మాధురి

మాధురి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : మాధవి కాళ్ల

  మాధురి రా అమ్మ నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. సరే నాన్న వస్తున్నా అని బాక్స్ తీసుకొని వెళుతుంది మాధురి. శ్రీధర్ మాధురి ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేరు. శ్రీధర్ ఒక మధ్యతరగతి మనిషి. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అతని కోరిక. శ్రీధర్ భార్య జ్యోతి. వాళ్లకి ముగ్గురు పిల్లలు. చిన్న అమ్మాయి సింధు. అబ్బాయి రవి. వీళ్ళ ముగ్గురికి ప్రతి చిన్నగెస్ విషయానికి గొడవ జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు మాధురి, సింధు టీవీ చూస్తున్నారు అప్పుడే రవి వచ్చి నాకు రిమోట్ కావాలి  కార్టూన్ నెట్వర్క్ చూస్తాను అని చెప్పాడు రవి. సింధు ఏమో మేము ఇవ్వము మంచి సినిమా
వస్తుంది అని చెప్పింది. శ్రీధర్ కి వేరు ఊరికి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఇంటికి వచ్చారు. ఆ ఇల్లు చాలా బాగుంది చుట్టూ పచ్చని చెట్లు చుట్టూ పక్కల వాళ్ల చాలా మంచి వారు ఒక అబ్బాయికి మాధురి తొలి చూపులోనే నచ్చింది కానీ అతనికి (శేఖర్)కొంచం మొహమాటం ఎవరితోనేనా అంతే మాధురి ఇంటి ఎదురుగానే అతను ఇల్లు శ్రీధర్, ప్రకాష్ (అతను ఫాదర్) ఒకే ఆఫీసులో పని చేసున్నారు. మాధురి కి  ఈ ఊరు చాలా నచ్చింది ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తుంది. శేఖర్ మధురితో మాట్లాడాలని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ మొహమాటం వల్ల మాట్లాడలేకపోయాడు. మాధురి వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా కలిసి భోజనం చేశారు ఈ ఇల్లు చుట్టూ ఉండే పచ్చని చెట్లు ఇవి అన్ని చాలా బాగా నచ్చాయి నాన్న అని చెప్పారు సింధు, రవిలు వీళ్ళ ఇంటికి దూరంగా పాడుబడిన ఒక భవనం ఉంది ఆ భవనంలో అర్ధరాత్రి పూట ఏవో  శబ్దాలు వినిపిస్తే ఉండేవి ఈ విషయం అక్కడ వాళ్ళు శ్రీధర్ కుటుంబం కి చెప్పలేదు. కొత్త ప్లేస్ కావడం వల్ల నిద్ర పట్టడం లేదు మాధురికి అప్పుడే అర్ధరాత్రి కావడం వల్ల ఏవో శబ్దాలు వినిపిస్తే అక్కడికి వెళ్తున్నప్పుడు శేఖర్ చూసి పిలిచి మాధురి అటు వెళ్లొద్దు అది ప్రమాదకరమైన ప్లేస్ అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తాడు. అది కాదు శేఖర్ అక్కడ నుండి ఏవో శబ్దాలు వినిపిస్తే వచ్చాను అని చెప్పింది మాధురి. ఇక్కడికి కొంచెం దూరంలో పాడుబడ్డ భవనం ఉంది ఆ భవనం లో దెయ్యం ఉందని అందరూ అంటారు అని చెప్పాడు శేఖర్. నువ్వు ఎప్పుడేనా అక్కడికి వెళ్ళవా అని అడిగింది మాధురి. నేను వెళ్ళలేదు కానీ వెళ్ళిన వాళ్లు చనిపోయారని చెప్పుతున్నారు అని చెప్పాడు శేఖర్. మరుసటి రోజు మాధురి శేఖర్ ని తీసుకొని పాడుబడ్డ భవనానికి వెళ్ళింది అక్కడ ఎవరూ లేరు భయంతో శేఖర్ మాధురి పద ఇంటికి వెళదాం నాకు భయంగా ఉంది అని చెప్తాడు. అక్కడ ఓ మూలన ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది ఆ అమ్మాయి దగ్గరికి మాధురి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నువ్వు అని అడిగింది. నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టావా అని అడిగింది అమాయకంగా అమ్మాయి మాధురి చాలా బాధ పడుతూ తన బ్యాగ్ లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది ఆ అమ్మాయి సంతోషంగా తీసుకొని తిన్నది ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అని అడిగింది మాధురి మళ్ళీ నాకు తెలీదు నా పేరు రూప అని వాళ్లు పిలుస్తారు ప్రతిరోజు రాత్రి వచ్చి నన్ను బలవంతం చేస్తారు తర్వాత ఏవో శబ్దాలు చేస్తారు వాళ్లే అని ఏడుస్తూ చెప్తుంది. విన్నావా శేఖర్ పాపం ఈ అమ్మాయి ఎవరో తీసుకొచ్చి బలవంతం చేస్తున్నారు రోజు మనం ఏదో ఒకటి చేయాలి శేఖర్ దెయ్యం ఉంది అని సృష్టించారు  దెయ్యం లేదు ఏమీ లేదు గట్టిగా అరుస్తూ చెప్పింది మాధురి. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మాధురి అని అడిగాడు శేఖర్. ఇప్పుడు కాదు మనం మళ్ళీ రాత్రికి ఇక్కడికి రావాలి అని చెప్పింది మాధురి రూప నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి పద వెళ్దాం శేఖర్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. శేఖర్ కి ప్లాన్ గురించి చెప్పింది రాత్రికి ఏం చేయాలి ఏంటి అనేది ప్లాన్ గురించి వివరంగా చెప్పింది శేఖర్ దానికి అంగీకరిస్తూ సరే నేను చేస్తాను అని అన్నాడు. అర్ధరాత్రి అయిన తర్వాత భవనానికి ఇద్దరూ రహస్యంగా వెళ్తారు వాళ్ళ వెనకాతల ఎవరో వస్తున్నట్లు వినిపించి దాక్కున్నారు దగ్గర ఎవరో ముగ్గురు మగవాళ్ళు ఆ భవనం లో కి వెళ్లడం చూశారు అక్కడ కాసేపు అయిన తర్వాత రూప అరుపులు వినిపించాయి మళ్లీ ఏవేవో శబ్దాలు వస్తున్నాయి వీళ్లిద్దరూ రహస్యంగా భవనంలోకి ప్రవేశించి అక్కడ ఏం జరుగుతుందో చూసి వీడియో తీస్తున్నారు. అక్కడున్న రౌడీలు మాధురిని చూసి బలవంతం చేయబోయారు శేఖర్ ఏమో వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్టు చేశారు. పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పట్టించినందుకు థాంక్యూ యు చెప్పారు శేఖర్ మధురిలకు. ఎప్పుడో కిడ్నాపైన రూపని కాపాడినందుకు వాళ్ల తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!