నా ఊపిరి

నా ఊపిరి

అంశం : నిన్ను దాటి పోగలనా

అమవాస నిశిని నేను…
స్వర్ణకాంతుల దివ్వెవు నీవు….

విచ్చుకున్న కమలం నువ్వు…
తొలివేకువ రవికిరణం నేను…

నిండు పున్నమి నెలఱేడును నేను
పులకింతల నిండు కలువవు నీవు…

తోడు లేని ఒంటరి బాటసారిని నేను…
తరగని నీ కనుపాపల వెలుగే నా తోడు…

తీరమెరుగని నడియేటి నావను నేను
దారి చూపు తళుకుల తీరపు చుక్కవు నీవు

శిశిర రాగాల మలయ సమీరపు చలి
చిలిపి చక్కిలిగింతవు నువ్వు….
చలిమంటల వెచ్చని ఆచ్చాదనగా
ఆక్రమించి నిను అల్లుకుపొయే
అల్లరి ఆగడాల ఆకతాయినే నేను…

భరింతునని ప్రతినబూని మూడుముళ్ల
బంధంతో నిను చేబట్టిన నాధుడ నేను….
భర్తగా నను భరిస్తూ, నిన్ను నువ్వు త్యజిస్తూ
నా ఇంటిని నిలిపేటి భార్యామణివే నువ్వు
నా ఇంటి దీపమే నువ్వు..నా ప్రాణం నువ్వు

ఊపిరివై నన్నాక్రమించి నా పంచ ప్రాణాలూ
నీవైనావే…నిను వీడి నేను మనగలనా…
నిన్ను దాటి నే  పోగలనా..ఏనాటికైనా…!!

రచయిత ::   సత్య కామఋషి ‘రుద్ర’

You May Also Like

3 thoughts on “నా ఊపిరి

  1. అద్భుతంగా ఉంది మీ భావ రచన👏👏👏😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!