స్త్రీ -ఆరాధ్య దేవత

స్త్రీ -ఆరాధ్య దేవత

-వి. కృష్ణవేణి

సృష్టికి మూలం స్త్రీ..
ఆది అంతం స్త్రీకే సాధ్యం
నాలుగు గోడలమధ్య దేవాలయాన్నే
నిర్మిస్తుంది.
ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో
అక్కడ దేవతలు ప్రతిష్టించబడును.

స్త్రీ మనసు ఎంతో సున్నితం
ఆమె వ్యక్తిత్వం ఎంతో ఉన్నతం..

తన వ్యక్తిత్వాన్ని ఎంత గౌరవిస్తే
అంత ఉన్నత స్థానాన్ని
అధిరోష్టించగలదు.

ఆమె ఆత్మభిమానాన్ని కించబరచరాదు.
అభిమానిస్తే అందరిస్తుంది అవమానిస్తే
ఆధిపరాశక్తిగా దహించును.

అమ్మగా చెల్లెగా
ఇల్లాలుగా, స్నేహితురాలుగా,
కూతురుగా ఎన్నో అవతారాలతో
సృష్టినే నిర్మిస్తుంది.

స్త్రీని గౌరవించాలి వాళ్ళ
హక్కులను వాళ్లకు కల్పించాలి.

ఉన్నత లక్ష్యసాధనలో వారు
అడుగడుగునా ఎదుర్కొంటున్న సవాళ్లకు
చేయూతనివ్వగలగాలి.

కర్కషమానవ మృగాలనుండి రక్షణ కల్పించాలి.
స్త్రీ సాధికారతకు తోడ్పాటు కల్పించాలి.

సృష్టి లయ కర్త అన్ని స్త్రీయే”!అని
ఏ స్త్రీని అయితే బాధపెడతావో

ఆ స్త్రీవల్లే నీకు నాశనం  సంభవిస్తుందని

భారతంలో చెప్పబడినది అని తెలుకుని మెలగాలి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!