గోదారోళ్లమండి

గోదారోళ్లమండి

రచన: చింతా రాంబాబు

ఆయ్!
మేము గోదారోళ్ళమండి
పేమలు చూపించటంలో ముందుంటామండి
మర్యాదలు చేయటంలో మాకు
మీమే సరిసాటండి
ఆపదని తెలిస్తే పాణాలు ఇత్తామండి
సెరువుల్లో జల పుష్పాలను పెంచుతామండి
కొబ్బరాకులు మా ఊరికి
స్వాగత తోరనాలండి..
యటకారం మా రక్తం లో కలిసి
నవ్వులు పూయిస్తుందండి
చిటికలో చుట్టరికాలు కలిపి
వరసలు కలిపేస్తామండి..
మేము గోదారోళ్లమండి.

మా గోదారిపులసండి
ఎంతో రుసండి
పుస్తెలమ్మయినా తినాలండి
మా గోదారినీళ్లు తాగితే
ఎవరికైనా
యటకారం పుడుతుందండి
ఇది నిజమంది
ఒక్కసారి వచ్చి సూదండి
మా పేమలను రుచి సూడండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!