చీకటి బ్రతుకు

(అంశము:: “కొసమెరుపు కథలు”)

చీకటి బ్రతుకు

రచన: జయ

హెల్లొ! ఏవండి నేను దివ్య ఫ్రెండ్ అండి,దానికి ఈ పెళ్ళి ఇష్టం లేదు,తనకి చదువుకోవాలని ఉంది.
అందుకు మీరు కొన్ని రోజులు పెళ్ళి వాయిదా వేయమని పెద్దవాళ్లను అడుగుతారా.
అలా అని మీ ఫ్రెండ్ చెప్పమని చెప్పిందా.!
అది కాదు అండి తనకు చదువుకొని జాబ్ చెయ్యాలని ఉంది.
ఓహ్ అవునా, అయితే మీ ఫ్రెండ్ నే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పమని చెప్పండి.
మీరు నాకు ఎందుకు చెబుతున్నారు.
చదువేనా కారణం ,లేకపోతే మీ ఫ్రెండ్ కి ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా.! అని కోపంగా అడిగే సరికి అబ్బే అదేమి లేదండి, అని వణుకుతూ చేప్పింది శ్రీ, అయినా మీతో ఎందుకు చెప్పించింది, తనే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా నాతో.
తనకి భయం గా ఉంది అంట మీతో మాట్లాడానికి, అందుకే నేను చెబుతున్న, మీరు చదువుకున్న వాళ్లే గా తనని అర్ధం చేసుకోండి దయచేసి తను చాలా బాధ పడుతుంది.

సరే అండి, ట్ర్య్ చేస్తా , మీ ఫ్రెండ్ ని ఒకసారి  నాకు కాల్ చెయ్యమని చెప్పండి.
సాయంత్రం 7 కి నేను ఇంట్లో ఉంటా చెప్పండి.
సరే అండి థాంక్స్.
ఇంతకీ మీ పేరు చెప్పలేదు.
నా పేరు శ్రీ అండి,దివ్య కి బెస్ట్ ఫ్రెండ్ ని.
దివ్య ,శ్రీ మాట్లాడవా ఆయనతో ఎమ్మన్నారు.
ఏమంటారు ,ఆయన ఒప్పుకోరు అనిపిస్తుంది.
అవునా,!
హ్మ్మ్ అవును.
అయినా, నిన్ను సాయంత్రం 7 కి కాల్ చెయ్యమన్నారు.
వామ్మో నేనా,
హా నువ్వే నే బాబు.
భయం గా ఉందే,
ఉంటే ఏమి చేస్తావ్,ఇంత కన్నా వేరే మార్గం లేదు పెళ్ళి ఆపడానికి.
సరే నే చేస్తా.
సాయంత్రం 7 అయ్యింది.
దివ్య కాల్ చేసింది.
హెల్లొ , హెల్లొ నేను దివ్య ని.
హా చెప్పు ఏమి చేస్తున్నావ్.
అది ఏమి లేదు.మీతో మాట్లాడాలి,
హా చెప్పు, ఏమి మాట్లాడతావ్?
చెప్పు ఉదయం మీ ఫ్రెండ్ ఏదో చెప్పింది.
నువ్వు ఏమి చెబుతావు.
నేను అదే చెబుతా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.
నేను చదువు కోవాలి,మంచి జాబ్ చెయ్యాలి.
ఓహ్ అవునా, ఇవే కారణాలు అయితే ఇవి పెళ్ళి అయిన తరువాత అయినా చేయొచ్చు.
దీనికి పెళ్లి వాయిదా వేయడం దేనికి.
అది కాదు అండి,పెళ్ళి అయితే చదవడం కుదరదు, అందుకే జాబ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తా పెళ్లి గురించి.
మరి ఈ మాట మీ అమ్మా నాన్న తో చెప్పకపోయావో.
హా, చెప్పాను అండి వాళ్ళు వినడం లేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్న,మీ మాట వింటారు అని.
సరే చెబుతా కానీ,నా మాట మా ఇంట్లో వాళ్ళు వినరు.
ఏమి చెయ్యాలి. చదువు కోసం ఈ పెళ్లి ఆపడం చాలా కష్టం.
ప్లీస్ అండి నాకు ఇప్పుడు ఈ పెళ్ళి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు.
ఈ పెళ్లి ఇష్టం లేదా,లేక నేను ఇష్టం లేదా.
దివ్య కి అర్ధం అయ్యింది ఇతను ఒప్పుకోవడం కష్టం అని.
అది అది
నిజం చెప్పు,నువ్వు నిజం చెబితే మీ అందరిని నేను ఒప్పిస్తా అని మాట ఇస్తున్నా అన్నాడు.
దివ్య నిజమే నా .
హా నిజమే.
అది రెండూ ఇష్టం లేదు.
నాకు వేరే అబ్బయి అంటే ఇష్టం, కానీ తనతో నా ప్రేమ విషయం చెప్పలేదు,తను చెప్పినా నేను ఒకే చెప్పలేదు, జాబ్ వచ్చిన తరువాత చెబుదాము అని.
ఇప్పుడు హఠాత్తుగా పెళ్ళి అంటున్నారు.
అందుకే మీకు చెబుతున్న, నన్ను మీ ఫ్రెండ్ అనుకోని నాకు దయచేసి హెల్ప్ చెయ్యండి.
సరే నువ్వు కంగారు పడకు నేను చూసుకుంటా కానీ.
నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నీ కోసం నీ ప్రేమ కోసం నిన్ను, నా ప్రేమను వధులుకుంటున్న.
సరే ఉంటాను.
అతని మాటలకి దివ్య ఊపిరి పీల్చుకుంది.
కానీ అది ఎంతో సేపు లేదు.
మరుసటి రోజు కాలేజీ నుంచి వచ్చే సరికి.
అమ్మ కోపం గా ఉంది.
ఇంటికి రాగానే నన్ను గదిలోకి తీసుకువెళ్లి గట్టిగా కొట్టింది.
చంపేస్తావ,పరవుగా బ్రతకనివ్వవా,నీ వెనుక ఎంత మంది ఆడ పిల్లల జీవితాలు ఆధారపడ్డాయో నీకు తెలుసా.
ఎంత ధైర్యం ఉంటే పెళ్ళి కొడుక్కి ఫోన్ చేసి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెబుతావు.
ఈ లోపు మావయ్య వచ్చి.బానే చేసావు తల్లి మీకు స్వేచ్ఛ ఇచ్చినందుకు బా బుద్ది చెప్పావు.మీ నాన్న వస్తే అందరిని ఒకే సారి చంపుతాడు.
ఒక మాట కాదు,తలో మాట .
ఇంట్లో నుంచి కథల్నివ్వలేదు, ఎంత ఏడ్చిన,ఇష్టం లేదు అన్నా,తిండి మానేసిన ఎవరు పట్టించుకొలెద్దూ, అయ్యిపోయింది జీవితం నేను కన్నా కలలు అన్ని కల్లలై నన్నే వెలివేశాయి,నాకు నేనే బరువు అయ్యిపోయా.
చావలెను, బ్రతకలెను, చచ్చే అంతా పిరికి దాన్ని కాదు,బ్రతికే అంతా ధైర్యం లేదు.కాలానికి,విధికి, తల్లి తండ్రులు పరువుకి విలువ ఇచ్చి నా ఆశాల్ని,ఆశయాలు ను,ఇష్టాలను వదిలేసి శిలా మారిపోయాను.
రెండు నెలల్లో జరగవలసిన పెళ్లి, పది రోజుల్లో జరిగిపోయింది.
ఇష్టం లేని వ్యక్తి తో సంసారం చేయడం ఇష్టం లేక, అతన్ని బ్రతిమలుడుకున్న,
అతను నా మాట కూడా. మా పెద్దవాళ్లు వినలేదు సొర్ర్య్ నేను నీకు సహాయం చెయ్యలేక పోయాను, నీకు ఇష్టం లేకుండా నిన్ను ముట్టుకొను అన్నారు!అలానే రెండు నెలలు గడిచాయి ఇద్దరం ఫ్రెండ్స్ లా వున్నాం,నెమ్మదిగా అతని నుంచి పోరు మొదలు అయ్యింది. ఇష్టం లేకపోయినా మన వాళ్ళ కోసం మనం ఒకటి కావాలి అని బలవంతం చెయ్యబోయారు. నా తల రాతకు ఇతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. మనస్సును రాయి గా మార్చుకొని కన్నీలతో వంటికిమనస్సుకు అంటిన మాలినాన్ని కడిగేసుకుంటూ కాలం తర్వాత గడిపేస్తున్న, అతనిలో మార్పు నెమ్మదిగా పాప పుట్టింది.
ఒకసారి మా అక్క నాతో తోటికొడలు మీ ఆయన నీ కోసం పెద్ద యుద్ధం చేశారు.
నీకు ఇష్టం లేదు అని చెప్పావు అంత కదా.ఇంటికి వచ్చి ఆ అమ్మయి ని ఇచ్చి పెళ్ళి చెయ్యకపోతే నేను చేస్తా అని బెదిరించి వెంటనే పెళ్లి జరిగేలా చేసాడు.
మీ ఆయనతో తో జాగర్త అని చెప్పి ది.
అతను చేసిన మోసానికి నా హృదయం ముక్కలై పోయింది.అతను రాగానే ఆడిగేసా ఎందుకు ఇలా చేశావ్ అని.
అతను ఒకటే సమాధానం నేను చేతకాని వాడిలా కనిపించినా నీకు వదులుకోడానికి.
ఆ రోజు నుంచి తన అస్సలు రూపం చూపిస్తూ,క్షణం క్షణం నరకం చూపించాడు.
ఇంత మోసంచేసిన మనిషి తో జీవితం.
ఆశ లేదు కన్నీళ్లు తోడుగా గుండెను బండ గా మార్చుకొని బ్రతికేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఉన్న సమాజం ఎప్పటికి అర్ధం చేసుకుంటుంది. ఆడ పిల్ల మనస్సు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!