బలమైన బంధం

(అంశం:”అల్లరి దెయ్యం”)

బలమైన బంధం

రచన: చిరునవ్వు Rj రాల్స్

కథ పూర్తి భావం: ఓ భర్త తన భార్యపై యే..దుష్టుడి కళ్లు పడకుండా ఆమె మనసుని లొంగదియకుండా తనని అంతలా మార్చుకునే ఆత్రుత అనుమాన బంధ ప్రయత్నమే ఈ కథ.

ముగ్గురు పెళ్లయిన ఆడవాళ్లు టెంపుల్ ఆవరణలోని వినాయకుడి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడుకుంటున్నారు..

అందులో ఒకరు ఏదో సందర్బంగా పెళ్లికాక ముందు మోసపోతే పరవాలేదేమో  కానీ పెళ్లయ్యాక ఇంకెవరితోనో పరిచయం ఏర్పడి మోసపోయి ఆవిషయం భర్తకి తెలిస్తే  ఆ ఆడదానికి జీవితమే ఉండదు అనుకుంటూ మాట్లాడుతుండటం చాటుగా వివేక్ గారు విని
ఇంటికెళ్లి అదే ఆలోచిస్తూ లోలోపల  అనుకుంటున్నారు
ప్రతీ అమ్మాయికి పెళ్ళికి ముందు పెళ్లి అయ్యాక కూడా వెంట పడే ముర్ఖులూ ఉంటారు , ఎలాగోలా లొంగదిసుకునే చమత్కారులు ఉన్న సమాజం ఇది.
నా భార్య అమాయకురాలు సమాజం ఏంటని తెలియని ఎర్రిబవులది ముందే ఉద్యోగం చేస్తుంది ఎలాగైనా తనని కాపాడుకోవాలి ఏం చేయాలి ఎలా అనుకుంటూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుండిపోయారు.
ప్రొద్దునే లేచి రెడీ అయి ఆధార్ కార్డు జేబులో పెట్టుకుని బయటకేల్లిపోయారు.
ఆవిడా ఎప్పటిలానే ఉద్యోగానికి రేడీ అయి వెళ్లిపోయారు.
వివేక్ ఇంటికి తిరిగొచ్చి మొబైల్ లోనే మునిగిపోయారు.

విషయానికోస్తే వివేక్ ఒక కొత్త సిమ్ తీస్కుని మొబైల్ లో వేసారు…వాళ్ళ ఆవిడకి తెలియని వ్యక్తిగా మాట్లాడాలని అతని  ప్రయత్నం.
అందుకోసం నార్మల్ మెసేజ్ చేయడం పనికి రాదు ఫొటోస్ ఆలా సెండ్ చేసే టైమ్ రావొచ్చు అని ఆ నెంబర్ తో వాట్సాప్ లాగిన్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారు…

ఎందుకంటె ఆల్రెడీ అతని ఓల్డ్ నెంబర్ కి వాట్సాప్ ఉంది ఎలాగైనా  డ్యూయల్ ఆప్ వాడాలని నిర్ణయించుకున్నాడు.
అతని క్లోజ్ ఫ్రెండ్ అయినా శ్యామ్ సలహా తీసుకున్నాడు. ఎలా అని శ్యామ్ కనుక్కుని చెప్పాడిలా నార్మల్ వాట్సాప్ కాకుండా జీబి వాట్సాప్, ఎఫ్ ఎం వాట్సాప్ ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి అనగానే ఆలా వివేక్ ఇంకో వాట్సాప్ లాగిన్ చేసారు.

ఏమవుతుందో అంతా నువ్వే వినాయక అంటూ భయభయంగానే DP లేకుండా సిమ్ కి ట్రూకాలర్ లో నేమ్ చేంజ్ చేస్కుని ప్లాన్ ప్రకారంగా మొదటి మెసేజ్ హాయ్ అని చేసారు.
ఆవిడా బిజీగా ఉండి ఆ టైమ్ లో చుస్కోలేరు…
ఈయన ఆత్రుత మాములుగా లేదు ఎంజరుగుతోందో అని
ఆవిడా చాలా సేపటికి చూసుకుని ఎవరు మీరు
మీరు నాకు తెలీదు మెసేజ్ చేయద్దు అని మాములుగా చెప్పి ఊరకున్నారు….
వివేక్ ఊరుకుంటారా ఇతని ప్రయత్నమే వేరు మల్లి మెసేజ్ చేసారు మీ స్మైల్ చాలా బావుంటుంది….మీరు సహస్ర గారు కదా జ్ఞానసరస్వతి కాలేజీ లో టీచింగ్ చేస్తున్నారుగా అని.
అంతే అవిడకి కొద్దిగా భయమేసి పక్కనే ఉన్న కొలిక్స్ కి ఎవరో చుడండి అని నెంబర్ ఇచ్చి కాల్ చేయించింది
వివేక్ ముందే పిరికి కాల్ లిఫ్ట్ చేయకుండా ఎవ్వరు ఆ నెంబర్ కి కాల్ చేసిన బ్లాక్ చేస్తూనే ఉన్నాడు.
చివరికి కొలిక్స్ లో ఒకరు ఎవరో కనుక్కున్దాం ఇతనికి వాట్సాప్ చేసారు హాయ్ మీ నేమ్ Dr.రోషన్ కదా బావున్నారా అని……వివేక్ ముందే ముదురు
లోలోపల  నవ్వుకుంటున్నాడు ట్రూకాలర్ లో ఆలా పెరుమార్చాడు…
ఆలా ఎవ్వరు వాట్సాప్ చేసిన వాళ్ళని బ్లాక్ చేసాడు.
సహస్ర కొలిక్స్ అందరూ వివేక్ కి తెలుసు పరిచయం కూడా. అందరూ కనుక్కోడానికి మాట్లాడ్డం చూసి రోషన్ బాగానే నవ్వుకుంటున్నాడు.
ఆ మరుసటి రోజు మల్లీ హాయ్ సహస్ర గారు అని మెసేజ్
అవిడకి కోపమొచ్చి తిట్టేసారు ఎవడ్రా నువ్ ఇంకోసారి మెసేజ్ చేస్తే బాగోదు మా ఆయనతో కొట్టిస్తా అని.
వివేక్ ఆ మెసేజ్ లు చూస్తూనే కొన్ని గంటలు ముసరిసిపోయాడు నా భార్య నా భార్యనే అని చిలిపిగా అనుకుంటూ ఏంటండీ మాట్లాడం కూడా తప్పేనా మీరు మా అన్నయ్యవాళ్ళ పాపకి ఎగ్జామ్స్ లో బాగా హెల్ప్ చేసారు థాంక్స్ చెప్పాలని హాయ్ అని మెసేజ్ చేసాను.
అవునా మీ స్మైల్ బావుంది అని  అనాలిసిన అవసరం లేదుగా ఎక్సట్రాలు చేయొద్దు నువ్ ఎవరో చెప్పు ఎక్కడుంటావ్ మీ అన్నయ్య వాళ్ళ పాప ఎవరు అని కోపంగా అన్ని క్వశ్చన్స్ ఒకేసారి వేసేసింది సహస్ర.

వివేక్ ఉద్దేశం తనని ఇంకో వ్యక్తి గా ప్రేమలో పడేయాలని కొద్దిగా తగ్గి  తన సమాధానంగా క్షమించండి తప్పుగా మాట్లాడాన మిమ్మల్ని చూడగానే బాగా నచ్చేసారు.
ప్రాజెక్ట్ రికార్డ్స్ లో డౌట్స్ అంటూ ఏదో వంకతో మీ నెంబర్ స్టాఫ్ రూమ్ లో తీసుకున్నాను…

నిజంగా మీ స్మైల్ ఎలాంటి కల్మషం లేకుండా పసిపిల్లల నవ్వులాగా స్వచ్ఛంగా ఉంటుంది అని కొద్దిగా పొగిడేసారు.

కానీ సహస్ర గారు కోపంగానే పిచ్చా మీకేమైనా నచ్చడం ఏంటి  నేను అల్రెడీ మారీడ్ ఇంకోసారి మెసేజ్ చేయొద్దు మా అయన కి ఇలా అని తెలిస్తే ని కాళ్ళు విరగ్గొడతారు నాపైన నమ్మకం కూడా పోతుంది మెసేజ్ చేయద్దు అని గట్టిగానే చెప్పారు.

వివేక్ అవన్నీ పట్టించుకోట్లే ఇప్పుడు వివేక్ వివేక్ కాదుగా ఇంకెవరో అనేలా పరకాయప్రవేశం చేసినట్టు ఇంకా పెళ్లికాని కుర్రాడిలా తనో లవర్ బాయ్ లా  రొమాంటిక్ యాంగిల్ ని పరీక్షించుకుంటున్నాడేమో అన్నట్టుగా మల్లి మెసేజ్ చేసారు…
క్షమించండి మల్లి ఇంకెప్పుడు మెసేజ్ చేయను కానీ ఒక్క హెల్ప్ చేస్తారా మీరు బాగా నచ్చారు మీకు మ్యారేజ్ అయిపొయింది అనగానే హోప్స్ పోయాయి కనీసం చివరగా మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను అని మెసేజ్ చేసారు.
సహస్ర గారు ఆపుతారా ఈ చూడడాలు గిడడాలు ఏమి లేవు మీరు ఈ మెసేజ్ లు ఆపి పనిచుసుకోండి అదే మీ ఆరోగ్యానికి మంచిది అనగానే ఏంటండీ సహస్ర గారు ఆలా అంటారు నాకంటూ ఒకరు దొరికారు అని మిమ్మల్ని చూడగానే హ్యాపీ గా ఫీలయ్యను బాగా హర్ట్ చేస్తున్నారు ఒక్కసారి మిమ్మల్ని చూస్తానండి.
ఇక్కడ వివేక్ గారు తనని ఎలాగైనా లవ్ లో పడేయాలని తనని పొగడ్తలతో ముంచి, తనమీద అతి ప్రేమ ఉన్నట్టు నటన కురిపించి  ఆవిడా మనసు కరగగొట్టే ప్రయత్నం చేస్తున్నారు..
ఆవిడ కొలిక్ ఒకరు పెద్ద బఫెలో పర్సన్ ఆవిడా సహస్ర కి ఇలా సలహా ఇచ్చింది ఒకసారి అతని ఫోటో పెట్టమనండి చూద్దాం ఎలా ఉన్నాడో…. దానికి సమాధానంగా సహస్ర ఆవిడ మీద కోపంగా ఏమి అవసరం లేదు.
మనకెందుకు అతని ఫోటో హలో Dr రోషన్ గారు మీరు హర్ట్ అవ్వడం కాదు మీతో మాట్లాడ్డం నాకిష్టం లేదు ఇప్పటికే చాలా ప్రాబ్లెమ్స్ లో ఉన్నాను మీ వళ్ళ
నా లైఫ్ నాశనం అవ్వచ్చు బై ఇంకోసారి మెసేజ్ చేయద్దు అని చెప్పేసి కట్ చేసారు…

ఆ మరుసటి రోజు సహస్ర గారు కొన్ని రోజులు అమ్మ వాళ్ళతో గడపాలని  పుట్టింటికి వెళ్లారు.
తనని పడేయాలి అని కుట్రతో వివేక్ నువ్ వెళ్లడం నాకిష్టం లేదు అని ఆమెతో వాదించి మాట్లాడ్డం మానేసి పంపించాడు అంతా వివేక్ ప్లాన్ ప్రకారంగానే చేస్తున్నాడు.

లేదంటే భర్త మీద ప్రేమతో Dr రోషన్ తో మాట్లాడదుగా దూరం పెడితే ఈ రోషన్ తో మాట్లాడుతుందని.

ఆవిడా వెళ్లిన రాత్రి మల్లి మెసేజ్ చేసాడు మీరంటే నాకు చాలా ఇష్టం మీ స్మైల్ బావుంటుంది.. ఒక్కసారి మిమ్మల్ని చూస్తాను Dp లో మీ ఫోటో పెట్టండి  ప్రామిస్ గా మల్లీ  మెసేజ్ చేయను ప్లీజ్ సహస్ర గారు అని… సహస్ర కోపంతో వాళ్ళ బ్రదర్ కి నెంబర్ ఇచ్చి కాల్ చేయిస్తుంది వివేక్ ఎప్పటిలానే అతన్ని కూడా బ్లాక్ చేయడం…
ఆలా కాదని వాట్సాప్ లో బండబూతులు తిట్టిస్తుంది
అప్పుడు వివేక్ ఆ బూతులు సొంత బామ్మరిదే తిట్టడం తట్టుకోలేక వాడి వాట్సాప్ కూడా బ్లాక్ చేసి హలో సహస్ర గారు మీకేమైనా మెంటలా నా నెంబర్ ఎవరేవరికో  ఇస్తున్నారేంటి  మీ నెంబర్ కూడా నేను ఎవరెవరికో ఇచ్చి అల్లరి చేయొచ్చు కానీ మీరు
నన్ను ఎంత చీకొట్టిన తిట్టించిన నేనేం ఫీలివ్వట్లే ఎంతైనా ఒకమ్మాయి పరువు తీయడం కరెక్ట్ కాదు మీరంటే చాలా అభిమానం మర్యాద మీలా నేను చెయలేను నన్ను మరీ అంత నసగాడిలా అనుకుంటే నేనేం చేయలేను బై అని మెసేజ్ కట్ చేసాడు…
ఆ మరుసటి రోజు నుండి సహస్ర రోషన్ మంచోడేమో అని ఆలోచనలో పడిపోయింది.సహస్ర పక్కనే ఉండే కొలిక్ ఏంటి అతని ఫోటో చూసావా బావున్నాడా అని ఆశలు పుట్టిస్తుంది…
వివేక్ ఎలాగూ సహస్ర నాకు దగ్గర్లో లేదు నేనెలాగూ తన కాల్స్, మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు ఇంతకంటే మంచి సమయం మల్లి రాదు అని వీర ప్లాన్స్ వేస్తున్నాడు.
మెల్లిగా మెసేజ్ చేసాడు హాయ్ సహస్ర గారు తిన్నారా అని….
తను చుసిన కొద్దిసేపటికి అడగొద్ధు అనుకుంటూనే అసలు మీరెవరు ఎక్కడుంటారు ?ఏంచేస్తుంటారు? మీ ఫోటో పెట్టండి అని…
వివేక్ చిలిపిగా ఏంటండీ కొంపతీసి కొట్టిస్తారా ఏంటి అంత పని చేయకండి మాట్లాడ్డం ఇష్టం లేకుంటే వొదిలెయండి..
మీకు అనవసరం మీరు ఫోటో పెడితేనే మాట్లాడేది అని సహస్ర గారు..
సరేనండి మిమ్మల్ని నమ్ముతున్నాను మాది మీ పక్క ఊరే వివేక్ అన్నింటికీ ముందే ప్లాన్స్ వేసుకున్నాడు.
గూగుల్ క్రోమ్ నుండి ముందె ఒక హ్యాండ్సమ్ అబ్బాయివి ఒక పది ఫొటోస్ డిఫరెంట్ వర్క్స్ స్టిల్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుని అందులోంచి కొన్ని పెట్టాడు తనకి.
ఒకవేళ తనని  వెతికించిన తనెవరో కనిపెట్టాలేరుగా అని
సహస్ర వాళ్ళ కొలిక్ చూసి చాలా బావున్నాడు ఏంచేస్తున్నాడో కనుక్కో సహస్ర అంటూ బాగా చెడగొడుతుంది…
వివేక్ డబ్బున్న అబ్బాయిగా బిల్డప్ ఇవ్వాలని అలాగైతేనే అమ్మాయిలు పడ్తారని ప్లాన్ తో నేను B.Tech చేసాను ఇరిగేషన్ లో వర్క్ చేస్తున్నాను…మా అమ్మగారు గవర్నమెంట్ లెక్చరర్ ,మా ఫాథర్ బిసినెస్ చేస్తున్నారు నేను ఒక్కణ్ణే అబ్బాయిని అని బాగా బిల్డప్ ఇచ్చేసాడు…
సహస్ర కొద్దికొద్దిగా రోషన్ మాయలో పడటం స్టార్ట్ అయింది
నేనంటే అంత పిచ్చేంటి మీకు మీకు మ్యారేజ్ అయిందా అని అడగడం వివేక్ కాలేదండి టూ మెంబెర్స్ లవర్స్ ఉండేవారు ఒకరు ఇంట్లో బయపడి మ్యారేజ్ చేస్కుని వెళ్లిపోయారు…
ఇంకొకరు నన్ను బాగా వాడుకుని ఇంకోడితో లేచిపోయారు. అప్పటినుండి అమ్మాయిలంటే చిరాకుతో మ్యారేజ్ చేసుకోలేదు చాలా రోజులకి మిమ్మల్ని చూసాను చూడగానే బాగా హ్యాపీ అనిపించింది నాకంటూ ఒక పర్సన్ ఉందనిపించింది.
హలో హలో రోషన్ ఆగండి ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు లవ్ చేయట్లేదు.
అవును మరీ నన్ను చూసినపుడు నా కాళ్ల వేళ్ళకి మెట్టెలు చూడలేదా…?
వివేక్ అయ్యో సొరీ నాకు మిమ్మల్ని చూడ్డానికే టైమ్ సరిపోలేదు ఇంకా మెట్టెలు చూడడమా అని అబద్ధాలు అలవోకగా చెప్పేసారు…
ఆ మాటలకి సహస్ర రోషన్ మంచోడు తనని బాగా లవ్ చేస్తున్నాడు అని నమ్మేస్తుంది అయినా లోపల ఏమవుతుందో అని భయంగానే  మాట్లాడుతుంది.

మరుసటి రోజు వివేక్ హాయ్ అండి వెళ్ళారా టీచింగ్ కి లేదండి అమ్మవాళ్ళింటికొచ్చా..
అవునా తిన్నారా అంటూ మాటలు అదే పులిహోర కల్పుతూనే ఉన్నాడు…
సహస్ర మాత్రం మీతో మాట్లాడాలంటే భయంగా ఉందండి. వివేక్ హే ఊర్కోండి ఎందుకు భయం…

అయినా ఈ సమాజంలో ఎవరు కరెక్ట్ గా ఉన్నారని అందరూ ఎవరి సంతోషాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అయినా మీతో నేనేం పిచ్చిగా మాట్లాడట్లేదుగా..

జస్ట్ అమావాస్య పున్నానికి బావున్నారా.. తిన్నారా.. అని మాత్రమే మెసేజ్ చేయండి చాలు కాల్స్ అస్సలొద్దు ఇంకోటి మీరు మెసేజ్ చేస్తే తప్ప నా అంతటగా నేను చేయను ఇంకేంటి భయం అంటూ తనని వివేక్ మాయ చేస్తున్నారు.

సహస్ర అయినా తప్పు తప్పే ఎప్పటికి దాగిఉండదు మీరు మాట్లాడ్డం మానేసేయండి తమ్ముడు అని….

ఒక్కసారి వివేక్ మొహం బద్ధలేయింది ఏంటి నాకర్ధం కాలేదు ఏంటండీ అని అదే తమ్ముడు అన్నాను..

వివేక్ భర్తగా గా తన భార్యని చూసి మురిసిపోవాలో లేదా రోషన్ మాటలకి బలవుతుందో అని బయపడాలో తెలియట్లేదు అయినా తన ప్లాన్ ప్రకారం తనని పడెయ్యాలి అనేది మాత్రమే మైండ్ లో పెట్టుకున్నాడు.

నీకేమైనా మెంటలా తమ్ముడు ఏంటి నేను బాగా సెన్సిటివ్ తొందరగా హర్ట్ అవుత నిన్ను ఎంతగానో ఇష్టపడితే తమ్ముడు అంటావా అవసరం లేదు మాట్లాడకండి బై

కొద్దిసేపటికి ఇంకో ప్లాన్ తో  సహస్ర గారు నన్ను చాలా బాధపెడుతున్నారు అయినా నా లైఫ్ అలాంటిది ఇలా అన్ని నాకే జరుగుతయేంటో అందరూ నాకు కాకుండా మధ్యలోనే వెళ్లిపోతున్నారు ఇప్పుడు మీరు కూడా నాతో ఆడుకుంటున్నారు…

ఈవిడ కొద్దిగా కరిగి సోరీ మరేం చేయను మీరు వినట్లేదు నాకు మ్యారేజ్ అయింది కావాలంటే మీకు సంబంధం చూడాలా మీ క్యాస్ట్ చెప్పండి నాకన్న బెటర్ అమ్మాయిని చూస్తాను…

మీకు మాట్లాడ్డం ఇష్టం లేకుంటే మాట్లాడకండి కానీ నన్నిలా గుచ్చి గుచ్చి చంపకండి నాకు మీరు నచ్చారు…
హలో రోషన్ నచ్చడం ఏంటి అసలు ని ఉద్దేశం ఏంటి..?

సహస్ర గారు మీరు కనీసం నా మ్యారేజ్ వరకైనా నాతో జస్ట్ బావున్నావా అని  మాట్లాడండి అంతే ఇంకేమొద్దు మీనుండి.

సహస్ర మొత్తానికి రోషన్ ఆలోచనల్లో పడిపోయింది.

ఆ మరుసటి రోజు గుడ్ మార్నింగ్ సహస్ర
హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ అంతే ఇక
వివేక్ కి బాగా కోపమొచ్చేసి
మీ లేడీస్ కి చాలా అలవాటైపోయింది మొగాళ్ళు  ప్రేమిస్తున్న తల్లో అంటుంటే తమ్ముడు అన్నయ్య అనడం బాగా అలవాటైపోయింది.
ఫీలింగ్స్ తో ఆడుకోడం మీకు సరదా కావొచ్చు కానీ నేను సెన్సిటివ్ మీకు ముందే చెప్పాను హాండ్స్ కోసుకోడాలు నాకు అలవాటే చుడండి అని కోపంగా మెసేజ్ కట్చేసి…

ఈ హ్యాండ్ కట్ వివేక్ ప్లాన్ లో లేదని వెంటనే హ్యాండ్ కట్ కి సంబందించిన ఫొటోస్ ఒక ఐదు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాడు.
సహస్ర అయ్యో సొరీ తమ్ముడు నిజమా హ్యాండ్ కట్ చేస్కుంటావా బయపెడుతున్నావా ఏది కోస్కో..
వివేక్ ఏంటి సహస్ర నాలైఫ్ నీకు జోక్ గా ఉందా
సరే చూడు ఐదు నిమిషాల్లో లో కట్ చేస్కుని ఫొటోస్ పెడ్తా…

అన్నట్టుగానే రోషన్ కొద్దిసేపటికి బ్లడ్ డ్రాప్స్ ఫోటో , హ్యాండ్ కట్ ఫోటో ఆలా మ్యాచ్ అయ్యేలా ఒక మూడు పిక్స్ పెట్టగానే సహస్ర షాక్ అయిపోయింది.. అవన్నీ నిజమే అనుకుని అంత లవ్ చేస్తున్నాడా అని మాట్లాడ్డం స్టార్ట్ చేసింది సోరీ సోరీ రోషన్ నేను అనుకోలేదు కట్ చేసుకుంటావని నొప్పిగా ఉందా నావల్ల ఎవ్వరు బాధపడకూడదు…
అందుకే మాట్లాడ్డం నాకిష్టం లేదు సోరీ ఇంకెప్పుడు ఇలా చేయకు.
సహస్ర నువ్వు హ్యాపీగా ఉండి నాతో హ్యాపీగా మాట్లాడు చాలు అంతే ఇంకేమొద్దు ఆలా అంటూనే తనని ప్రేమలోకి లాగేసాడు.. సహస్రకి లోపల చాలా భయం ఏర్పడింది.
మాట్లాడ్డం తప్పు అని తనకి తను లోలోపల అనుకుంటూనే ఉన్న రోషన్ ఒక్కో ప్లాన్ కి కరిగిపోతూనే ఉంది.
అయినా తను కరిగిపోడానికి ఇంకో కారణం వివేక్ తనతో మాట్లాడక పోవడం కాల్స్, మెసేజ్ కి ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడం…ఆలా తన మైండ్ డైవర్ట్ అవుతుంది.

రోషన్ కొద్దికొద్దిగా రెచ్చిపోయి ఏంటే, ఒసేయ్ అంటూ మాట్లాడే వరకొచ్చాడు మధ్యమధ్యలో ఐ లవ్ యు లు చెప్పడం బంగారం, బుజ్జి, చిట్టీ అనడం
అవన్నీ తనకు నచ్చవని చెప్పొద్దని వేడుకున్న వినేవాడు కాదు..
సహస్ర నెక్స్ట్ రోజే వాళ్ల అత్తగారింటికి వెళ్ళాలి
రోషన్ మెసేజ్ లు ఎక్కడ వాళ్ళ అయన చూస్తాడో ఏమవుతుందో అని లోపల భయంగానే రోషన్ కి నువ్ మెసేజ్ చేయద్దు నేను రేపు ఇంటికెళ్తున్న అంటూ చాట్ చేస్తూనే రాత్రి 11:30 అయింది.
వివేక్ భయం సహస్రలో ఉందా అసలు…..? రోషన్ ని నిజంగానే లవ్ చేస్తుందేమో అని తెలుసుకోడానికి ఆ 11:30 సమయం లోనే తన ఓల్డ్ నెంబర్ తో ఏంటే ఇప్పటివరకు ఆన్లైన్ లో ఉండి ఎవరితో చాట్ చేస్తున్నావ్ లేదండి మా క్లాసుమేట్ కవిత చాలా డేస్ కి మెసేజ్ చేసింది…
సహస్ర అబద్ధం చెప్పడం వివేక్ కి కోపమొచ్చి కవిత ఆన్లైన్ లోనే లేదు ఎవరికి చాట్ చేస్తున్నావ్ పిచ్చి పిచ్చి కతలు పడొద్దు నరికేస్తా మూసుకొని పడుకో ఆలా బెదిరించగా తను సైలెంట్ గా నెట్ ఆఫ్ చేసి పడుకోడం జరిగింది.

ఆ రాత్రి రోషన్ కి రిప్లై ఇవ్వకుండానే పడుకోడంతో మరుసటి రోజు ప్రొద్దున నుండి రోషన్ హాయ్ సహస్ర లేచారా టీ, టిఫిన్….
రెడీ అయ్యారా..? కాలేజీ వెళ్ళారా..? ఆలా రిప్లై లేకున్నా మెసేజెస్ చేస్తూనే ఉన్నారు…అవన్నీ సహస్ర గమనిస్తూనే ఉంది.
చివరకి రోషన్ ఇలా కాదని సహస్ర తనవల్ల ఎవరు బాధపడిన చూడలేదన్న  మైనస్ పాయింట్ గుర్తు తెచ్చుకొని
ఇదిగో నువ్ నాతో మాట్లాడలేదో ఒకప్పుడు హ్యాండ్ తో ఆగింది ఈ సారి కచ్చితంగా పికతో నా పీడ పోతుంది అంటూమెసేజ్ చేయడం అది చూసి సహస్ర బయపడి మాట్లాడ్డం జరిగిన కొద్దిసేపటికి  రోషన్ కాలేజీ కి లీవ్ పెట్టు మూవీ కెళదాం అంటూ అనడంతో
సహస్ర మూవీ నా….. ఇదే మంచి సమయం వీడిని వదిలించుకోవడం అనుకుంటూ సరే రేపు వెళదాం అని మెసేజ్ కట్ చేసింది..
కానీ వివేక్ కోపంతో రాగిలిపోతూ అవునా రాత్రి మెసేజ్ చేసి బయపెట్టాను అయినా మూవీకి  వెళ్ళడానికి రెడి అయింది రేపు చెప్తా దీని పని విడాకులు అయినా పరవాలేదు నన్నే మోసం చేయాలనీ చూస్తుందా అనుకుంటూ రగిలిపోయాడు.

మరుసటి రోజు మొదలయింది రోషన్ గా నటిస్తున్న వివేక్ తన భార్య ఆలా ఎలా మారిపోతుంది దాని సంగతి ఏంటో ఈ రోజుతో తేలిపోవాలి అని మెసేజ్ లు ఆపట్లేడు లీవ్ తీస్కున్నావా….?మూవీ కి వెళ్తున్నాం కదా..? టికెట్స్ బుక్ చేసేసాను…..
హ లివ్ తీసుకున్న కచ్చితంగా వొస్తాను నువ్ థియేటర్ దగ్గర వెయిట్ చెయ్యి…
అనుకున్నట్టుగానే రోషన్ గా నటిస్తున్న వివేక్ థియేటర్ దగ్గరే సహస్ర కోసం చూస్తున్నాడు.. మూవీ టైం అయింది.

అందరూ లోపలికి వెళ్లిపోయారు సహస్ర తన హస్బేండ్ ఏటేల్లారో కనుక్కుందాం అని కాల్ చేస్తున్న వివేక్ లేపట్లేరు
రోషన్ మూవీ టైమ్ అయింది ఎక్కడున్నావ్ సహస్ర అంటూ ఒకటే మెసేజ్ లు.
తనకేం తోచట్లే బయపడ్తూనే థియేటర్ వరకేల్లింది అక్కడ ఈ రోషన్ ఎవ్వరు లేరు తను డైరెక్ట్ లోపలికొచ్చేసేయ్ అని మెసేజ్లు.
వివేక్ చాటుగా తొంగి చూస్తూనే ఉన్నాడు లోపలికి వెళ్తుందేమో అని…. సహస్ర మాత్రం వివేక్ కి కాల్ చేస్తూనే ఉంది.
సరే కాల్ లిఫ్ట్ చేద్దామని వివేక్ లేపగానే ఒకటే ఏడుపు మీకేమైంది కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేరు నాకు చాలా భయంగా ఉంది తొందరగా థియేటర్ కి రండి నన్ను ఎవడో బాగా నసపెడుతున్నాడు..
నేను కాదంటే చస్తాను అని వేదిస్తున్నాడు మీతో ఎన్ని సార్లు చెప్పాలని చూసిన మీ మూడ్ ఇప్పుడెలా ఉంటుందో అని భయం తో చెప్పలేకపోయాను…మీతో వాడికి ఎలాగైనా వార్నింగ్ ఇప్పించాలని మూవీ కి వస్తానని చెప్పాను తొందరగా రండి మల్లి వాడు దొరకడు.నేను ఆ టార్చెర్ భరించలేను నా లోకమ్ మిరే అంటూ ఏడుస్తూ మాట్లాడ్డం వివేక్ గుండెలను బద్ధలు చేసింది.
వివేక్ ఇంకేదో అనుకుని ఆవేశంగా ఉన్నాడు కానీ ఇక్కడ జరిగింది వేరు తన భార్య ప్రేమని తట్టుకోలేక పోయాడు అమాంతం వెళ్లి తనని వాటేసుకున్నాడు.
నన్ను క్షమించు సహస్ర ఇక్కడ రోషన్ అని ఆలా ఎవరు లేరు ఆ రోషన్ ఎవరో కాదు నేనే….ఇదంతా ని ప్రేమని ఇంకా బలపరుచుకుందామని చేసిన ఒక ప్రయత్నం అంతే అనుకుంటూ కంటతడి పెట్టేసాడు…
ఏంటండీ చిన్నపిల్లాడిలా ఆపండి ఏడవడం మీకొక విషయం  చెప్పనా సమాజం లో మంచి చెడు
ఊహించకుండ ఏవ్వరు లేరు నేనేమి చిన్నపిల్లని కాదండి అయినా నన్ను ఎవ్వరు లొంగదిసుకోవాలని ప్రయత్నించిన మీ ప్రేమ ముందు అన్ని తక్కువే అండి.
వివేక్ కి సహస్ర మాటలతో చాలా ముచ్చటేసింది ఎంత పిచ్చిగా ఆలోచించాను మొగాడికన్న ఆడదానికే మెచూరిటీ పవర్ ఎక్కువకదా…. ఆడది తప్పుచేయాలంటే ఎవ్వరు ఆపిన ఆగదు అంటారు అలానే ఆడదాని వంచించిన  ప్రేమని కూడా ఎవ్వరు ఆపలేరు అనేది నిజమే ఈ చిన్నవిషయాన్నీ మరిచిపోయానేంటి అని తనలో తను సిగ్గుగా అనుకుంటూ ఆ ప్రయతన్ని ముగించాడు.
ఈ చిన్న ప్రయత్నమే సహస్ర ప్రేమగొప్పతనాన్ని, వివేక్ లోని ప్రేమని ఇంకా పెంచింది వాళ్ళ బంధాన్ని బలపరిచింది.

గమనిక : యే మొగాడైనా తన భార్యమీద స్వచ్ఛమైన ప్రేమని చూపినంత వరకు తన భార్య అతని భార్యే… Of

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!