అంతరంగానో …. బాహ్యంగానో

అంతరంగానో …. బాహ్యంగానో

అంశం :: నిన్ను దాటి పోగలనా

ఆలోచనల సుడిగుండం  ఎల్లప్పుడూ చుట్టుముట్టగా …
సంతోషాల సరిగమలు ప్రతి సాయంత్రం  నన్ను చేరగా ….
అంతరంగానో …. బాహ్యంగానో …..
ఎదో ఒకరూపంలో  నిన్నే స్మరిస్తూ …..

కలంపట్టి కవిత రాస్తూ ….
గళం విప్పి గానం చేస్తూ …
పురివిప్పిన నెమలిలా నాట్యమాడుతూ ….
నటరాజు సాక్షిగా  పాదం కదుపుతూ ….
నిన్ను దాటి వెళ్లగలనా సఖీ….
నా అస్తిత్వమే నువ్వైనప్పుడు ….
జీవితం సాక్షిగా ….
ప్రపంచానికి తెలియని జ్ఞాపకాల పందిరిలో …
అనునిత్యం  బందీ అయ్యే నీ  సున్నిత నేస్తాన్ని ….

రచయిత ::  వడ్డాది రవికాంత్ శర్మ

You May Also Like

26 thoughts on “అంతరంగానో …. బాహ్యంగానో

    1. అక్షరానికి,” కరము”కి విడదీయలేని బంధం కదండీ!!
      అద్భుతమైన స్నేహం ఆ రెంటిది!!
      చాలా బాగుందండి 👌🏻

  1. అద్బుతంగా వ్రాసారు రవికాంత్ శర్మ గారు

    1. ధన్యవాదాలు బుజ్జమ్మ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!