జతగా

జతగా

రచన :: క్రాంతి కుమార్

నా కనులకు జతగా
నీలోనే ఆపేసిన కలలను ఇస్తావా
నిజముగా మలచి నీ ముందు ఉంచుతాను

నా ప్రయాణానికి జతగా
నీతో ఆగిపోయిన గమ్యాన్ని ఇస్తావా
గమనాన్ని ఆపకుండా నీకు తోడుగా ఉంటాను

నా సంతోషాలకు జతగా
నీలో దాగిన చిన్ని సరదాలను ఇస్తావా
ఉల్లాస తీరంలో ఉప్పొంగే ఆనందాలను ఇస్తాను

నా ఆలోచనలకు జతగా
నీలో ఉన్న జీవిత ఆశయాలను ఇస్తావా
ఆదర్శప్రాయంగా నిలిపి నీ దోసిట్లో ఉంచుతాను

నా ఏకాంతానికి జతగా
నీలోని స్వచ్ఛమైన చెలిమిని ఇస్తావా
ప్రేమతో కలిపి విడదీయరాని బంధంగా మారుస్తాను

నా మనసుకు జతగా
నీలోనే బంధించిన హద్దులులేని ప్రేమను ఇస్తావా
ప్రణయ కావ్యాన్ని రచించి నీకే అంకితం చేస్తాను

నా ఒంటరి జీవితానికి జతగా
నాతో ఏడడుగులు నడవడానికి వస్తావా
నా ప్రతి జన్మను నీకే సొంతం చేస్తాను

***

You May Also Like

One thought on “జతగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!