ఓరి బడవా?ఎంతపని చేసావు

(అంశము:: “కొసమెరుపు కథలు”)

ఓరి బడవా?ఎంతపని చేసావు

రచన: బోర భారతీదేవి

మామయ్య పెళ్ళితంతు ఆంతా పూర్తయ్యేసరికి రాత్రి బాగా లేటైయ్యింది. వేకువ జామున అంతా ఇంటికి చేరుకున్నారు. ఎవరికి దోరికన చోట వారు సర్దుకొని పడుతున్నారు.
అయినా తప్పదు కదా అని అమ్మమ్మ మామయ్య మాత్రమే లేచి కొత్త చుట్టాలకు మర్యాద చేయాలని కంగారు పడుతున్నారు. ఇంతలో ఆరేళ్ళ చింటు అలికిడికి లేచి మామయ్య దగ్గర కు వెళ్ళాడు. మామయ్య ఎందుకురా ఇంత త్వరగా లేచావు . పోయి పడుకంటావా? లేదా? నీకెంపని అంటూ దెబ్బలాడాడు. దాంతో చింటు బిక్క మొఖం పెట్టి అక్కడ నుండి వెళ్లి పోయాడు. ఉదయం పది గంటల వరకూ ఎవరూ కదలలేదు. అప్పుడు లేచి స్నానాలు భోజనాలు అంటూ
ఇల్లంతా సందడిగా ఉంది. ఎవరిపనులో వాళ్ళు బిజీగా ఉన్నారు.
చింటు గురించి ఎవరికి ద్యాసలేదు. టిఫిన్ పూర్తి అయ్యాక ఆ పక్కనే ఉన్న చిన్న అక్క ఇంటికి కొందరు బంధువులు, ఇటూ అటూ తిరుగుచున్నారు. ఇంతలో పిల్లలంతా ఓ చోట చేరారు.అందరికంటే చిన్నవాడైన చింటు ఏడని మామయ్య ను అడగడారు. చూడరా ఎక్కడో ఉంటాడు. మీ అందరికంటే ముందే లేచి తిరుగుతుంటే పడుకోమని చెప్పాను. ఎక్కడో పడుకొని ఉంటాడు వెతకండి అనగానే పిల్లలంతా కలిసి వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా చింటు కనబడలేదు? గోల చేస్తూ పిల్లలు చెప్పే సరికి ఎక్కడ లేని కంగారు వచ్చింది మామయ్యకు.రాత్రి వెళ్ళే ముందు వాళ్ళమ్మ వాడు ఉంటానంటున్నాడు . జాగ్రత్తగా చూసుకో నేను ఇంటికి వెళ్లి ఉదయం వస్తానని చెప్పింది. ఇంతలో వీడు ఎక్కడి కి వెళ్ళాడో అసలే ఊరికి కొత్త అంటూ వెతకడం మొదలు పెట్టారు. అందరి నీరసలు నిద్రలు మాయమైపోయాయి. చుట్టు ప్రక్కల తెలిసివారి అందరిల్లలోను వెతికారు. ఇంతలో అనుకున్నట్లు గానే వాళ్ళ అమ్మ వచ్చింది. ఇంకేముంది గోలగోల అందరూ చేరే వైపు పరుగులు తీసినా ప్రయోజనం లేదు. సాయంకాలం 5 గంటలౌతుంది. హాలో సోఫాలో వాళ్ళమ్మ, అమ్మమ్మ ఏడుపులు మీ భావ కి ఏమి సమాధానం చెపుతామంటూ గోల. పెళ్లి సందడి పోయి అంతా విచారంలో మునిగి పోయారు. మామయ్య నేను ఉదయం వాడిని కోపపడి ఉండకపోతే బాగున్ను అని కొని నేల మీద పడుకొన్నాడు. ఈ శబ్దానికి చింటు సోఫా కింద నుండి లేచి బయటకు వచ్చాడు. ఇంకేముంది అందరి మొఖాలలో ఆనందం. వాడు మాత్రం మొకం చూపించడం లేదు. ఎక్కడి వెళ్ళావు ఏమైయ్యింది. అని అడ్డుగా ఉన్న టవల్ తీసి చూస్తే ఒక్కసారిగా అందరూ ఘల్లుమన్నారు. చూస్తే వాడి మొకంలో రెండు కనుబొమ్మలను తీసేసుకున్నాడు. అందుకు భయపడి పోయి సోఫా కిందకు పోయి పడుకుండి పోయాడు. రాత్రి పెళ్ళి లో నిద్రలేదు కదా మత్తుగా పడుకున్నాడని మాట. నీవు చేసిన పనికి తిండి తిప్పలు లేకుండా ఊరంతా గాలించామంటూ. ఓరి బడవా? ఎంతపని చేసావంటూ అమ్మమ్మ దగ్గర కు తీసుకుంది. అంతా అప్పుడు భోజనాలు చేసారు.ఇంతకు జరిగిందేమిటంటే ఉదయం మామయ్య పడుకోమని చెబితే సందులో కి వెళ్ళాడు అక్కడ మామయ్య సేవింగ్ కోసం సిద్దంగా పెట్టుకున్న రేజర్ కనపడింది. ఎలా చేసుకుంటారోనని తన కనుబొమలను గీసాడట అంతే అద్దం చూసుకొని భయపడి పోయాడు. చేసిన తెలిసి అందరూ రెండు రోజుల వరకూ నవ్వుతూనే ఉన్నారు…..

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!