శ్రావణం శోభ!

శ్రావణం శోభ!

రచన: పరాంకుశం రఘు నారాయణ

శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున
శుభాలను పంచే శుక్రవారం రోజున
సాంప్రదాయ వేడుకల ఆర్భాటాలతో,
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం ఆచరించడం!
మంగళదాయకం! అశేష జనం ఆనందదాయకం!!
సకల ఐశ్వర్యాలను ఒసగే
సదాచార సంపన్నురాలైన
నయనానందకర శోభితయైన అష్టలక్ష్మి ఓ..అవతారమూర్తిగా..
జగజ్జననిగా ఆరాధ్యదైవంగా.., సౌభాగ్యాలను పంచే వరలక్ష్మిని ఆహ్వానించటం!
మహా శుభకరం! దివ్యమంగళ దాయకం!!
వాయనాల సందడితో ..
పడతులంతా హడావిడితో..
శ్రీహరి హృదయేశ్వరిని కొలవడం!
అష్టైశ్వర్య వైభోగమే!
ఆధ్యాత్మిక మహత్యానికి ప్రబల నిదర్శనమే!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!