అవార్డు పొందిన మొదటి రచన

అవార్డు పొందిన మొదటి రచన

రచయిత:శ్రీదేవి శ్రీనివాస్( శ్రీ ❤శ్రీ)

సాయి మనోహరం గారు రాసిన రచనకు తెలుగు సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది అంటూ ఆయన ఫోటో వేసి టీవీ లో పదే పదే చెబుతున్నారు అది చూసిన ఆయన బంధువులకు ఇరుగుపొరుగు వారికి విదేశాలలో ఉన్న ఆయన పిల్లలకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది అదంతా అయోమయంగా అనిపించింది ఎందుకంటే ఆయన ఇదివరకెప్పుడూ రచనలు రాయనేలేదు. ఆ వార్త చూసిన వెంటనే విదేశాలలో ఉన్న ఆయన పిల్లలు ఇంకా చాలామంది బంధువులు కూడా వెంటనే ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు
ఆరోజు అవార్డు ప్రధానం చేసే రోజు అవార్డు ప్రధానం చేసే వారు ఆయనను అడుగుతున్నారు మీరు రాసిన “”వీధి చివర చిల్లర కొట్టు”” రచనకు గాను మీకు ఈ అవార్డు వచ్చింది కదా .తెలుగు సాహిత్య రంగంలో 2012లో రావూరి భరద్వాజ గారి రచన “”పాకుడురాళ్లు”” తరువాత మీకు ఇప్పుడు వచ్చింది .అది కూడా మీరు రాసిన మొదటి రచనకే జ్ఞానపీఠ్ పురస్కారం రావడం ఎలా ఉందో మా ప్రేక్షకుల కోసం మీ మాటల్లోనే తెలియచేయండి అని ఆయనకు అవకాశం ఇచ్చారు
అప్పుడు ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు ఇలా….
మొదట నా రచనను ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేయుచున్నాను
నాకు ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగానూ మరియు ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది నేను రిటైర్ అయిన చిరుద్యోగిని అదృష్టం కొద్దీ నా పిల్లలు ఉద్యోగాలు వచ్చి విదేశాలలో స్థిరపడ్డారు. మనుష్యుల వ్యక్తిత్వాల గురించి
ఏదైనా ఒక మంచి పుస్తకం రాయాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో నా మనసులో అలా ఉండిపోయింది ఎందుకంటే నా జీవితమంతా విభిన్న వ్యక్తిత్వాల గల వ్యక్తుల మధ్య సాగడమే దానికి కారణం .అయితే పుస్తకం రాయాలంటే ఆ కొద్ది మంది వ్యక్తుల అనుభవాలు సరిపోవు అనిపించింది నాకు మిగిలింది ఊహించి రాస్తే అది యదార్ధం అవ్వదు కనుక పూర్తిగా తెలుసుకున్నాకే రాయడం మంచిదని ఇన్ని రోజులు ఎదురు చూశాను దాని గురించి ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచంచి వీధి చివర ఒక చిల్లరకొట్టు ఒకటి పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాను
అది విన్న బంధువులు ఇరుగు పొరుగు వారు రిటైర్ అయిన తరువాత కొడుకుల వద్దకు వెళ్ళి సుఖంగా గడపడం మానేసి ఇప్పుడు ఈ వయసులో చిల్లర కొట్టు ఎందుకు అని నవ్వుకున్నారు అయినా నేను అవేమీ పట్టించుకోకుండా చిల్లరకొట్టు ఓపెన్ చేసాను అప్పట్నుంచి కొట్టు దగ్గరకి వచ్చిన మనుషులు కొట్టు వద్దకు వచ్చి కూర్చుని రకరకాల బాతాఖానీ లు మొదలు పెట్టేవారు అది విని వారి వారి వ్యక్తిత్వాలు, ఉద్దేశాలను ఒక పుస్తకం మీద రాసుకునే వాడిని ప్రతీ రోజూ.
నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా వారిని కనిపెట్టేవాడిని .ఎందుచేతనంటే మనం ఎదుటి వ్యక్తి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే వాళ్ళనే ఎక్కువగా మాట్లాడనివ్వాలి మనంఅవసరమైనంతమేరకే మాట్లాడాలి . మొదట్లో అయితే కొత్తగా వచ్చిన వారు ఎవరైనా నన్నుచూసి మూగవాడేమో అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.అలా తెలుసుకుని తెలుసుకొని చిల్లర కొట్టు లో ఎన్ని రకాల సరుకులు ఉంటాయో వాటి కంటే ఎక్కువ అయినా మనుషుల వ్యక్తిత్వాలను చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను అది అందరికీ తెలియజేయాలనే ఈ పుస్తకం రాశాను ఎందుకంటే మనుషులు ఇది చదివి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వారి దగ్గర ఎలా మసలుకోవాలో తెలుసుకొని జాగ్రత్త పడాలి అని నా ఉద్దేశం ఇక నా పుస్తకానికి “”వీధి చివర చిల్లరకొట్టు”” అని పేరు ఎందుకు పెట్టాను అని అనుకుంటున్నారా నేను ఈ పుస్తకం రాయడానికి అదే నాకు సహాయ పడింది గనుక మనిషి ఊహించి రాసిన దానికే ఎంతో ఆదరణ దొరికే సమాజంలో మనుషులలో ఉండే యదార్థ వ్యక్తిత్వాలను గురించి రాశాను గనుకే నాకు నాపుస్తకం ఈ అవార్డును తెచ్చిపెట్టింది
నా మొదటి రచన కే ఈఅవార్డు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది .నా పుస్తకాన్ని ఆదరించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను
అందరికీ నా నమస్కారాలు అంటూ సాయి మనోహర్ గారు ముగించారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!