మదిలోని నేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                మదిలోని నేస్తం

రచన ::సరస్వతి

అక్షరాలతో ఆకట్టుకోనే పదాలకుసుమం నా అల్లరి నేస్తం
పదాలతో పలుకరించే తీయని భావమే నా ఆత్మీయ నేస్తం
కవ్వింపుల కవనాల కెరటాలతో నా అనుబంధం నేస్తం
మాటలతో మెప్పించే మళయమారుతం నా చిలిపి నేస్తం
కలవరమైన మదిలో దరహాసం పూయించిన వెన్నెల కిరణం నా బలమైన నేస్తం
అమ్మడు అంటూ మురిపించి
అమ్మాయి అంటూ కదిలించి
ఓయ్ అంటు అల్లరి చేసి
ఈ జన్మకి మిగిలిపో ఇలా ఓ బంధానివై
ఊపిరి ఉన్నంత వరకు అల్లరి నేస్తానివై!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!