్వల రవళి వై
నను మరిపిస్తుంటే, ఇక నా నువ్వే
నా చెంత ఉంటే నా జీవితం అవ్వదా
నందనవనం కన్నా..
******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!