చిరంజీవులం

చిరంజీవులం

అంశం :: నిన్నుదాటి పోగలనా

వద్దన్నకొద్దీ కమ్ముకొచ్చే కారుమేఘాల్లా
నీ తలపులు
దూరంగా ఉండమంటున్నా వినకుండా దూసుకొచ్చే
నిన్ను గూర్చిన ఆలోచనలు

అపరాహ్ణం అర్ధరాత్రి
ఉదయాస్తమయాలు ఘడియలూ గంటలూ
నన్ను వదలిపోని నీ కాగెంగిలి స్పర్శలు
ఎన్నాళ్లిలా….
విసుగొచ్చేస్తోంది…. విరక్తీ కలుగుతోంది

నిన్ను దాటి నే పోగలనా అనుకుంటూ నేను
నన్ను విడిచి క్షణమైనా ఉండనేలేనంటూ నువ్వు
ఎదురు వాయనాల భారాలు మోస్తున్నాం
ఒకే పుటకు పుట్టిన వాక్యమూ, భావాల్లా
చర్యా ప్రతిచర్యల సాహచర్యాన్ని పొందుతున్నాం

కానీ….ఓ అక్షరమా….
అదే వాస్తవం…
నువ్వూ నేనూ వేరు కాదన్న వాదన
నీలో నేను నాతో నీవు పెనవేసుకున్న బంధం మనదన్న శోధన….

రచయిత ::  సుధామురళి

You May Also Like

One thought on “చిరంజీవులం

  1. చాలా బాగుంది మీ అక్షర బావవేశం👍👏👏😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!