చిన్ననాటి జ్ఞాపకాలు

చిన్ననాటి జ్ఞాపకాలు

రచయిత::జయకుమారి

ఏమి పిల్లలో ఏమో బాబు!అస్సలు మాట వినరు!కొట్టు కెళ్లి గుడ్లు తెమ్మంటే లక్ష కారణాలు చెబుతారు.ఏమి చెప్పాలి ఈ పిల్లలకి.

మా  చిన్నప్పుడు కొట్టుకి అంటేనే  ఎగిరి గంతేసి పరిగేట్టుకొని వెళ్ళేవాళ్ళం.కృష్ణ,నాగు, నేను,శ్రీను ఆ రోజులే వేరు అనుకుంటూ నవ్వుకుంటున్న తన తల్లి దగ్గరకు వెళ్ళి కూర్చుని వాళ్ళు ఎవరు అమ్మ అని  అడుగుతాడు రామ్.
నేను ఎందుకు చెప్పాలి?
ఆ వీధి చివరి కొట్టుకు వెళ్లమంటే  కూడా వెళ్లడం లేదు.!వెళ్ళి గుడ్లు తెచ్చి ఇవ్వుఅప్పుడు చెబుతా.
అమ్మ నువ్వు బా.. బ్లాక్మైలే చేస్తున్నావ్, ఇది అన్యాయం .
ముందు చెప్పిన పని చెయ్యి వేళ్ళు.ఈ లోపు నా పని చేసుకుంటా.నీకు బోలెడు కబురులు చెబుతా.!

చెప్పు అమ్మ ప్లీస్… ప్లీస్…

గుడ్లు తెచ్చి ఇవ్వు బంగారు కొండ అప్పుడు చెబుతా..

సరే అమ్మ ఐదు నిముషాల్లో గుడ్లు తో నీ ముందు ఉంటా.!

అన్న మాదిరిగా నే గుడ్లు తెచ్చి ఇచ్చి.ఇప్పుడు  చెప్పు అమ్మ. నీ చిన్నప్పటి విషయాలు.!

ఎందుకు రామ్ పక్కవాళ్ళ కబురులు అంటే అంత  ఇష్టం నీకు.సరే చెబుతా విను.!

చిన్నప్పుడు మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు.

అది అమ్మా !

ఇప్పుడు అమెరికా లో ఉన్నారు గా కృష్ణ అంకుల్ నా!

హా అవును.

మేమిద్దరం,మాకు తోడు నాగు అత్తయ్య, శ్రీను మావయ్య, రాంబాబు పెద్దనాన్న .  మేము అంతా మంచి స్నేహితులం ,ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళేవాళ్ళం, కలసి అడుకోవడం,తినడం అన్ని ఒకే చోటా.

అమ్మమ్మ ఒక సారి  కొట్టుకి వెళ్లమంది.నాతో పాటు వీళ్ళు కూడా వచ్చారు.మా వీధి చివర వీరబాబు కొట్టు ఉండేది.అక్కడ గుడ్లు,ఇంకా కొన్ని సరుకులు కొన్నాక కొంత చిల్లర మిగిలింది.
అది కృష్ణ చేతికి ఇచ్చాం అందరం కలిసి. వాడు ఆ చిల్లర డబ్బులో కొంచెం చిల్లర దారిలో పడేసాడు.ఇంక అంతే మా పని అయ్యిపోయింది అనుకున్నాం.

ఆ డబ్బులు వెతకడం కోసం  వెళ్ళడానికి. గుడ్లు రాంబాబు తో పంపి, మేము మళ్ళీ కొట్టు దగ్గరకు వెళ్ళాము.అక్కడ ఎవరితోనే వీరబాబు గారు.గానుగ గింజల ను  కొంటాము అని చెబుతున్నారు.అది విని కృష్ణ అన్నాడు, మనం గానుగ గింజలు తెచ్చి అమ్ముకుంటే పడిపోయిన డబ్బులు వస్తాయి కదా అవి మీ అమ్మ కి ఇచ్చేదాం అప్పుడు మనకు తన్నులు తప్పుతాయి.అప్పుడు కృష్ణ ఇచ్చిన సలహా అందరికి నచ్చి.వెంటనే గానుగ చెట్టు దగ్గరికి పరిగెత్తం,చెట్టు క్రింద పడిన గానుగ కాయలు అన్ని ఎరుకొని ఒక సంచిలో వేసుకున్నాం.అవి తీసుకొని కొట్టు కి వెళ్ళాము. తూకం వేసి 1రూపాయి ఇచ్చారు.
అంతేనా! ఒక్క రూపాయి నే వచ్చిందా అమ్మ!
అవును అప్పుడు అంతే!
మరి అమ్మమ్మకి ఇచ్చారా ఆ డబ్బులు.
ఏమిటి ఇచ్చేది! మేము పాడేసింది రెండు రూపాయలు.!
అవునా!
అప్పుడు ఏమి చేశారు అమ్మ!
ఏమి చేసామా! మళ్ళీ గానుగ చెట్టు దగ్గరకి పరుగున వెళ్ళాము.ఈ సారి చిన్న చిన్న రాయిలు తీసుకొని చెట్టు మీదకు విసురుతుంటే అవి రాలేవి వాటిని ఏరి సంచిలో వేసుకునే డ్యూటీ నాది.
కొట్టే డ్యూటీ కృష్ణ వాళ్ళది.అందరూ ఆపేశారు, నువ్వు కూడా ఆపేయి చాలు ఇవి అంటే వినకుండా కొడుతూనే ఉన్నాడు కృష్ణ, ఇదే చివరి సారి అని .
రా వెళ్లిపోదాం కృష్ణ అనే సరికి ఒక రాయి  వచ్చి నా తలకు తగిలింది.నాకు రక్తం బడబడా కారిపోతుంది.
అందరికి భయం వేసింది.
అది విసిరిన కృష్ణ మటికి గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు.
దెబ్బతగిలిన నేనే అంతలా ఏడ్చి ఉండను ఏమో.
హా..హా… చాలా అల్లరి చేసేవాడు.
అప్పుడు ఏమైంది అమ్మ?
ఏమైందా!
అందరూ దెబ్బ ఎవరికి తగిలిందా అని చూస్తున్నారు మా ఇద్దరిలో.
ఆ అంకుల్ ఎందుకు ఏడ్చాడు అమ్మ?
అదా !
అందరూ నా కోసం ఏడుస్తున్నాడు అనుకున్నారు కానీ..
వాళ్ళ అమ్మ కొడుతోంది అన్న భయం తో ఏడ్చాడు.
హా.. అవునా!
మరి కొట్టరా ! అదో పెద్ద స్టోరీ లే..
వాడు ఏడవడం చూడలేకపోయాను.
ఈలోపు అందరూ వచ్చేసారు. నా రక్తం చూసి అయ్యో ఏమైంది అని అడిగితే ఎవరు మాట్లాడటం లేదు.
నేను ఏమో ఏడుస్తూ రాయి తగిలింది అని చెప్పా,అమ్మమ్మ రాయి ఎందుకు తగిలింది అని గట్టిగా అడిగే సరికి ఇంకా ఏడవడం, నా వెనుక కృష్ణ ఏడవడం ఇది చూసి,తాతయ్య కి ఏమి జరిగిందో అర్ధమయ్యింది.
ఇప్పుడు ఏంటి ? పిల్లలు అలా ఏడుస్తుంటే మీకు కారణాలు కావాలా? ముందు పిల్లకి ఎంత పెద్ద దెబ్బ తగిలి రక్తం కారుతుందో చూసి.పదా హాస్పిటల్ కి తీసుకువెళదాం.అని హాస్పిటల్ కి తీసుకువెళ్లి కట్టు కట్టించారు.ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు గాయం ఎలా అయ్యింది అని,అప్పుడు కృష్ణ మొఖం చూడాలి.ఆ అమాయకపు మొఖం అలా గుర్తు ఉండి పోయింది ఇప్పటికీ నాకు అని తనలో తానే నవ్వుకుని.కృష్ణ చెప్పొద్దూ అని సైగలు చేస్తూవుండటం నాన్న చూశారు. ఈ లోపు కృష్ణ వాళ్ళ అమ్మ గారు వచ్చి, ఈ బడుగ్గాయి నే కదా! నీ మీద రాయి విసిరింది.అని కృష్ణ చెవులు మెలిపెడుతుంటే, తనని ఎక్కడ కొడతారో అని భయం వేసి, గబుకున్న కృష్ణ కాదు శ్రీను అని చెప్పాను ,ఆ క్షణం లో కృష్ణ ని కొడతారో ఏమో అని,కానీ చాలా బాధ అనిపించింది.
శ్రీను ఇక్కడ లేడు కదా,తనని కూడా ఏమి అనరులే అనుకున్న కానీ,రెండు రోజుల తర్వాత  ,మా అమ్మ ఉందిగా శ్రీను  వాళ్ళ అమ్మ మా ఇంటికి వస్తే చెప్పేసింది.
ఆమె ఉండు అక్క వాడి పని చెబుతా అంటూ ఇంటికి వెళ్ళింది.
ఆ పిన్ని వెనకాలే,నేను కృష్ణ కూడా వెల్లాము ఇంట్లోకి.

పిన్ని శ్రీను ని అడుగుతూ కోట్టా బోతుంటే మేము వెళ్లి పిన్ని కి జరిగింది చెప్పి శ్రీను ఏమి చెయ్యలేదు అని చెప్పాము.
అప్పుడు పిన్ని కోపం తో మీరంతా కలిసి వీడి మీదకు నెట్టసార.
అది కాదు పిన్ని అప్పుడు కృష్ణ వాళ్ళ అమ్మ గారు కోపంలో ఉన్నారు.
తనని కొడతారు అని భయం వేసి అలా చెప్పాము,శ్రీను అంటే కోపం లేదు,పైగా మాకు చాలా ఇష్టం కూడా,దెబ్బ తగిలినప్పుడు మీరు అక్కడ లేరు, అందులో అమ్మ వాళ్ళు కొడతరాని అబద్ధం చెప్పాము అంతే కాని కావాలని చెప్పలేదు అని బిక్క మొఖం పెట్టుకున్నాం, మాతో పాటు శ్రీను కూడా,మా ముగ్గురిని చూసి పిన్ని నవ్వేసింది.
సరదాగా అన్న లేరా ,మీరు భయపడకండి ఆడుకోండి వెళ్ళి అని సరికి భయం పోయి ఆడుకోడానికి వెళ్ళాం.

ఇంతకీ  దేని కోసం ఇంత  గొడవ జరిగిందో దాని కోసం అడగలేదు అమ్మ (చిల్లరకోసం).అలా జరిగింది రామ్ ,ఇప్పటికీ ఆ దెబ్బ తలలో అలానే ఉంది.అప్పటి స్నేహితులు, ఆ రోజులు ఎప్పటికీ తీయ్యనైన జ్ఞాపకాలు.కరెంటు పోతే అందరం కలసి ఒక చోట కూర్చొని కథ లు చెప్పుకోవడం, ఆటలు ఆడుకోవడం,ఆదివారం దూరదర్శన్ లో సినిమా,శుక్రవారం చిత్రలహారి, మట్టితో ఆటబొమ్మలు చేసుకోవడం,వీధి చివర వీరబాబు చిల్లర కొట్టు చూసి.. ఆకులు,పువ్వులు, కోసుకుని..బిస్కెట్లు మరమరాలు కొనుక్కుని వాటితో కొట్టు పెట్టుకొని అమ్ముకోవడం, కాలువల్లో స్నానాలు, వినాయకచవితి కి విధి తెరసినిమాలు,ఊరేగింపులు బోరు అనేది కొట్టేది కాదు, రూపాయి పట్టికెళితే బోలెడు చోకలెట్స్ వచ్చేవి.ఇప్పుడు రూపాయి కి విలువ లేదు. తాటిముంజులు,సీమచింతకాయలు,ఉప్పుకారం మామిడి ముక్కలు,నేరేడు పళ్ళు కోసం గోడలు ఎక్కడం,ఒక్క ఆట కాదు తినేటట్లు ఆడుకునే వాళ్ళం.ఇప్పుడు ఆ రోజులు తిరిగిరావు,
ఇప్పుడు పిల్లలు ఇల్లు కదలడమే గగనం, కంప్యూటర్ లు,ఫోన్ లు వచ్చిన తరువాత పరిస్థితి మరీ దారుణంగా తయారు అయ్యింది.యాంత్రికంగా బ్రతికేస్తున్నాం.

అవునా అమ్మ ! ఇంకా  చెప్పవా! మీ చిన్నప్పటి విషయాలు.
హా.. హా..!ముందు వంట చెయ్యాలి.అన్ని ఒక్కసారిగా చెప్పేస్తే  వినడానికి బోర్ గా ఉంటుంది.అందుకే తర్వాత చెబుతా వేళ్ళు,ఆడుకో అనినవ్వుకుంటుంది.జ్ఞాపకాలు మాత్రమే ఎప్పుడూ మన తో ఉండేవి.చిన్నప్పటి నుంచి ఎన్ని బంధాలు,మన చుట్టూ మనతో అందమైన మాలికల అల్లుకుపోతాయో కదా.!
పిల్లలకి కూడా బంధాలు గురించిన విలువలు తెలియచెప్పాలి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!