మాయ ప్రేమ

మాయ ప్రేమ

రచన:: జీ వీ నాయుడు

అంతా మాయ.. ఈ మాయా ప్రపంచంలో
ప్రేమలు ప్రణయాలు ప్రకటనల్లో ఆర్బాటాలు
మెప్పించడంలో ఘనులు నటనల్లోచాణిక్యులు
నిజం చెబితే చులకన అబద్దాలకే ఆదరణ
కాలాన్ని గిర్రున తిప్పుతారు కాలక్షేపం చేస్తారు
అరచేతిలో వైకుంఠం అచ్చుగుద్దిన్నట్లు అద్భుతం
అలాంటివారిదే కాలం అంతా మాయాజాలం
గొప్ప చదువర్లకు గాలం విదేశాల్లో విహారం
గడుస్తాయి కొన్నాళ్ళు ఆహ్లాదం ఆకాశమై
అప్పుడప్పుడూ అలా అలా అంతర్యుద్దాలు
బద్దలవుతాయి మనసులు మమతలు
పచ్చ గడ్డి వేస్తె బగ్గుమనే స్పర్థలు ఆగని మంటలు
తారాస్తాయికి చేరిన ప్రచ్చన్నయుద్దాలు
అప్పుడు బయట పడతాయి అసలు ప్రేమలు
అనురాగాలు ఆప్యాయతల రంకు రాగాలూ
ఒకరిపై ఒకరు దూషణలు ముష్టియుద్దాలు
చివరికి పోలీసుస్టేషన్లు కోర్టులల్లో వ్యాజ్యాలు
తెలిసిందిలే ప్రేమంతా నకిలీ అని తెలిసిందిలే
అంటూ ప్రేమదంపతులు పొందుతున్నారు విడాకులు
పడకండీ యువతీయువకులు మాయ ప్రేమలో…

………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!