ఆత్మ ఘోష

(అంశము:: “కొసమెరుపు కథలు”)

ఆత్మ ఘోష

రచన: తిరుపతి కృష్ణవేణి

ఇంకా ఏమి మిగిలింది అని ఏడుస్తున్నారు. ఈ ఏడ్పు నేను ముందే ఏడ్చాను కదా! మీ మాట మీదే గాని?
నామాట ఎవరైనా విన్నారా?
మీ మూర్కత్వంమే కదా,
ఈ అనర్ధానికి కారణం.! చేతులు కాలాక ఆకులు పట్టకోవడం అంటే ఇదే మరి! వాళ్ళ ఏడ్పులు వింటుంటే నాకు కంపరంగా వుంది.
ఎంతగా మొర పెట్టుకున్నా? ఒక్కరంటే ఒక్కరైనా, నా బాధను ఆలకించారా?సాటి ఆడదానిగా,అమ్మ అయినా, నా మనసును అర్ధం చేసుకుంటుందని భావించాను.?
కాని అందరూ ఏకమై నా మెడలు వంచారు. ఏం జేస్తా! నా ఖర్మ ఇలా కాలి పోయింది.
కనీసం కట్టుకున్న భర్త అయినా ప్రేమను పంచి ఆదరిస్తాడనుకున్నాను!
అదంతా వట్టి భ్రమగానే మిగిలింది.
ప్రశాంతి జరిగిన సంఘటనలను తలచుకొంటూ
తన గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
ఎవరికి వారు భోరు బోరున విలపిస్తున్నారు. నా మనసును మాత్రం ఎవరూ అర్ధం చేసుకోలేక పోయారు.
ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నారు.

అత్తారింట్లో ఏ ఒక్కరోజు ఆదరణకు కూడా నోచుకోని నేను, ఇంకా ఏ ముఖం పెట్టుకొని వారి మధ్యన తిరుగగలను?
ఎందుకు అలాంటి మూర్కుల మధ్యన వుండటం అని,
ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.
ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటే వారం రోజులు నా వెంటబడి ఒప్పుకో తల్లి! ఎప్పుడూ, మాకళ్ళముందే ఉంటావు. ముసలి తనంలో అంతకంటే తృప్తి మాకేముంటుంది చెప్పు! అని బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పించి, వాళ్ళ స్వార్ధనికి బలి చేశారు.
బాగా విద్యావంతుడు, తెలివైనవాడు, చూడటానికి అందంగా కనిపిస్తాడే, కాని ఏం లాభం! ఆయనను నేను ఏ నాడు భర్తగా ఉహించు కోలేదు. స్వార్ధ పూరీతమైన ఆలోచనలుండే,వారి కుటుంబం అంటేనే నాకు మొదటినుండి నచ్చేది కాదు.?
సంతోష్ బావ అంటే కేవలం గౌరవం, అభిమానం తప్ప అయనపై ఏ రకమైన ప్రేమ భావం ఉండేది కాదు.
ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటాడు. పూజలు, పునస్కారాలతో ఎక్కువ సమయం గడుపుతారు. నిత్యం డబ్బుసంపాదనపై మక్కువ. ఇతర ఆలోచనలు అసలే ఉండవు. అత్తా మామలతో పాటు అందరి మనస్తత్వాలు అంతే ?
ఆస్థులు కూడబెట్టు కోవటమే? ఆ స్వార్థం తోనే కపట ప్రేమలు వలకబోసి అమాయకులైన అమ్మ, నాన్నలను బుట్టలో వేసుకొని నా గొంతు కోశారు.

నేను ఇంతలా రోదిస్తున్నా, ఎవరూ పట్టించుకోరేo? నన్ను చూడనట్లుగానే తిరుగుతున్నారు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా తలలు బాదుకుంటూ గుండెలవిసిపోయేలా ఏడుస్తున్నారు.

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!