పంచాంగం
రచన: సుజాత. కోకిల
అమ్మగోరు అయ్యగోరు ఉన్నారయ్యా
ఎవరు? బాచ్చేను ఆ మాలసత్తయ్యను
అయ్యాఎందుకు,? చేప్పు మా పొలగానికి
లగ్గ బలంసూడాలి? అయ్యగోరి కోసం
అచ్చిన,ఉన్నారయ్యా లేడు ? యాడికి
ఎల్లిర్రు, ఎప్పుడు వొత్తరు? ఒపారి ఈడికి
అస్తర అమ్మగారు.ఆ ఎంటయ్య చెప్పు?
నేను మడి కట్టుకున్నాను.బైటకు రాలేను.
బైటనుండే చేప్పవయ్య అమ్మ ,దండాలమ్మ
సల్లగా పతుకు.అయ్యగోరు ఊళ్ళోనే
ఉన్నారామ్మ గోరు ఆ.ఆ ఊళ్ళోనే ఉన్నారు.
పిలగానికి శాంతి జపం చేయించడానికి
గుడికి వెళ్ళారు.తొందరగానే వస్తారు.
మీది.ఏ ఊరు మాది ఇక్కడే గోపాలపురం.
అమ్మా! మా తాతలనుండి మేము
మీ అయ్యగోర్ల యాడికి ఒత్తాము
మాకు చాన నమ్మకం.ఆ.చొప్పున్నే
మీ యాడికి ఒత్తాము బాచ్చేను.సరే నాయన
ఎవరి నమ్మకం వారిది నేనెందుకు
కాదంటాను.నాయనా మరి నీవు బైట
కూర్చోనేవెళ్ళి పూజ చేస్తాను.సరే అమ్మగోరు.