సినిమా హాల్లో దెయ్యం

(అంశం:”అల్లరి దెయ్యం”)

సినిమా హాల్లో దెయ్యం

చెరుకు శైలజ

నేను మా అక్కయ్య కలసి ఎండాకాలంలో హైదరాబాద్ లో మా అన్నయ్య ఇంటికి వెళ్ళాం.
నాకు మా అన్నయ్యకి పెళ్లి అయి సంవత్సరమే అయింది. మా అక్క కి ఇద్దరు పిల్లలు వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళేఅందుకే వాళ్ళని తనతో తీసుకు రాలేదు. హైదరాబాద్ కి వచ్చి సంవత్సరం అయింది .
కాబట్టి ముగ్గురం తరచు కలుసుకుంటు ఉండేవాళ్ళం. మాకు సినిమా పిచ్చి కూడా ఎక్కువే అప్పట్లో వచ్చిన ప్రతి సినిమా చూసేవాళ్ళం. అలాగే మా అన్నయ్య ఆఫీస్కి వెళ్లక తను మరలా వచ్చేటప్పటికి రాత్రి పది అవుతుంది. ఆ రోజు తన ఆఫీసు లో ఏవో సెలబ్రేషన్స్ ఉన్నాయి రావడం లేట్ అవుతుంది అని చెప్పాడు. మేము సినిమా చూద్దాం కుహహ అని డిసైడ్ అయి అది పాత సినిమా హాల్ లో అయిన దగ్గర లో ఉంది.
పైగ విఠాలాచార్య సినిమా అన్ని మంత్రాలు దయ్యాలతో ఉంటుందని ఉత్సాహం గా బయలుదెరాం. సినిమా హాల్ దగ్గర అంత రష్ ఏమి లేదు. మాములుగా ఉంది. ముగ్గురం టీకెటు తీసుకొని లాస్ట్ లైన్ కాకుండా ఒక మూడోవరుసలో కూర్చున్నాం. అంతా జనాలు ఏమి లేరు. అక్కడ అక్కడ ఏరీవేసినట్టు ఉన్నారు. అక్క సినిమా అంతా రష్ లేదు. బాగలేదేమోనే కదా అని అంది ఉదయ . అదే నాకు కూడా అనిపిస్తుంది అని అంది విజయ
ఏం కాదు ఈ సినిమా తో పాటు రెండు కొత్త సినిమాలు, ఈ రోజే సార్టు అందుకే రష్ తక్కువగా ఉంది వనజ అంది. అక్కడ టికెట్ దొరకకుంటే అందరు మరల ఇటే వస్తారు. ఇంతలో పేరు పడుతున్నాయి . అన్ని తలుపులు మూశారు సినిమా మొదలైంది.
మేము ముగ్గురం ఆసక్తి గా చూస్తున్నాం మధ్యలో ఇంటరువెల్ ముగ్గురు లేచి వాష్ రుమ్ కి వెళ్ళి వస్తూ చిప్స్, వాటర్ తెచ్చుకున్నాం.మరల సినిమా మొదలైంది. చూస్తున్నాం ఇందులో మా పక్క లైన్ సిటీలో ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపించి అంటు చివరి కూర్చున్న ఉదయ చూసింది. ఆమె తెల్ల బట్టల్లో జుత్తు అంతా విరబోసుకుని ఉంది మొఖం కనబడకుండా . ఆమె సినిమా సగం అయిపోయాక వచ్చింది. అయిన సినిమా వైపు చూడడం లేదు.
అక్క చూడు అంటు మెల్లగా విజయను చేయి తో తట్టి చూపెట్టింది. విజయ మెల్లగా వంగి చూసింది. ఏమైంది అంటు వనజ అంది చూడు వనజ ఆమె ఎవరో మధ్యలో వచ్చింది. అయిన సినిమా చూడకుండా ఎలా క కూర్చుందో.. వనజ కూడా చూస్తూ అవును . ముగ్గురికి భయం వేసింది. అసలే సినిమా లో రాజకూమరి దెయ్యం తో పెనుగులాట జరుగుతుంది. ఏం చేద్దాం అనుకున్నారు .ఎవరు ఈ విషయం గమనించిన ట్టు లేదు. ఆ వున్న కొందరు సినిమా లో లీనమైనారు. వెళ్లి పోదామా మెల్లగా ఉదయ అంది. మనం వెళ్లిపోతుంటే మన వెనుకలే వస్తే ఎలా పైగా బయట ఎవరు ఉండరు.
సినిమా అయిపోయాక అయితే అందరితో పాటు దైర్యం గా వ వెళ్లొచ్చు విజయ అంది .
ఏం లేదు మనం మెల్లగా పై లైన్ లోకి వెళ్లి కూర్చుదాం వనజ అంది .
ఉదయ నువ్వు మెల్లగా లేచి వెనుకలైనుకి వెళ్లు
అమ్మో ఏం కాదు మధ్యలో ఆ సిటీకి ఖాళీ ఉంది కదా.. వుంటే మాత్రం ఫస్ట్ సిటులోనే కూర్చోని ఉంది. ఏం కాదు మెల్లగా వెళ్లు. నీ వెనుకే మేం వస్తాం
హ దైర్యం తో మెల్లగా లేచి వెనక లైన్ సిటులోకి వెళ్లింది.
అలాగే విజయ, వనజ కూడా లేచి వెళ్ళుతు ఉంటే వనజ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కిందపడింది. ఆ బాటిల్ తీసుకోవడానికి ప్రయత్నించకుండ హడావుడిగా వెనుకకు వెళ్ళుతు ఆమెను చూసింది.
ఆమె ఆ బాటిల్ తీసుకుంటుంది అది ఏమిటి ఆమె చేతులు ఉల్టా ఉన్నా యి
ఓయమ్మో దయ్యమే అనుకుంటు భయంగా వెనుకకు వెళ్లింది.
ఆ విషయం వాళ్ళకు చెప్పింది.
ఏం మాట్లాడకండి మరల మన వైపు వస్తుంది. కొన్ని నిమిషాల లో సినిమా అయిపోతుంది .
విజయ భయపడుతునే చెప్పింది ముగ్గురికి సినిమా మీద ధ్యాస లేదు.
ఎప్పుడు సినిమా అయిపోతుందా! తొందరగా బయటికి వెళ్లి పోదామా అన్న టుగా చూస్తున్నారు
అంతా ఏసిలో కూడా వాళ్ళకి చెమటలు పట్టినాయి.
ఎందుకో ఎవరికి వారే భయపడుతు అటువైపు చూశారు .అక్కడ ఆమె లేదు. అక్కా చూడు ఆమె లేదు. చూపెట్టింది. విజయ, వనజ చూశారు.
నిజమే ఆమె అక్కడ లేదు. అరే ఎటు పోయి ఉంటుంది.కనబడకుండ మాయమపోయిందా అనుకుంటున్నారు
ఎవరి ఆలోచనలో వాళ్ళు వెనుకాల ఏదో తమ సిట్ని కుదిపినట్టు అనిపించి,
వనజ వెనుకకు చూసింది గుండె లో దాడ ఆమె వారి వెనుక సిటులో కూర్చుని తెల్ల గా జుట్టు విరబోసుకోని భయకరంగా ఉంది.
విజయ ,ఉదయ కూడా అంటు చూసి స్పీడ్ గా లేచి డోర్ దగ్గరకు పరుగెత్తారు .ఉదయ పరుగెడుతు ఉంటే తన బ్యాగ్ కిందపడింది .
ఆ బ్యాగన్ని భయంతో సీటు కిందపడిన తన బ్యాగ్ నుండి తీసుకుంటు ఆమె కాళ్ళ వైపు చూసింది.
ఆ పాదాలు మన పాదాలలాగ లేవు ఉల్టాగా ఉన్నాయి‌
ఏమైంది ఉదయ రావడం లేదు. అని వాళ్ళు వెనక్కి చూశారు .ఉదయ బాగ్ తీసుకుని పరుగెత్తుకుంటూ వారిని చేరి.
అక్క అది దెయ్యమే డౌట్ లేదు
ఎందుకంటే బాగ్ తీస్తూ చూశాను.
బ్యాగు వదిలి రాక విజయ అంది అందులో డబ్బులు విలువ అయీనవి ఉన్నాయి
అయిన నీ ధైర్యాన్ని ఒప్పు కోవచ్చు వనజ అంది.
సినిమా డోర్ దగ్గరికి డోర్ ఓపేన్ చేయడానికి అబ్బాయి వచ్చాడు
ఏమి అమ్మ అప్పుడే వచ్చారు .సినిమా మొత్తం చూడర ఏం సినిమా బాబు మీ సినిమా హాల్లో దెయ్యం మమ్మల్ని వెంబడిస్తుంది అన్నారు.
అతను ఎక్కడ అమ్మ అన్నాడు అదిగో అంటు వేలు పెట్టి ఆ సిటు వైపు చూపెట్టారు. అతను అక్క డికి వెళ్లి చూసి వచ్చి అక్కడ ఎవరు లేరు అన్నాడు. విచిత్రం ఎక్కడ చూసినా ఆమె కనిపించలేదు.
ఆ సినిమాలో ఆ రాజకూమారిని దెయ్యం విడిచినట్లు ఆమె కూడా వెళ్లి పోయింది.
తలుపులు తెరిచిన వెంటనే ముగ్గురు బయటకు అందరి తో పాటు బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని ఎక్కాం.
ఎవరు ఒక మాట యైన మాట్లా కాకుండా మౌనం గా ఇల్లు చేరారు .
ఇంటికి వచ్చే సరికి కిశోర్ ఆఫీస్ నుండి వచ్చి ఉన్నాడు
చెమటలతో, భయంగా వచ్చిన వారిని సినిమా ఎలా ఉంది అడిగాడు
ఏం సినిమాండి దెయ్యం సినిమా నిజం గా దెయ్యం మమ్మల్నిభయపెట్టింది.వనజ భర్తతో అంది.
అవును అన్నయ్య చాలా భయపడిపోయాం.ఉదయ అంది.
అసలు సినిమానే చూడలేదురా భయం తో మధ్యలో వద్దాం అంటే
అది ఎక్కడ మా వెంట వస్తుందోనని భయం విజయ అంది .
అరె అలా జరిగిందా కొంచెం కాళ్ళు ,చేతులు కడుక్కుని కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోండి అంటు వాళ్ళ కి వాటర్ తెచిౠ ఇచ్చాడు.
వనజ ఫ్రెండ్ పక్కింటి ఆమె బెల్ కొట్టింది . వనజ తవహలుపు తీసింది
వనజ ఎటు వెళ్ళారండి. నేను సాయంత్రం నుండి మీ కోసం చూస్తున్నాను అంది.
దేనికి అన్నటు వనజ చూసింది. ఏం లేదు మీ కోసం ఎవరో వచ్చారు.ఇది మీకు ఇవ్వమని చెప్పారు.అంటు ఒక కవరు ఇచ్చింది. అది బ్లౌజ్లు కుట్టిన కవరు. ఆమె ఇచ్చింది.
తను సినిమా కెళ్ళిన విషయం
అక్కడ జరిగిన విషయం అంతా చెప్పింది .
అయ్యో మీకు తెలియదా! అది ఎప్పటిదో, పాత థియేటర్ అందులో దెయ్యం తీరుగుతుందని అందరు చెప్పుకుంటారు.
రాత్రి షోకి అయితే ఎవరు దైర్యం చేసి వెళ్ళారు అంది.
ఓ అలాగే అండి అంటు విజయ, ఉదయ, ఆమె చెప్పే మాటలు వింటూ అలాగే మొఖాలు చూసుకున్నారు .ఆమె ఆ విషయాన్ని చెప్పి వెళ్ళిపోయింది
కిశోర్ వీళ్ళతో భోజనం చేస్తూ.. రేపు వేరే సినిమా మారుతుంది. మరల ఒకసారి చూసి వస్తారా
ఆ దెయ్యం ఉందో, లేదో అనుకుంటూ నవ్వాడు. సరేలేండి
ఇప్పుటికే వణికి పోతున్నాం. మన పక్క ఆమె చెప్పే నా మాటలో ఇంకా పూర్తిగా వణికిపోతున్నాం. మీకు ఆట పాటించడానికి ఇప్పుడే దొరికిందా. కోపంతో వనజ అంది అవును నిజంగా ముగ్గురం
ఆ దెయ్యాన్ని చూసి అన్ని మరిచీపోయాం
సినిమా మాట ఇప్పుట ఇప్పట్లో లేదు విజయ అంది
అవును అక్క ఎంతో ఘోరమైన అనుభవం అంటు ఉదయ గుండేమీద చేయి వెసుకొంది. ఆ ముగ్గురి మాటలు వింటు నవ్వుతూ, సరే భోజనం చేసి హాయిగా నిద్ర పోండి అన్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!