నీ చాయను నేను

నీ చాయను నేను

అంశం :: నిన్ను దాటి పోగలనా

గమ్యం తెలియని రాదారిలో- దివిటీల ఎదురొచ్చావు 

ఏకాకిగా మిగిలిన నాడు – స్నేహ హస్తమందించావు

నింగి లోని అర్కునివీ నీవు –  కొలనులోని అంబుజాన్ని నేను 

నడిసంద్రంలో నావలా నిలిచిన నాడు – దిక్సూచిలా దిశనే తెలిపావు

జీవిత గమనం చెదిరిన నాడు – చిరు దీపమై దారి చూపావు 

మనసు మనసునే ద్వేషించిన నాడు – నవనీత పూత వైనావు 

కారు మబ్బులు కమ్మిననాడు – కాంతి రేఖలా కదిలొచ్చావు 

నా హృదయం కలత చెందిన నాడు – నీ కరమునే నాకందించావు

అడుగులోన అడుగేసి – అండగానె నిలిచావు 

చకోర పక్షిలా నిరతము వేచె – అలసిన కనులకు కమ్మని కల నిచ్చావు

నాజీవన గమనంలో  – నీ అడుగులు జత కూడినవి

నా హృదయమునే హారతి చేసి – నీ అండగ నేనుండనా  

కాంతి రేఖలా మెరిసే బింబము నీవు – నిను వీడని నీ చాయను నేను

ఉప్పొంగే ప్రేమవు నీవు – ప్రేమను గ్రోలె తృష్ణను నేను

పదములో పదములు కలిపి – ప్రాణనాధుడ వైనావు 

నిన్ను దాటి పోగలనా – నిమిషమైన నిను విడ గలనా.

రచయిత :: సావిత్రి కోవూరు

You May Also Like

One thought on “నీ చాయను నేను

  1. చాలా బాగుంది మీ రచన సావిత్రి గారు👏👏👏😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!