తొలిపరవశం

తొలిపరవశం

రచన: జయ

ప్రేమకు భాష అంటూ ఉంటుందా..
లిపి ఉంటుందా..
ఏమో.! ఉంటే ఎలా చెబుతాం
నాకు తెలిసి అనంతమైన విశ్వంలో ప్రకృతికి మించిన అందం లేదు.
ప్రేమకు మించిన పరవశం లేదు.

ఈ రెండు ఒక చోట కలిసి నాలో లీనం అవ్వాలి.
అది ఎలా అంటే

నా మనస్సు దోచిన నా వాడు.
నా ఎదురుగా ఉన్నపుడు.
చూట్టూ ఉన్నా చెట్టుచేమ మా ప్రేమ కు పచ్చని తోరణం అవ్వాలి.

ఆ నీలాకాశమే మా ప్రేమ కు మురిసి
అక్షింతలై తొలకరిచిరిజల్లుతో మమ్మల్ని దీవిస్తుంటే.
పక్షుల కిలకిలా రావాలే శ్రావ్యమైన సంగీతమై మమ్మల్ని మైమరపిస్తుంటే.

గలగల పారే జలపాతం నా పాదాలను అలలై తాకుతుంటే.
మా మధ్య ఉంటానంటూ చిరుగాలి కూడా మమ్మల్ని బ్రతిమాలుతుంటే.

తన కళ్లలో నా ప్రతిరూపం చూస్తూవున్నపుడు.
తన చేతులలో నా చేతులను జత కలిపి.
నా నుదిటిపై తన తొలిముద్దు చాలు.
నీ నీడలా నేను ఉంటాను అని వేరే చెప్పాలా.

నా పెదవులకు తన పెదవులు జతచేసి పెట్టె చిలిపిముద్దు చాలు.
నా ఊపిరి ఇక నువ్వే అని ప్రత్యేకంగా చెప్పాలా
అంతకు మించిన ప్రేమ భాష ఉంటుందా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!