ఆత్మీయ నేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                ఆత్మీయ నేస్తం

రచన ::నామని సుజనాదేవి

వందమంది లో ఉన్నా నీ శ్వాస వినగలిగేవాడు
వేల గొంతులోక్కటై వ్యతిరేకంగా నినదించినా
నీ వెన్నంటి నిలిచేవాడు
కోటి మంది ఏకమై నిందించినా నీ చేయి వదలని వాడు
నీవు సరైన దారిలో వెళితే నీ వీపు తట్టేవాడు
నీ మంచికై సర్వం చేసి
నీ కృతజ్ఞతలు స్వీకరించనివాడు

నీవెంత దూరం లో ఉన్నా నిన్ను వినగలిగేవాడు
నువ్వెన్ని మైళ్ల దూరం లో ఉన్నా నిన్ను కనగలిగేవాడు
ఏ రక్తసంబంధం లేకున్నా ఆత్మబందువయ్యేవాడు

కష్టసుఖాల్లో కలిసి ఉండేవాడు
కలిమిలేముల్లో తోడై ఉండేవాడు
ఎప్పుడే కష్టమొచ్చినా వెంటనే గుర్తోచ్చేవాడు
నీ ప్రతి అడుగులో నీ నీడై ఉండేవాడు

కులమత వర్ణ వర్గ లింగ భేదాలకతీతమైన వాడు
సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించినట్లు
నీ హృదయంలో ఉదయించి చావులో అస్తమించేవాడు
వాడే వాడే వాడే నిజమైన స్నేహితుడు,హితుడు, నేస్తం
నీ ఆటపాటల్లో పాలుపంచుకునే అల్లరి నేస్తం
ఆత్మీయ నేస్తం ఆత్మ బంధువు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!