శివ స్మరణ

శివ స్మరణ
(కార్తీక మాసం సందర్భంగా )

రచన :యాంబాకం

జయశంకరా,జయశంభోహర
మహదేవ,గంగాధరా నిన్న
వర్ణింపగ నేనెంత వాడ దయాసాగరా
ప్రభూ నీ మహిమా తెలియగానే
వసమా పకృతి నీవే, పురుషుడవు నీవే, సత్యశివ సుందరా నిత్య దేవదేవుడా

అభవా బహునటనా విభవా
ఏకో నారాయణుడవు నీవే,
పరమాత్మ నీవే,జీవాత్మనీవే,
శివ శివ శంకర, భవ భగశంకరా

వందే శివఉమాపతిం జగత్ కారణా
వందేఫణిభూషణా భక్త త్రిశూల
కైలాస త్రిభువన సంతోషా
హళా హళ జలదారి,జై త్రిశూలధర, చంద్రకళ అఖిల చర చర,జై ధమరుక

ఓం నమఃశివాయ ఓంనమః శివాయ నీలా కల్పిత సంచారీ
ఫణిభూష విష్ణు రుషీకేషా భావజ మద సంహారీ

నమస్తే దక్షిణామూర్తి, ధక్షజాపతి త్రిపురాంతకా ,కౌమారి,
గంగా, గౌరీ హృదయ విహారి,
జయ జయమహాదేవా శంభోహర శంకరా అద్వేతభోధా అమృతాత్మ

నమస్తే నమస్తే “శ్రీ కాశీపురాధీశ
విశ్వేశ్వరా
నమస్తే నమస్తే “శ్రీ శైలం మల్లేశ్వరా”
నమస్తే నమస్తే” శ్రీ రామలింగేశ్వరా”
నమస్తే నమస్తే”శ్రీ ద్రాక్ష రామవాసాభీమేశ్వరా”
నమస్తే నమస్తే భూలోక కైలాస “శ్రీ కాళహస్తిశ్వరా”
నమః శివాయ నమఃశివాయ
నమఃపార్వతీ పతే హర హర మహదేవ శంభో!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!