గుండెచప్పుడు

గుండెచప్పుడు

అంశం:నిన్ను దాటిపోగలనా

ఊయలకు,సమాథికి మధ్య కాలాన్ని వెలిగిస్తూ
ముద్దు,ముద్దు రూపాలతో
నాతో దోబూచులాడే గంధమేగా నీవు!
నిన్ను దాటి నేనెలా పోగలను..!

నా అస్తిత్వాన్ని నిలిపే నీడై,
నా ఆకలితీర్చే మెతుకు గింజై,
దప్పిక తీర్చే సెలయేరై,
ప్రాణవాయువులు పంచే పచ్చని చెట్టై,
ఆరోగ్యాన్నిచ్చే ఔషథమొక్కై,
నన్నెటికీ ఎడబాయని మరో అమ్మేగా నీవు..!
మరి.. నిన్ను దాటి నేనెలా పోగలను ?!

భారాలన్నీ మోసి అలిసి పుటుక్కున తెగే
నా దేహాన్ని నీ కడుపులో దాచుకునే
లయకారిణివి నీవేగా!

నీకు,నాకు వున్న బంధాన్ని
గుండెచప్పుడు తో  పెనవేయటమే తప్ప
నిన్ను దాటి నేనెలా పోగలను ?!

రచయిత ::  సోంపాక సీత

You May Also Like

2 thoughts on “గుండెచప్పుడు

  1. ఆమ్లజని అత్యవసరమైన నేటి గడ్డు కాలంలో…
    ఉచితంగా ఆమ్లజనినందించే తరువుల ప్రాశస్త్యాన్ని
    వివరించిన కవితాత్మక కవిత👌👌💐💐💐
    సీత గారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!